Wednesday, September 17, 2014

ఇంకొకటి ఆ నవలలో చిత్రణ ద్వారా తెలిసేదేమంటే సిసిలీ లోని ప్రతి ఇంటిలో Rye తో చేసిన మద్యాన్ని పెట్టుకొని చక్కగా తాగుతుంటారు.

The God Father నవల సంక్షిప్తీకరణలో కొన్ని సరిగమలు-4

గాడ ఫాదర్ నవల చదివిన తర్వాత ,చాలా ఏళ్ళకిందటి మాట,ఆ సినిమా మొదటి పార్ట్ చూశాను.కొన్ని పాత్రలు నేను మనసులో ఊహించుకున్నదానికంటే మంచిగా ఉన్నాయనిపించింది.అంటే కాస్టింగ్ చేసిన వారిని ఆ మేరకు అభినందించవలసిందే.అలాగే కొన్ని పాత్రలకి ఊహించినదానికంటే భిన్నంగా ఉన్నారు పాత్రధారులు.

ముఖ్యంగా గాడ్ ఫాదర్ పాత్రకి Marlon Brando ని ఎన్నుకోవడం మంచి సెలెక్షన్ గా తోచింది.నాయకుడు సినిమా  లో కమల్ హాసన్ కూడా బ్రాండో ఆహార్యాన్ని ,మేనరిజంస్ ని అనుసరించినట్లుగా అనిపిస్తే అది పొరపాటు కాదు.అయితే తనదైన బాణీ ని కలిపాడు.Power ని Underplay చేయడం లో ..బ్రాండో శైలి సహజంగా ఉంటుంది.ముఖ కవళికలు నవలలో వర్ణనకి దగ్గరగా ఉంటాయి.అయితే గాడ్ ఫాదర్ సినిమా చూస్తే ఇటలీ నేపధ్యం ,ఆ పరిసరాల పరిస్థితులు పెద్దగా ఏమీ తెలియవు.కొండని అద్దం లో చూసినట్టుగా ఉంటుంది.సరే..సినిమా యొక్క కాలపరిమితి తక్కువ ..కాబట్టి మనం అర్ధం చేసుకోవచ్చును.

Solozzo హోటల్ లో Michael తో ఇటాలియన్ భాషలో మాట్లాడుతున్నప్పుడు హఠాత్తుగా వింటేమటుకు ఎవరో తెలుగు లో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది సినిమా లో..మన లాగానే అది అజంత భాషయే కదా..!

కుటుంబ విలువలు,వివాహం విషయాల్లో వారి కేథలిక్ సంప్రదాయాలు భారతీయత కి దగ్గరగా అనిపిస్తాయి.అయితే మరీ జిరాక్స్ కొట్టినట్లు ఉండవనుకోండి.నవల్లో ముఖ్య పాత్ర అయిన Don Vito Corleone ని Don అని God father అని సంభొదిస్తుంటాడు రచయిత.సిసిలీ లోని జీవిత చిత్రాన్ని మన కళ్ళముందు పరిచినట్లుగా రాస్తాడు మేరియో ప్యూజో. God father యొక్క భార్య Maria  సగటు భారతీయ మహిళ మాదిరిగా గృహానికే పరిమితమై ఉంటుంది.ఈయన చేసే కొన్ని పనులు నచ్చకపోయినా ..ఏమీ చేయలేక చర్చి కి వెళ్ళి అతని ఆత్మ రక్షణ కై ప్రార్దిస్తూ ఉంటుంది.ఆమె అమెరికాకి,మొదటి జెనెరేషన్ వ్యక్తి కనక ఆమె ఇంగ్లీష్ భాష కూడా ఇటాలియన్ యాసతో కలిసి గమ్మత్తుగా ఉంటుంది.అది నవల్లో బాగా ఆనందించగలం.ఇక వారి సంతానం Sonny,Michael,Fredo,Connie  వీళ్ళంతా అమెరికాలో పుట్టి ,పెరగడం వల్ల ఆ సంస్కృతి లో ఉంటారు.అయితే Don యొక్క ముఖ్య అనుచరులు,బంధువులు,బాడీ గార్డ్స్ చాలామట్టుకు ఇటాలియన్ మూలాలు కలిగిఉంటారు.

గాడ్ ఫాదర్ కి కుటుంబ వ్యవస్థ మీద కూడా నమ్మకం ఎక్కువ.అతని గాడ్సన్ Johnny మొదటి భార్య,పిల్లల్ని విడిచి పెట్టి ఓ సినిమా స్టార్ ని చేసుకున్నప్పుడు డాన్ అతన్ని చీవాట్లు పెడతాడు.

ఇంకొకటి ఆ నవలలో చిత్రణ ద్వారా తెలిసేదేమంటే సిసిలీ లోని ప్రతి ఇంటిలో Rye తో చేసిన మద్యాన్ని పెట్టుకొని చక్కగా తాగుతుంటారు.మనం ఆవకాయ పచ్చడి పెట్టుకున్నట్లు ఆ మద్యాన్ని పెట్టుకొని ఇంటికొచ్చిన అథితులకి కూడా మర్యాదపూర్వకంగా ఇస్తుంటారు.మన దేశీయులు ఆవిరి పద్ధతిలో విప్పసారాయి చేస్తే అది స్కాచ్ లాగానే ఉంటుంది.కాని అత్యాశతో దానిలో రకరకాల రసాయనాలు కలిపి కలుషితం చేయడం తో అది విషతుల్యం గా మారింది. research and development  అనే దాన్ని ప్రతి ప్రోడక్ట్ కి జతజేసి నాణ్యతని పెంచుతూ వాళ్ళు ప్రపంచం అంతా వ్యాపారం చేస్తారు.మనం ఎక్కువగా ఉన్న స్థితి తో సంతృప్తి పడతాం.అంతే తేడా..!Click here  

No comments:

Post a Comment