కృతజ్ఞత (Thankfullness) అనేది మనిషి జీవనం లో చాలా కీలక పాత్ర పోషించినట్లే,జాతుల జీవనం లో కూడా కనబడని పాత్ర పోషిస్తుంది.అసలు దీన్ని ఒక Virtue గానే అంగీకరించని వారూ ఉన్నారు.ఒకవేళ కొందరు అంగీకరించినా దానిని చేతల్లో పాటించడానికి బద్ధకించేవారూ ఉన్నారు.
గాడ్ ఫాదర్ ' నేపధ్యం లో దీన్ని విశదీకరించడానికి ప్రయత్నిస్తాను.Don Corleone తన దగ్గరకి సాయం కోసం వచ్చే వారికి తనకి చేతనైనంత చేసి వారిని పంపిస్తుంటాడు.మళ్ళీ అవతవాళ్ళు Amerigo Bonasera,Johnny Fontane,Enzo ఇలా ఎవరైనా గాని తిరిగి అవసరైనపుడు డాన్ కి తమ చేతిలోనున్న మేరకు సాయం చేయడానికి తయారుగా ఉంటారు.అదే రుణం తీర్చుకోవడం మన మాటల్లో..!
అది కూడా సుగుణమేనా అంటే ..నిలువెల్లా స్వార్ధం నిండిన ప్రపంచంలో మానవుని పరిధి లో అది చాలా గొప్ప సుగుణమే.అపకారికి ఉపకారము చేయడానికి దైవత్వం పరిధిలోకి పోవాలి..కనీసం మనకి సాయం చేసిన వారికి తిరిగి ఏదో ఒక సాయం చేయడం మనసుకి ప్రశాంతతనిస్తుంది.
వాడిదొట్ఠి బిజినెస్ మైండ్రా ' అంటారు కొంతమంది.దాని అర్ధం కొంత వేరే Context లోకి పోతుంది.నిజమైన బిజినెస్ దృష్టి ఉన్నవాడు ఎవరూ ఏదీ ఉత్తి పుణ్యానికి తీసుకోవాలని చూడరు.
కొంతమంది ఉంటారు..ఎంతసేపు న్వేం చేస్తావు నాకు..అంతే..!ఇవతలివాడు 10 పైసలు విలువ చేసే పని మనకి చేసినా కనీసం 1 పైసా విలువ చేసే పని తిరిగి చేకపోగా ..అది నీ యిష్టం..నాకు చేశావు..దానికి నేనేం చేయను అనుకునేవారు పరమ రాక్షసులు కారూ..!
ఇచ్చిపుచ్చుకోవడం అనేది మానవజీవితం లో అతి ప్రధాన అంశం. అక్కడ తేడా లొచ్చినప్పుడే అంతటా తేడాలొస్తుంటాయి.ఇంటి లోని బంధాలైనా..ఇంకేవైనా..!దాన్ని సరిగా బయటకి ఒప్పుకోం గదా..అసలు సమస్య నే ఒప్పుకోనప్పుడు సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుంది..?

No comments:
Post a Comment