Wednesday, October 8, 2014

చదువుకుని,ఆర్దిక వెసులుబాటు ఉన్నవాళ్ళలో కూడా ఆత్మహత్య లు ఎందుకు పెరుగుతున్నాయి..



ఇటీవల ఇక్ఫాయ్ యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న వ్యక్తి పిల్లల్ని చంపి తాను ఆత్మహత్య చేసుకోవడం వెనుక ఈ తరం లేవనెత్తుతున్న సమస్యలు ఉన్నాయి.భార్య కూడా విద్యాధికురాలే..ఆర్దిక వెసులుబాటు ఉన్న సంసారమే వాళ్ళది.సరే..వాళ్ళకి పడలేదు.విడాకులు తీసుకున్నారు.కాని అంత తీవ్రమైన నిర్ణయం తీసుకోవడం ఏమిటి అని బయట నుంచి చూసేవాళ్ళకి అనిపించవచ్చు.కాని ఇక్కడ ఓ ప్రధాన విషయం గుర్తుంచుకోవాలి.ఆర్దిక సమస్యల కంటే ..వైవాహిక పరమైన సమస్యలు ..అలజడులు ..చదువుకున్నవారిపై ఎక్కువ ప్రభావం చూపిస్తాయి.ఎందుకంటే చదువుకున్న కొద్దీ ..జ్ఞానం పెరుగుతున్న కొద్దీ ఒకరి ఆధిపత్యాన్ని ఒకరు సహించే పరిస్థితి ఉండదు.ఈగో లు అడ్డంగా పెరిగిపోతాయి.ఇక్కడ ఆడవారికి ఒక వెసులుబాటు ఏమంటే సమాజం నుంచి వెంటనే సానుభూతి లభిస్తుంది.మగవాడు కొన్ని సమస్యలు  బయటకి చెప్పుకుంటే అతడిని ఇంకా చులకనగా చూసే సమాజం మనది.మనం అలవాట్లలో,ప్రాక్టికల్ గా సమస్యలు పరిష్కరించుకోవడంలో,పూర్తిగా పాశ్చ్యాత్యుల లాగా ఉండం..అలాగని పూర్తి భారతీయుల లాగా ఉండము.ఇక్కడ వస్తున్నది అసలు సమస్య.దీనికి తోడు భార్య భర్తల కి దగ్గరి బంధువులు ఇంకా అగ్నికి ఆజ్యం పోసినట్లుగా రెచ్చగొడుతుంటారు.పిల్లలు దీని మధ్యలో ఘోరంగా దెబ్బతింటూ ఉంటారు.చాలామంది ఊహిస్తున్నట్లుగా ఉండవు..భార్య భర్తల మధ్య గొడవలు..అవి ఏ కేసుకి ఆ కేసే ప్రత్యేకం.దేనిని ఇంకో దానితో పోల్చకూడదు.వెంటనే ఒక జెండర్ తేడాని బట్టి తప్పనిసరిగా వాళ్ళదే ఖచ్చితంగా తప్పు అయి ఉంటుందని కూడా భావించరాదు.చాలా లోతుకి వెళ్ళి అసలైన కారణాలు వెంట్రుక వాసిలా ఉంటాయి వాటిని కనుక్కొని అనాలసిస్ చేసి రాబోయెతరాలకి దిశా నిర్దేశం చేసేలా ఉండాలితప్ప బండగా ఒకరిని నిందిస్తూ పేపర్లలో రాయడం వల్ల సమాజానికి చెడే తప్ప మంచి జరగదు.Click here  

No comments:

Post a Comment