Monday, September 15, 2014

ప్రపంచీకరణని కవిత్వం తో ఆపగలమా...

ప్రపంచీకరణని కవిత్వం తో ఆపగలమా...

ఈ మధ్య ప్రపంచీకరణ వ్యతిరేక కవిత్వం,వ్యాఖ్యలు ..ఎక్కడ చూసినా ఇవే.మరి ఎందుకని జనాల్లో పెద్ద గా స్పందన లేదూ..!కనిపిస్తున్న ప్రతి రంగాన్ని ప్రభావితం చేసిందది..ఇంకా చేస్తున్నది కూడా..!అయితే దానివల్ల ప్రయోజనాలు కలగలేదా..అది ఒక విచారించవలసిన విషయమే..

అందరూ అనలేనుగాని,చాలామంది లో ప్రపంచీకరణ గురించి ఎవో కొన్ని వ్యాసాలు కొన్ని చదవడం..వినడమే గాని ఇంకా లోతైన స్వంత విశ్లేషణలు చేస్తున్నారా అనిపించకమానదు.కొన్ని పడి కట్టు మాటలు..ఖండనలు.అంతే..! పై స్థాయి లో అన్ని రాజకీయనాయకత్వాలు ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు.చాలా తెలివిగా..! లేనట్టయితే..బినామి పేర్లతో ఉన్న వారి విదేశీ వ్యాపారాలు,ఆస్తుల కూసాల్ని ఎలా కదిలించాలో పై నున్న గంధర్వులకి తెలుసు.అవును..వాళ్ళు గంధర్వులే..ఆ స్థాయిని ఎప్పుడో చేరుకున్నారు.అవసరమైతే మన టాయిలెట్ కార్యక్రమాలనుంచి నిద్రపోయేదాకా ..మన దినచర్యని..అవి దేశాధినేతలు కావచ్చు..ఇంకోకరు కావచ్చు..మానిటరింగ్ చేయగలరు.ఏ దీర్ఘ రోగాలనైతే ప్రవేశపెట్టారో వాటికి మందులు రావు.భారతీయ సమాజం ఇంట్రోవర్ట్ కాదు..అలాగని ఎక్స్ట్రావర్ట్ కాదు. అదీ అసలైన సమస్య.ప్రస్తుతం మనం ఒక వర్చ్యూల్ ప్రపంచం లో ఉన్నాం. ఏ వార్త ఎంతదాక నిజమో..ఏ సమాచారం ఎంత దాకా విశ్వసనీయమో..ఏ నిజం తో కలిసి ఏ అబద్దం ఉన్నదో అంతా మానిటరింగ్ చేయబడుతున్న వ్యవస్థలో ఉన్నాం.కొంతమంది తెలిసి పాత్రలు పోషిస్తున్నారు..కొంతమంది తెలియక పోషిస్తున్నారు..అంతే తేడా..! కఠినంగా ఉండవచ్చుగాని..ఇప్పుడు చేసి మార్చగలిగేది ఏమీ లేదు...కొన్ని స్లోగన్లతో..కొన్ని అరుపులతో..!

నిజంగా చేగలిగితే అది కొంత ..కాదు ...చాలా రక్తం ధారపోయగలిగితేనే సాధ్యం.అంత తీరిక ఎవరికున్నదిప్పుడు.Click here











1 comment:


  1. టెన్నీసు రాకెట్టు తో నయాగరాని ఆప గలమా !!

    జిలేబి

    ReplyDelete