Sunday, January 25, 2015

ఇటీవల పేపర్లలోను,టి.వి.ల్లోనూ చూస్తున్నాను.ఎం.ఎల్.ఎ. గారి కూతురు తాగి హల్ చల్ చేసిందని,ఫలానా నటి తాగి పబ్ లో చిందులేసిందని ..

ఇటీవల పేపర్లలోను,టి.వి.ల్లోనూ చూస్తున్నాను.ఎం.ఎల్.ఎ. గారి కూతురు తాగి హల్ చల్ చేసిందని,ఫలానా నటి తాగి పబ్ లో చిందులేసిందని ..అసలు ఏ యుగం లో ఉన్నాము మనం..ఎటువంటి హిపోక్రసి నిండిన దేశం లో ఉన్నాం మనం..మంచికో చెడుకో వచ్చిన గ్లోబలీకరణ మన జీవితాల్లోని ఎన్ని పార్శ్వాల్ని ఎంతలా ప్రభావితం చేసిందీ మన కళ్ళెదర తెలుస్తూనే ఉంది.దానిలో భాగమే ఈ విశ్రాంతి కల్చర్ వచ్చింది.మార్కెట్ ఎకానమీ లో మగ,ఆడ అంతా వస్తువులే..అయితీరాలి.లేదా మనుగడే వుండదు.దాని స్వరూపం అది.అలాంటప్పుడు ఆడవాళ్ళు తాగిన విషయాన్ని అంత భీకరమైన భూతద్దాల్లోనించి చూపవలసిన అవసరమేఉంది..?తాగి చేయకూడని పని..అంటే ఇతరుల్ని ఇబ్బంది పెడితే దాని గురించి మాట్లాడండి గాని లింగ వివక్షత ని తాగుడికి కూడా అంటగట్టడం దారుణమైన అనాగరికత.అసలు తెలియకడుగుతా.. కేవలం ఆడమనిషి మందు తాగినంత మాత్రాన సర్వ నాగరికత భ్రష్టు పడుతుందని ఏ గ్రంధం లో ఉంది. ఈ రోజున స్త్రీ పురుషులు ఇరువురు సంపాదిస్తున్నారు..ఎవరైనా ఎందుకు సంపాదించేది ఆనదించడానికేగా..ఆనదించేవారిని చూసి సహించడం కూడా ఎందుకో మనకి కుదరని పని గదూ..!Click here

No comments:

Post a Comment