భారతీయులు పాస్ పోర్ట్ ఉంటే చాలు వీసా లేకపోయినా కొన్ని దేశాల్లో పర్యటించవచ్చును.కొన్ని దేశాలైతే మనం అక్కడకి వెళ్ళగానే వారే వీసా ఇస్తారు ఎలాంటి బాదరాబంది లేకుండా..!ఎప్పుడైనా కుదిరితే వెళ్ళి రావచ్చుగదా..!మనకు పాస్ పోర్ట్ ఉంటే చాలు..మనం ప్రవేశించగానే ఈ కింది దేశాలు వీసా ని మంజూరు చేస్తాయి.
బొలీవియా-30 రోజులు దాకా
కాంబోడియా- 30 రోజులు
గుయానా- 30 రోజులు
ఇండోనేషియా -30 రోజులు
జోర్డాన్-15 రోజులు
కెన్యా-3 నెలలు
మాల్దీవులు- 3 నెలలు
సోమాలియా- 30 రోజులు
లావోస్-30 రోజులు
టోగో-7 రోజులు
ఇలా కొన్ని దేశాలు మనం వెళితే చాలు,వీసా ని అందజేస్తాయి.హాయిగా పర్యటించిరావచ్చు.
అసలు వీసా లేకుండా భారతీయులు పర్యటించగల కొన్ని దేశాలు ఈ కింద ఉన్నాయి.
నేపాల్- అనుమతి తో నివసించవచ్చును కూడా.
భూటాన్-
దొమినిక-6 నెలలు దాకా
ఈక్వడార్ -3 నెలలు
మారిషస్-3 నెలలు
గ్రెనెడా-3 నెలలు
ఎల్ సాల్వడర్- 90 రోజులు
ఫిజి- 4 నెలలు
హాంగ్ కాంగ్- 4 నెలలు
మకావు- 30 రోజులు.
Nice post!
ReplyDelete