Saturday, February 7, 2015

ఎలాంటి మనిషీ కొన్ని పేజిల్లో కన్నీళ్ళు పెట్టకుండా దీన్ని ముగించలేడు

సలాం హైదరాబాద్ నిన్ననే ముగించాను.ఈ పుస్తకం కొన్ని ఇతర పనుల వల్లకొద్దిగా లేటు గానే చదివాను.లోకేశ్వర్ గారి యాస లో జీవమున్నది.అది కృత్రిమమైనది గాదు దానెమ్మట అది పొర్లుకుంటూ వచ్చేదే అందుచేతనే ఎలాంటి మనిషీ కొన్ని పేజిల్లో కన్నీళ్ళు పెట్టకుండా దీన్ని ముగించలేడు.చెప్పే విధానం లో దాపరికం లేదు.ఏ విషయం చెప్పినా ఒక అందముంది.కొన్ని సార్లు వివరాలు ఎక్కువై బోరు అనిపిస్తుంది కొన్ని చోట్ల..అయితే బాగా చూస్తే దాంట్లోంచీ ఏదో నేర్చుకోవచ్చు.



కుతుబ్ షాహీల పాలన,కళా వైభవం,వంటకాలు,భవన నిర్మాణాలు,ఒకటేమిటి సమస్త రంగులు హంగులు అలనాటివి కళ్ళకి కట్టినట్లు చూపించారు.ఓ వేపు చరిత్రని చెబుతూనే మరో వేపు తెలంగాణా పోరాట నేపధ్యాన్ని రక్తి కట్టించారు.ఇంత చేసి నాకు అనిపించింది ఏమంటే అసలు చరిత్ర అంటే కేవలం నిజాం ప్రభువులు ఇచ్చినదే తప్ప మరి ఇంకేమీ లేదా..?ఈ నాలుగు వందల ఏళ్ళ లో తెలంగాణా తన పాలకుల చరిత్ర నే తమ చరిత్ర గా చెప్పుకోవాలా..అంతకు మించి ఇంకా వెనుక ఏమీ లేదా ...అధిక సంఖ్యాకుల భాషకి వారు ఇచ్చిన పోషకత్వం ఏమున్నది..!ఇట్లాంటివన్ని వచ్చిన అనుమానాలన్ని బయటపెడితే ఎవరు ఏమనుకుంటారో నాకు తెలియదు ...ఒకానొక సమయం లో మూర్ చక్రవర్తులు యూరప్ లోని చాలా ప్రాంతాన్ని ఆక్రమించారు.వారివైన నిర్మాణాలు చేశారు.విచిత్రంగా ఈ రోజున చూస్తే ఆ ప్రాంతాలన్నిటిని ఒక్క అంగుళం వదలకుండా మళ్ళీ యూరోపియన్ లు తిరిగి తమ ఆధీనం లోకి తెచ్చుకొని ఒక్క నిర్మాణాన్ని కూడా వారి గుర్తు గా మిగల్చకుండా కూల్చి వేసి తమవైన నిర్మాణాల్ని చేశారు.ఇది చరిత్ర చెప్పిన సత్యం.బాగా యోచిస్తే గనక అప్పుడూ ఇప్పుడూ యూరోపియన్ అధికారాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించేది ఇస్లాం శక్తులు మాత్రమే.కాకపోతే యూరోపియన్ లు  అనేకరంగాల్లో సైన్స్ ని పురోగమింప చేసి దానితో చాలా సూక్ష్మ ప్రణాళికలతో ఎదుర్కూంటూ ఉంటారు. (సశేషం)Click here 

No comments:

Post a Comment