Saturday, October 11, 2014

ఒడిశా వెళ్ళిన తరవాత ఆ స్టేట్ మీద ఉన్న అభిప్రాయం మారింది.


చాలామంది లాగానే కొన్నేళ్ళ క్రితం దాకా ఒడిశా అంటే చాలా వెనుకబడిన స్టేట్ అని,పెద్ద నాగరికత గల రాష్ట్రం కాదని తలచేవాణ్ణి.కొన్ని జిల్లాల్లో నిరక్షరాస్యత ,పేదరికం ఉన్న మాట నిజమే గాని ..ముఖ్యంగా దక్షిణ జిల్లాల్లో ..! దేశం లోని కొన్ని విలక్షణ సంస్కృతులకు ఆలవాలమైన రాష్ట్రమది.మంచో..చెడో గాని ఎక్కడికైనా ఒంటరిగానే పోవడం నాకిష్టం. ప్రత్యేకంగా ఏవొ కొన్ని స్పాట్స్ ని ఎంచుకొని వాటిని చూసి రావడం నాకు కాని పని.నాకు ఎక్కడ దిగాలనిపిస్తే..అక్కడ దిగుతా..ఎక్కడ వీలుంటే అక్కడ ఉంటా..ఏది దొరికితే అది తింటా..నా షెడ్యూలంతా అలా ఉంటుంది కాబట్టి నా మిత్రులెవరూ నాతో రావడానికి పెద్దగా ఇష్టపడరు.కొన్ని ఏళ్ళ క్రితం అదే బాట లో ఒడిశా వెళ్ళాను.ఎదో రొద లోనుంచి బయట పడ్డట్లు అనిపించింది.ఆ వాతావరణమంతా ఎక్కడ పెద్ద హంగామా ఉన్నట్లు కనపడదు..చివరికి భుబనేశ్వర్ రైల్వెయ్ స్టేషన్ తో సహా.!ఒకే ఒక్క హోటల్ లోపల ఉంది ..రేట్లు ఓ మాదిరిగా ఉన్నాయి. అసలు ఓ రాష్ట్ర రాజధాని లో అన్ని గుళ్ళు ఉండటం నేనెక్కడా చూడలేదు.బహుశా కొన్ని వందలు ఉంటాయనిపించింది.అయితే లింగరాజ్ టెంపుల్ మటుకు మకుటాయమానంగా ఉంది.లోపల ఫోటోలు తీయనివ్వలేదు.శిల్పం లో గాని,చిత్ర లేఖనం లో గాని ఒడిశా కి ప్రత్యేకమైన శైలి ఉంది. దేవాలయ నిర్మాణం లో ఒక విన్నూత్న ఒరవడి..అది మళ్ళీ నేను అలా తమిళ నాడు లోనే చూశాను.కాకపోతే ఎర్ర మట్టి కలిసి ఉంటుంది.మన లానే బెంగాలీ వాళ్ళు వీరిని చిన్న చూపు చూస్తారు.ఒడిశా లో ఉండే బెంగాల్ వాళ్ళని అక్కడి వాళ్ళు కేరా బంగాల్ అని ఆటపట్టిస్తారు.ఒడియా మాటల్లో సంస్కృతం కలిసివున్న వెంటనే నోటికి అంకవు.కాని ఒక అందం ఉంది ఆ భాషలో కూడా ..బస్ స్టాండ్ లో గాని..మార్కెట్ లో గాని ఎక్కడికి వెళ్ళినా ఒక్క మాట ఒడియా రాకపొయినా ఇబ్బంది లేదు.అంతా హిందీ లో మాట్లాడటానికే ప్రయారిటీ ఇస్తారు.ఇప్పుడిప్పుడే కొంత ఒడియా భాషాభిమానులు పుంజుకుంటున్నారు.తిగిరియా అనే చోట కొంత మంది తో మాట్లాడగా ఎందుకనో గాని తెలుగు వాళ్ళని బ్రిటిష్ వారి మాదిరిగా పరిగణిస్తారు అనిపించింది. ప్రతి ఒక్కళ్ళకి కలకత్తా లో చదువుకోవడం..అక్కడ బంధువులు ఉండడం..వెళ్ళిరావడం అదంతా ఒక విషయం.ఆ సాంగత్యం మూలానా..ఇంకేమో... ఇంగ్లీష్ లో రచనా వ్యవహారం కూడా ఎక్కువ...మనోజ్ దాస్ ,సీతాకాంత్ మహాపాత్ర ఇట్లా ఒక ఒరవడి అనేది ఉన్నది.అది కొనసాగుతున్నది.ఇక్కడ ముఖ్యమంత్రులు అయితే పట్నాయక్ లు లేదా బ్రాహ్మణులు ..అంతే.ఒకరిద్దరు వేరే వాళ్ళు వచ్చినా వీళ దే ఎక్కువ ఆధిపత్యం కనిపిస్తుంది.By the way..here I am giving you an Odiya song link which I like for its beautiful Tune and words.

http://incredibleorissa.com/videos/anjali-oriya-movie-song-video/

No comments:

Post a Comment