సల్మాన్ ఖాన్ విషయం లో సెషన్స్ కోర్ట్ తీర్పు ఇవ్వగానేఎందుకని రకరకాల వ్యక్తులు వివిధరకాలు గా స్పందిస్తున్నారు..?ఈయననే కాదు ఎవరి విషయం లోనైనా కోర్ట్ తన పని తాను చేసుకుపోతుంది.దాని మీద అభిప్రాయాలు వ్యక్తపరచడం ఏమిటి..?ఏ ప్రముఖుని మీద ఇలాంటివి జరిగినా మితిమీరి స్పందించడం ని నేరంగా పరిగణించాలి.రాజ్యాంగం లో ని 14 నుంచి 18 అధీకరణాలు ఏ భారతీయ పౌరునైనా కుల,మత,ప్రాంత ,లింగ భేదం లేకుండా ఒకే స్థాయి గా పరిగణించాలిగదా.ఆర్దిక వెసులు బాటు ఉన్నవారికి,పేజ్ 3 వ్యక్తులకు ప్రత్యేక సౌకర్యాలు ఏమీ ఇవ్వలేదే.అలాంటప్పుడు తప్పు చేసిన ఎవరైనా శిక్షని అనుభవించవలసిందే.దానిలో వింత ఏముంది.ఎందుకని జీర్ణించుకోలేకపోతుంటాము ఇలాంటివి.మరి అలాంటప్పుడు రాజ్యాంగం లో ఆ రాతలన్నీ దేనికి..తొలగించుకొని ఉంటే బాగుంటుందిగదా.సవాలక్ష చట్టాలు చేసుకుంటాము.కాని అమలు చేయడం వచ్చేసరికి ఎన్ని అవరోధాలో.
రెండు రోజుల దాకా ఇంటెరిం బెయిల్ ఇచ్చారు.ఏముంది ఆ తర్వాత పై కోర్ట్ కి వెళతారు.ఆ శిక్ష ఎంతదాకా అమలు అవుతుందో ఆ దేవునికే తెలియాలి.ఇంతకీ వచ్చి సల్మాన్ మీద పెట్టిన కేసులు మర్డర్ కి సంబందించినవి కావు.ఆ జనాలు రోడ్డు మీద పోయినా..!మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్ 34(ఏ) ఇంకా (బి),తర్వాత సెక్షన్ 185 ,బాంబే ప్రొహిబిషన్ యాక్ట్ కింద నమోదు చేశారు.
జనాలు రోడ్డు మీద పడుకుంటే తొక్కించరా అని ప్రశ్నించే అభిజిత్ లాంటి వాళ్ళని అసలు ఎందుకు లోపల వేయకూడదు.దానికి జవాబు మొత్తం భారత్ చెప్పవలసి ఉంటుంది.సరదాగా ఎవరూ రోడ్డు మీద పడుకోరు చావడానికి.అలాంటి నికృష్ట స్థితి లో ఈ దేశం లో ఎందరో ఉన్నారు.అంటే వాళ్ళందర్నీ తొక్కించినా తప్పు లేదా..? అమెరికా వంటి అగ్ర దేశం లో కూడా శాన్ ఫ్రాన్సిస్కో లాంటి చోట్ల ఫుట్ పాత్ ల మీద పడుకునేవాళ్ళు ఉన్నారు.ఈ మహానుభావుడికి తెలియదేమో..!

No comments:
Post a Comment