Saturday, September 20, 2014

మాండలిన్ శ్రీనివాస్ జీవితం లోని విషాదమే అతన్ని తొందరగా తీసుకువెళ్ళిందా..?

మాండలిన్ శ్రీనివాస్ జీవితం లోని విషాదమే అతన్ని తొందరగా తీసుకువెళ్ళిందా..?

ఏవిటో ..ఈ జీవితం నిన్న గాక మొన్న ఆ కుర్రాడి గురించి బాలమేధావి అంటూ చదువుతూ ఎంతో ఆనదించేవాళ్ళం..తెలుగువారిలోనుంచి ఒక గొప్ప మాండలిన్ జీనియస్ వచ్చాడని..! కాని ఎటూకాని 45 ఏళ్ళ పిన్నవయసులో అస్తమించడం చాలా బాధగా అనిపించింది.నిజం చెప్పాలంటే చాలామంది తెలుగు వారికి శ్రీనివాస్ యొక్క గొప్పదనం ఏమిటో ఈనాటికి తెలియదు..తమిళులతో పోలిస్తే..!కర్ణాటక సంగీతాన్ని Western classical,folk,pop మ్యూజిక్ లతో కలిపి మాధుర్యభరితమైన Fusion ని సృష్టించాడు.మాండలిన్ కి ఉండే ఏడు స్ట్రింగ్స్ ని అయిదుకి కుదించి తనదైన శైలిలో వాయిద్యాన్ని తయారు చేసుకున్నాడు.ఎలెక్ట్రిక్ మాండలిన్ ని కర్ణాటక సంగీతం లో..ముఖ్యంగా కచేరిల్లో వాడటం అతనితోనే ప్రారంభమైంది.విఖ్యాతి చెందిన Western musicians అయిన Michael Brook,John McLaughlin,Nigel Kennedy,Trey Gunn,Michael Nyman వంటి వారితో కలిసి ప్రపంచవ్యప్తంగా కచేరీలు ఇచ్చి రెండు ధ్రువాలను తన మాండలిన్ తో ఏకం చేశాడు.

అయితే అతని వ్యక్తిగత జీవితంలో కొంత విషాదం ఉన్నట్లు ఉన్నది.2012 లో అనుకుంటా అతను భార్యతో విడాకులు తీసుకున్నాడు.ఆమె తనను మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నట్లు నిరూపించి అపెక్స్ కోర్ట్ అవి పొందాడు.అప్పటికే ఒకరు సంతానం ఉన్నారు.భార్య ఒక ఐ.ఏ.ఎస్.అధికారి క్మార్తె అని తెలుస్తున్నది.ఏది ఏమైనా చాలామంది గొప్ప కళాకారుల జీవితాల్లో వ్యక్తిగత మైన ఏదో విషాదం ఉంటుంది..అదేమిటోగాని.లివర్ ప్రాబ్లం వల్ల చనిపోయాడని అంటున్నారు.బహుశా అల్కాహాల్ గాని లేదా డయాబెటిస్ వంటి వాటివల్లనే అలా ఎక్కువగా జరుగుతుంది. నిన్న ప్రఖ్యాత తబలా కళాకారుడు Zakir Hussain శ్రీనివాస్ ని ఉద్దేశించి ఘటించిన అంజలితో దీన్ని ముగించడం సమంజసం." Today Mother India cries,today a part of Indian music dies and we are orphoned,RIP my dear brother Mandolin Srinivas"  Click here 

No comments:

Post a Comment