లివ్ అండ్ లెట్ లివ్.అనడానికి వినడానికి బాగానే ఉంటుంది కాని దాని ని నిజజీవితం లో అమలు చేయడానికి చాలా తెలివి,అర్ధం చేసుకునే విశాలత ఉండాలి.చదివిన వారికి తెలిసే ఉంటుంది.ఆంగ్ల నవల ల్లో అనే కాదు జీవితాల్లో చూసినా ఒకరి దగ్గర పేటెంట్ ఉంటే దానికి ఉత్పత్తి చేసే దానికి అయ్యే పెట్టుబడి పెడతానని ముందు కు వచ్చే డబ్బున్నవారు ముందుకు వస్తారు.లాభాలు అగ్రిమెంట్ చేసుకున్న ప్రకారం పంచుకుంటారు.శాస్త్రవేత్తలు అలెగ్జాండర్ గ్రాహంబెల్ దగ్గర్నుంచి మనం ఇలాంటివి చదువుతూనే ఉన్నాము.ఎన్నో ఉదంతాలు.వాస్కో డ గామా, మేజిలాన్ వంటి సాహసికులు సముద్రయానానికి వెన్నుదన్నుగా ఉండి ప్రొత్సాహమిచ్చింది వాళ్ళ దేశం లోని పెట్టుబడిదారులే.ఒకడి దగ్గర ఒక అస్సెట్ అది ఏదైనా గాని సైన్స్ జ్ఞానం గాని,అన్వేషించే గుణం గాని,ఇంకా ఏదైనా ప్రత్యేకత గలిగి ఉన్నట్లయితే వాళ్ళు వారి దేశం లోని డబ్బున్న వారి దగ్గరకి వెళ్ళి వివరించినట్లయితే దానికి సహాయం చేయడానికి ముందుకు రావడం ఎక్కువ జరుగుతుంది.సరే దాని వల్ల ప్రయోజనం ఏదో రూపం లో జరుగుతుంది.తాము సహాయం పొందిన వారి పట్ల కృతజ్ఞత తో వ్యవహరించడం,ఏ అవకాశం వచ్చినా వారికి ఏదో చేసి దానిని ప్రకటించుకోవాలనుకోవడం ఇలాంటి గుణం కూడా ఎక్కువగా కనిపిస్తుంది.బాగా గమనించినట్లయితే ఇదే మూల భావం The God Father యొక్క అంతహ్స్రవంతి.పరస్పర సహకారం.పరస్పర లాభం.
మీరు నమ్మరు గాని,చాలా పాశ్చత్య దేశాలు భారతీయ విధానం లోని ఒక అంశాన్ని ఎత్తి చూపించేది ఏమంటే కృతజ్ఞతా భావం చాలా తక్కువ అంటారు.ముందు నాకు అదోలా అనిపించింది గాని ఆ తర్వాత మధ్య వ్యక్తి మాదిరి గా యోచిస్తే అనిపించింది ఏమంటే దాని లో కూడా నిజం లేకపోలేదు అని.దీనికి కారణం అనుకుంటాను.. మనకే పరిమితమైన ఒక ప్రత్యేక మైన లక్షణం..అది అందరకి తెలిసిందే..!దాని ప్రభావమా అని మెదడుకి తోచింది.
అది కూడా ఒక విశాల హృదయానికి సంకేతమే.దానివల్ల సంపద పెద్ద స్థాయిలో కిందకి ప్రవహించకపోయినా తిండిలేక మరణించే స్థితులు ఉండవు. ఒక ఆర్ట్ గాని, అన్వేషణ గాని మూలన పడటం జరగదు.మన దగ్గర లేకపోలేదు గాని ఎందుకనో బాగాడబ్బులున్న వాళ్ళు కూడా మంచి ఐడియాలు,మేనేజ్మెంట్ ఉన్న యువతని గాని ఇతర వ్యక్తుల్ని గాని ప్రోత్సహించడానికి ముందుకు రారు.కులం,మతం,ప్రాంతం,భాష ఇలాంటి వి మనసులో ఉంచుకొని కూడా చేయాలనిపించినా చేయరేమో అనిపిస్తుంది.మన దేశం లో విపరీతమైన సంపద కొందరి దగ్గర ఉండటం కనిపిస్తుంది.కాని ఎందుకనో ..ఇతరులకి పేరు రావడం,బాగుపడడం అంతగా వారికి ఇష్టం ఉండదు..వారి వెంచర్స్ కి పెట్టుబడి పెడితే దాని మూలం గా వీరికి కూడ డబ్బులు వచ్చే అవకాశం ఉన్నా కూడా దానికి ఇష్టబడరు.ఒక అప్రకటిత,అకారణ ద్వేషం అది ఎందుకనో..!
మరి ద్వేషం ద్వేషం నే పెంచిపోషిస్తుంది గదా..!

No comments:
Post a Comment