కొన్ని తెలుగు నవలల్ని చదివాను.ఇంకొన్ని ఇంగ్లీష్ నవలల్ని చదివాను.తేడా కొన్ని విషయాల్ని ఎక్కడ ఫీలయ్యాను అంటే మనం అనుకున్నది కొద్దిగా తెర మరుగు గా చెబుతాము.వాళ్ళు విప్పినట్లుగా చెబుతారు అంతే తేడా.నన్నడిగితే వారి భావ ప్రపంచం లోకి ఎంతో కొంత నేరుగా ప్రవేశించేది వారి డైరెక్ట్ నవలలు చదివితేనే.. ఒక్కసారి మొదట్లో హతాశులమౌతాము..కాని క్రమేపి అలవాటు పడతాము.అయితే ఎందుకో గాని ఒక నిజాయితీని దానిలో ఫీలవుతాము.ఆడవాళ్ళలో గాని,మగవాళ్ళ లో గాని ఒక దమ్ము కనిపిస్తుంది.అసలు మనిషి స్వభావం అదే.మనం తెరలు కొన్ని పేర్లతో కట్టుకుంటాం గాని..!
నిజం చెప్పాలంటే Herald Robbins దీనికి పరాకాష్ట.అలాగని ఆ పాత్రల్లో సుకుమారత్వం లేదా..ఉంది.సెక్స్ విషయం లో నిజాయితీ గా ఉండటమే సర్వ సలక్షణాలకి మూలం అని మనం అనుకుంటాం.సృష్టిలోని ఆనందకర విషయాల్లో అది ఒకటి మాత్రమేనని వారు అనుకుంటారు.తన మొదటి భర్త తో ఎన్ని రకాలుగా అనుభవించానో రెండవ భర్త తో హాయిగా చెబుతుంది ఇంగ్లీష్ నవల్లో హీరోయిన్.
ఫలానా వాడికి తో ఒక ఎద్దు తో వెళ్ళినట్లుగా ఉందని తన స్నేహితురాలితో చెబుతుంది..! అది మనకి గుండెలు ఝల్లుమన్నట్లుగా ఉంటుంది. సరే..మగ వేశ్యల తో ..కధా కమామీషు చదవాలంటే..The Pirates చదివి తీరాలి.సెక్స్ మనకి జీవితం.ప్రాణాలని సైతం హరించే మహమ్మారి.రోజూ జిల్లా టాబ్లాయిడ్ లని చూడడం లేదు..ఈ రకం హత్య..ఆత్మ హత్యలని..వారికి ..సమస్త ఆనంద కర క్రీడల్లో ఇది ఒకటి.Click here
No comments:
Post a Comment