Thursday, May 21, 2015

సిడ్నీ షెల్డన్ నవల Master of the Game మూడవ మరియు చివరి భాగం

సిడ్నీ షెల్డన్ నవల Master of the Game మూడవ మరియు చివరి భాగం


Eve,Alexandra లు ఇద్దరు కవల పిల్లలు.ఈ అమ్మాయిలిద్దరు చూడటానికి ఒకేలా ఉంటారు.వీళ్ళు Tony యొక్క కుమార్తెలు.Kate Blackwell కి మనవరాళ్ళు.చిత్ర కళనుంచి అతని గమ్యాన్ని కుతంత్రం తో ఫేమిలీ బిజినెస్ వేపు మళ్ళించడం తో తను మానసికంగా దెబ్బ తిని  అలాంటి వారికి కేటాయింపబడిన  ఒక షెల్టర్ లో ఉంటూ ఉంటాడు.ఈ అమ్మాయిల్ని మాత్రం Kate తన వద్దనే ఉంచి పెంచుతూంటుంది.ఏ మాటకి ఆ మాట ఈ Tony పాత్ర చాల సహజత్వానికి దగ్గర గా ఉండే పాత్ర.ఇతనికి చిన్నప్పటి నుంచి నత్తి ఉంటుంది.దాన్ని మాంపడానికి Kate రకరకాల డాక్టర్లని సంప్రదిస్తుంది కాని వీలవదు.దాని వల్ల ఇతను ఒక రకంగా అంతర్ముఖుడై చిత్రకళ వైపు ఆసకి పెంచుకుంటాడు.డైరక్ట్ గా ఎక్కడా చెప్పడు గాని ఏదో ఒక శారీరక వక్రత లేదా లోపం అనేది మనిషిని కళల వేపు తీసుకు వెళుతుంది అన్నట్లుగా అంతర్లీనంగా చెపుతాడు.

సరే... Eve అనే ఈ అమ్మాయి బాగా దుందుడుకు.అంత తనకే కావాలనే రకం చిన్నప్పటినుంచి కూడా తన సోదరి Alexandra ని అడ్డు తొలగించుకోవాలని తద్వారా ఆస్తి మొత్తం తనే కొట్టేయాలని యత్నిస్తూంటుంది.ఎన్నో మంచి స్కూళ్ళ లో చదివించి మార్చాలని చూస్తుంది Kate. కాని ఫలితం శూన్యం.Alexandra అనే అమ్మాయి మాత్రం కొంచెం మెతక,అందరిని ప్రేమించే సౌమ్యురాలు.ఎప్పటికైనా ప్రమాదమని కనిపెట్టి Eve ని బయటకి పంపేస్తుంది Kate.కొన్ని నిభందనలు కూడా పెడుతుంది ..తన ప్రవర్తన మార్చుకొని మంచిగా ఉందని అనిపిస్తేనే మళ్ళీ ఇంట్లోకి రానిస్తానని లేదా నెలకింతా అని డబ్బులు ఇస్తుంటా దానితో బ్రతుకు అని చెప్పి మనవరాల్ని బయటకి పంపంచి వేస్తుంది.

Eve బయటకి వెళ్ళి ఒక అద్దె అపార్ట్మెంట్ లో ఉంటూ ఉంటుంది.విలాసపరురాలు గదా.ఎక్కువ డబ్బులు అవసరం కాబట్టి మంచి ధనికులైనవారిని వల లో వేసుకుని జీవితాన్ని కావలసిన రీతి లో ఎంజాయ్ చేస్తూంటుంది.ఒక సారి అలాటి క్రమం లోనే George Mellis అనే గ్రీకు యువకుడు పరిచయమవుతాడు.ఇతను కుటుంబం గ్రీస్ లో ఉండే ఒక ధనిక వ్యాపార కుటుంబం.అయితే అతని తండ్రి ఇతని చేష్టలు గిట్టక ఇంట్లోంచి వెళ్ళగొడితే వచ్చి న్యూయార్క్ లో ఒక కంపెనీ లో పని చేస్తూంటాడు.Eve ఇతగాడి తో ఒక రాత్రి గడుపుతుంది.అప్పుడు అర్ధం అవుతుంది..ఇతను  సెక్స్ వల్ విషయాల్లో ఒక గొప్ప పర్వెర్ట్ అని. సెక్స్ లో ఫాల్గొనేటప్పుడు ఎదుటి మనిషిని విపరీతంగా కొట్టి వాళ్ళు నిస్సహాయ స్థితి లో ఉండగా ఆ పని చేయడం ఈ George కి ఒక ఆసక్తి.ఆ క్రమం లో Eve ఒళ్ళు అంతా హూణం చేసి ,మొహం అంతా పచ్చడి పచ్చడి గా కొడతాడు.ఆ పిమ్మట ఆనల్ సెక్స్ చేస్తాడు.దానితో ఈమె వీడెవడో పనికొచ్చే యవ్వారం లా ఉందని  ఇతని పూర్వపరాల్ని విచారిస్తే అతనిది కూడా ఇంచు మించు తన లాంటి కధే అని తేలుతుంది.అంటే ధనిక కుటుంబం నుంచి వచ్చినా కొన్ని కారణాల చేత ఇంట్లో వాళ్ళు వెళ్ళగొట్టారని గ్రహిస్తుంది.ఇతగాడిని తన ప్లాన్ లో ఉపయొగించుకుని Alexandra ని మర్డర్ చేసి ఆస్తి అంతా దక్కించుకోవాలని యోచన చేస్తుంది.ఒక్కసారి ధనం మొత్తం తన చేతిలో పడ్డాక ఈ George గాడిని ఇంతకింతా చేసి తన కక్ష తీర్చుకోవచ్చునని తలపోస్తుంది.

