Monday, December 15, 2014

"చక్రి" చేసిన పాటల్లో ఇవంటే నాకు బాగా ఇష్టం.


"చక్రి" చేసిన పాటల్లో ఇవంటే నాకు బాగా ఇష్టం."ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు" సినిమా లో చాలా చక్కని స్వరాలు కూర్చాడు.దానిలో పాటలన్నీ చాలా బాగుంటాయి.అసలు వంశీ ఆయన ..సెలక్షన్ ఎప్పుడూ వమ్ము కాదు మెలొడి కి సంబందించి.వెన్నెల్లో హాయ్ హాయ్..కావచ్చు,ఇంకా చిన్న బిట్లు మాదిరిగా వచ్చే ..ఓ నేస్తామా..అనే పాట,నీవు అంత తెలుపు..ఎన్నెన్నో వర్ణాలు, పొగడమాకు అతిగా .. ఇంకా మిగతా అన్నీ కూడా విన్నకొద్ది వినబుద్ది అవుతాయి.ఈ మధ్య కాలం లో వచ్చిన మంచి పాటల్లో కొన్ని అని చెప్పవచ్చు.

నైరే.. నైరే.. లాంటి పాటల్లో అతని గొంతు చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది.పాపం అనిపిస్తుంది 40 ఏళ్ళ లో మరణించడ.ఎందుకని ఒబేసిటి ని ఈయన కంట్రోల్ చేసుకోవడం లేదు..చాలా అసాధారణంగా అయినాడే అని ఆమధ్య ఎక్కడో చూసిన తర్వాత అనిపించింది.సరే..తన సంతకం ని ..తన కళ ద్వారా వదిలి వెళ్ళిన ప్రతి మానవుడు అమృతపుత్రుడే..వారి ఆత్మకి శాంతి కలుగు గాక..!

No comments:

Post a Comment