Monday, January 12, 2015

ఇతర మతాల నుంచి వచ్చిన వారు హిందూ మతం లో ఏ కులం కిందికి రావాలి..?

ఇతర మతాల నుంచి వచ్చిన వారు హిందూ మతం లో ఏ కులం కిందికి రావాలి..? ఇది అనేక మందికి వచ్చే సందేహమే.పైకి ఎన్ని చెప్పుకున్న ఇంకా హిందూ మతం కి వెన్ను దన్ను గా ఉన్నది ఈ వ్యవస్థయే.దాన్ని తీసి వేస్తే హిందూ మతం యొక్క ఉనికి  ఎలా ఉంటుందో మనం ఊహించడం అంత సులువు కాదు.1899 లో (Prabuddha Bharata) ఏప్రిల్ సంచిక లో స్వామి వివేకానంద ఇంటర్వ్యూ లో ఇలాంటి కొన్ని విషయాలకి తన రీతి లో సమాధానమిచ్చారు.

ఇతర మతాల నుంచి వచ్చిన వారు ఒక ప్రత్యేక కులం గా అవతరిస్తే మాత్రం తప్పేమిటి..? నిజానికి ఇప్పటికే అలా ఎన్నో సార్లు జరిగింది.కుల వ్యవస్థ లోని కొన్ని లోపాలు తొలగించినట్లయితే హిందూ మతం అంత ఉన్నతమైనది ఇంకొకటి ఉండదు.పూర్తి గా కుల వ్యవస్థని తొలగించడం ఎవరి తరమూ కాదు.దాని లోని రాపిడిని మాత్రం తగ్గించగలం ..!మనుషులు ఎక్కడున్నా కొన్ని సమూహాలు గా ఏర్పడడం అన్నది ఎక్కడైనా ఉన్నది.కాకపోతే పేర్లు వేరు.రామానుజుని నుంచి చైతన్య ప్రభువు దాకా వైష్ణవ గురువులంతా ఇలాంటి ప్రయోగాలు చేశారు గదా..అనేక కులాల కి చెందిన వారు కలసి ఒక గౌరవనీయమైన కులం గా అవతరించడం మనం చూశాము గదా..!అలాంటప్పుడు ఇంకొక కొత్త కులం ఏర్పడితే తప్పేమున్నది ..అంటూ తన భావాన్ని వ్యక్తీకరించారు.Click here   

No comments:

Post a Comment