అప్పుడు ఒకసారి George కి తన ప్లాన్ చెప్తుంది,నువ్వు గనక నే చెప్పినట్లు చేస్తే  నాకు పెద్ద ఎత్తున ఆస్తి కలిసి వస్తుంది.మా సోదరిని Alex ని నువు ప్రేమించి పెళ్ళాడు..దానికి కావాలసింత సాయం నేను చేస్తా.ఒక మంచి రోజున నే చెప్పినఫ్ఫుడు దాన్ని చంపే పని కానివ్వు.ఇహ ఆస్తి అంతా అప్పుడు మన ఇద్దరిదే.అలా అంటుంది.సరేనని ఒప్పుకుంటాడు.

ఆ రాత్రి George గుద్దిన గుద్దుడుకి మొహం అంతా పగిలినట్లయిపోతుంది.Eve తమ ఫేమిలీ డాక్టర్ చేత బాగు చేయించుకోవడానికి వెళుతుంది.అతను Keith Webster అనే మంచి నిపుణుడైన డాక్టర్ చేత వైద్యం చేయించి యధాప్రకారం ఆమె మొహం బాగుపడేలా చేస్తాడు.అది బామ్మ Kate Blackwell కి తెలియకుండా జాగ్రత్త పడుతుంది.

George Mellis అనే అతని గూర్చి కొద్దిగా తెలుసుకోవాలి ఇక్కడ.గ్రీస్ లో చదువుకునే సమయం నుంచే హోమో సెక్స్ కి అలవాటు పడతాడు.పదమూడు పడ్నాలుగేళ్ళు పిల గాళ్ళకి డబ్బులు అవీ ఆశ చూపించి వాళ్ళని పిచ్చ కొట్టుడు కొట్టి చచ్చిపోయే స్థిథిలో వాళ్ళతో ఆనల్ సెక్స్ చేసి వదిలిపారేస్తాడు.అలాగే అమ్మాయిల్ని కూడా.ఎక్కువ గా వేశ్యల్ని ఎంచుకుని ఆ విధంగా  చేస్తుంటాడు.ఆ తెల్లారి పొద్దున ఈ బాధితుల గురుంచి పేపర్ లలో రావడం కామన్ గా జరుగుతూంటుంది.తను ఏ ఊరు వెళ్ళినా ఇలాంటి ఒక న్యూస్ ఆయా రోజుల్లో రావలసిందే.తన పేరు తెలియకుండా జాగ్రత్త పడుతుంటాడు.

ఒక సారి ఇంట్లో ఇలాంటి కార్యక్రమమే చేస్తుండగా తండ్రి ఇతడిని చూసి ..ఎర్రగా కాలుతున్న చుట్టని ఇతని శిశ్నానికి అంటించుతాడు.అలా చేయడమేగాక ఇంట్లోనుంచి బయటకి గెంటివేస్తాడు.దానితో ఈ George అమెరికా వచ్చేస్తాడు.అయితే తన పద్ధతుల్ని మాత్రం ఏ మాత్రం మార్చుకోడు..పైగా రెట్టించిన క్రౌర్యం తో తన కార్యకలాపాల్ని చేస్తుంటాడు.

