Friday, March 27, 2015

బ్రిటిష్ వారిని నేను పూర్తిగా ద్వేషించలేను

చరిత్ర లో మనం చదివిన కొన్ని పడికట్టు భావనల్ని కాసేపు పక్కన పెట్టి కొన్ని సార్లు మనం చదివిన ,అర్ధం చేసుకున్న అంశాలను గుది గుచ్చి ఒకదానికి ఒకదాన్ని ముడి వేసి స్వతంత్రంగా ఆలోచించడం మొదలెడితే చాలా విషయాలు గొప్ప ముందు చూపుతో Manipulate చేయబడినాయని అనిపిస్తుంది.ముఖ్యంగా మన దేశాన్ని పాలించిన బ్రిటిష్ వారిని నేను పూర్తిగా ద్వేషించలేను.అలాగని పూర్తిగా ప్రేమించలేను.భారతీయ భాషలను,సాహిత్యాన్ని చాలా లోతుగా పరిశీలించారు ఆ పండితులు.వట్టి సేవ చేయలన్నదే వారి ఉద్దేశ్యం కాదు ..కాకపోవచ్చును ..!మన సంస్కృతిని, ఆ మూలుగ లోని అంశాలను శోధించడం ,కనుక్కోవడం వారి ఉద్దేశ్యం. దాని వల్ల కొన్ని కార్యాలను కూడా వారు చేయగలిగి ఉండవచ్చును.అవి వేద సాహిత్యం నుంచి నాటి వరకు వచ్చిన సాహిత్యం దాకా ..కొన్ని ప్రక్షిప్తాలు కూడా పొందుపరిచి ఉండవచ్చునని ఎందుకో నాకో అనుమానం.విలియం కేరి లాంటి  వాళ్ళు సంస్కృతం లో ధారళంగా  ఉపన్యాసాలు ఇచ్చేవారు.ఇల్లాంటి వారు ఇంచుమించు అన్ని భారతీయ భాషల్లోనూ ఉన్నారు.మన తెలుగు విషయం లోనూ..!

ఒకరి పట్ల ఒకరికి అనుమాన బీజాలు మొలకెత్తే విధంగా ,పొంతన కుదరని విధంగా ,ద్వేష భావం పెరిగే విధంగా ఎలాంటి ప్రక్షిప్తాలు ప్రవేశపెట్టాలో అలాంటివి మానసిక శాస్త్ర పరంగా విశ్లేషణలు చేసి ..అలాంటివి చాలా తెలివిగా ఇరికించి దేశ ప్రజ మీద,ఆలోచనావేత్తల మీద ప్రభావం చూపారని అనిపిస్తుంది.ఒక మాటకి అనుకుందాం...మనం ఏ చైనా నో జయించాం (అది జరగని పని..అనుకోండి) .అక్కడ మనం పాలన చేస్తూ ఆ స్థానిక భాషల్ని ఎందుకు నేర్చుకుంటాం...? దానితో అనేకమైన పనులు చేయవచ్చు.ఎన్నో విధాలుగా..!

మనతో వచ్చిన పేచీ ఏంటంటే ఒక విషయాన్ని నెమ్మెదిగా అన్ని కోణాల్లోనుంచి యోచించకుండా వెంటనే గబాలున ఒక నిర్ణాయానికి వచ్చేసి ఎదుటి వారి వాదాన్ని వెంటనే ఖండించి పారేయడమో లేదా ఆకాశానికి ఎత్తేయడమో చేస్తాం.అక్కడే వచ్చింది చిక్కు.

ఎదుటి దేశం వారి ఆలోచనా విధానం ఏమిటో అవగాహన చేసుకోకుండా మన తీర్పుని ఏకపక్షంగా ఇవ్వడం. అందునా మనకంటే ఎంతో ముందు చూపున్న వారి పట్ల కూడా అదే రీతి.నిజంగా బ్రిటిష్ వారే గనక మనల్ని అందరిని మతాంతీకరణ చేయాలనుకుంటే తప్పనిసరిగా ఎప్పుడో చేయగలిగే వారు.కాని వారి లక్ష్యం అది కాదు.వారు కోరుకున్న విధానం లో మన సవ వ్యవస్థలు ఉండాలి.దాని కోసం వారు చేసిన మేధోశ్రమ ,వ్యూహాత్మకత ..అర్ధం చేసుకున్నవారు దాన్ని వివరించి ఎక్కడినుంచి చెప్పాలో కూడా అర్ధం కాదు.అంటే మన జగత్తు మానసికంగా అక్కడ ఉంది.

అయితే కొన్ని విషయాల్లో నేను బ్రిటిష్ వారికి అభిమానిని.స్థబ్దు పడిన లేదా జబ్బు పడిన మన అనేక  వ్యవస్థల్ని నిద్రలేపి పరుగులు తీయించారు.బహుశా ఈ విశ్వప్రణాళిక అనేది ఏదైనా ఉంటే దానిలో భాగంగానే వాళ్ళు ఇక్కడకి పంపబడ్డారేమో....లక్ష చెప్పను గాని బ్రిటిష్ వాళ్ళే గనక మన దేశం రానట్లయితే ఇంకా మొగలుల ఇంకా మధ్య ప్రాచ్య దేశాల వారి పాలనలోనే ఉండేది ఈ దేశం... అంత దాకా ఎందుకు బ్రిటిష్ వారు ఏ ప్రదేశాలనైతే మన దేశం లో పాలించారో ఆయా ప్రజల రీతి ని ఇప్పటికీ పరిశీలించండి...కష్టించి పనిచేయడం,సంపద సృష్టించడం,ఏ తీరమైన వెళ్ళి నెగ్గుకు రావడం ..ఇలాంటి గుణాలన్ని పుష్కలంగా వారి లో ఉంటాయి.Click here 

1 comment:

  1. పోస్ట్ బాగుంది ...ఎవైన రేఫెరల్స్ ఇస్తారా? ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు చెడ్డవాళ్ళు అని చిన్నపటి నుండి నా మనసులో నాటుకపోయింది...
    నిజానికి వాళ్ళే గాని రాకుంటే నేను కచ్చితంగా ఇలా ఉండేవాడిని కానేమో....

    ReplyDelete