Thursday, January 1, 2015

THE NEWS you like ... ఈ పత్రిక ని చూశారా ?



THE NEWS you likeఅనే ఇంగ్లీష్ మాస పత్రికని ఇటీవలనే ఓ స్టాండ్ లో కొన్నాను.ద న్యూస్ అనేది బోల్డ్ గా ఉండి యూ లైక్ అనేది చాలా చిన్నదిగా ఉన్నది.గబాలున చూస్తే THE NEWS అనుకుంటాం.అలా కేచీ గా ఉండాలని సదరు ప్రచురణకర్తల ఉద్దేశ్యం కావచ్చు.హైద్రాబాద్ నుంచి వచ్చే మంత్లీ లా ఉందే అని చెప్పి ఏమేం కవర్ చేశారో చూద్దాం అని కొన్నాను.నా కంటికి ముందు కొత్తగా ఆనే వాటిని కొంటుంటాను.తర్వాత మిగతా వాటిని.అదో అలవాటు.

ఈ పత్రిక మీద ఉన్న వివరాల్ని బట్టి 2013 నుంచి ప్రచురితం అవుతున్నది.మంచి పేపర్ మీద ముద్రించి వెల మాత్రం రూ.20/-లు పెట్టారు.అందుకు వారిని అభినందించవలసిందే. News items covered also interesting with the touch of more local flavor besides other ones. నేను కొన్నది డిసెంబర్ ఇష్యూని.

ఎక్కువగా హైద్రాబాద్ ఇంకా ఉభయ తెలుగు రాష్ట్రాల వార్తాంశాలు ఉన్నాయి.దక్షిణాదిని కవర్ చేసేవీ ఉన్నాయి.అయితే మరీ విసుగుపుట్టించే విధంగాకాకుండా బ్రీఫ్ గా ముఖ్య అంశాల్ని ప్రస్తావించారు.కేసుల గూర్చి రాసేటపుడు FIR నెంబర్ల ని ఉటంకించారు.భాష కూడా హాయిగా Crispy గా ఉంది.Frontline వి 60 రూపాయలు,The Week లాంటివి 35 రూపాయలు పెంచిన తర్వాత ఇంత రేటు వీటికి పెట్టడం అవసరమా అనిపిస్తుంది. దాని కంటే నెట్ లోకి వెళితే ఎంత సమాచారం..అనిపిస్తుంది.కేరళ ని ఫోకస్ బాగా చేసుకుంటారు.ప్రతి చిన్న దానికి..ఇదే అంశాలు మన దగ్గరా ఉన్నాయిగదా అనిపిస్తుంది..కాని మనవి ఆనవు అదేమిటో..!Click here

No comments:

Post a Comment