సరే..కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈ George కి Alex కి పెళ్ళవుతుంది.అయితే ఈమె దగ్గర తన శాడిస్టిక్ గుణాన్ని చూపించడు..ఎందుకంటే కాలక్రమం లో ఏ అనుమానం రాకుండా ఈమె ని లేపెయ్యాలిగదా అంచేత. వీళ్ళ హనీమూన్ ని ఒక సముద్రపు పడవ లో ఏర్పాటు చేస్తారు.ఇదీ Eve యొక్క ప్లాన్ లో భాగమే.అట్లా George ఈ పడవ లోకి రాగానే చీకట్లో ఓ మూల నక్కి ఓ కత్తి తో Eve ఇతగాడిని హత్య చేస్తుంది.శవాన్ని సముద్రం లో తోసేస్తుంది.ఇది పోలీస్ శాఖ వారి దగ్గర మిస్సింగ్ కేసు లా నమోదు అవుతుంది.ఎన్ని విధాలుగా వెతికినా మర్డర్ చేసిన వారి ఆచూకి తెలియకుండాపోతుంది.

అయితే Eve కి ..అదే మొహానికి ఆపరేషన్ అదీ చేసి కాపాడిన డాక్టర్ Keith Webster  మాత్రం కొన్ని బలమైన ఆధారాలతో Eve ఏ ఈ హత్య చేసిందని అనుమానించి ఆమె ని అడుగుతాడు.ఆమె తత్తరపడటం తో నన్ను పెళ్ళి చేసుకుంటే ఈ రహస్యాన్ని పోలీస్ శాఖ వారికి చెప్పనని అంటాడు.ఆస్తి అంతా చేతికి వస్తున్న తరుణం లో ఇతగాడేమిటి నాకు అనుకొని..సరే అని ఒప్పుకుంటుంది.ఈ డాక్టర్ ని మానసికంగా హింసించాలని Eve అతని ముందే ఇంకొకళ్ళతో అఫైర్స్ పెట్టుకొని తిరుగుతూంటుంది. ఈ డాక్టర్ కూడా చాలా మర్యాదగా తగిన సమయం వచ్చినప్పుడు చూసుకుంటాలే అన్నట్లుగా మెలుగుతూ ఉంటాడు.ఒక రోజు ఆ సమయం వస్తుంది.తన కంటి కింద ఏర్పడిన ఒక లైన్ ని ఆపరేషన్ ద్వారా తీసేయమని అడుగుతుంది.సరే..అని చెప్పి ఆపరేషన్ చేస్తాడు...కొన్ని రోజులు పోయిన తర్వాత చూసుకుంటే ఆమె మొహం అంతా వికృతంగా అయిపోయి ఉంటుంది.నన్ను మళ్ళీ యధా స్థితి కి తీసుకు రా అని అడగ్గా..నేనే గాదు..ప్రపంచం లో ఎవ్వరూ నిన్ను ఇక అందం గా తయారు చేయలేరు అంటాడు ఆ డాక్టర్ భర్త.ఇక చేసేది ఏమీ లేక ఈ మొహం చూసి ఎవరు తనదగ్గరకొస్తారు..కనీసం ఈ డాక్టర్ తోనే మంచి గా ఉంటూ ఇలా గడిపేద్దాము అనుకుంటుంది Eve.

బామ్మ Kate Blackwell కి ఇది తెలిసినా ఆమె చేసిన దుశ్చర్యలకి తగిన శిక్ష పడిందిలే అనుకొంటుంది.Alex కాలక్రమం లో Dr.Peter Templeton ని పెళ్ళి చేసుకొని Robert అనే అబ్బాయిని కంటుంది.ఇదిగో ..తన ఈ తొంభై య పుట్టినరోజునాడు Kate Blackwell పార్టీ లో పియానో ని వాయిస్తున్నది ఎనిమిది ఏళ్ళ ఈ కుర్రాడే.ఈమె కి ముని మనవడు.నీ భవిష్యత్ లో ఏం కావాలనుకుంటున్నావు..అని ఈమె ముని మనవడిని అడగ్గా పియానిస్ట్ కావాలని ఉందని చెబుతాడు.అయితే నీకు గొప్ప కళాకారులందరి తో పరిచయం చేయిస్తానులే అంటుంది Kate.వెంటనే మనకి ఆమె కొడుకు Tony కధ మనసులో మెదులుతుంది.

అంతే...నవల ముగుస్తుంది..!Click here

                        -- Murthy Kvvs   

No comments:

Post a Comment