ఎప్పుడైన అమెరికా లోనో,ఆస్ట్రేలియా లోనో,ఇంకే దేశం లోనో దాడులు మన విధ్యార్థుల పైనజరిగినపుడు చదివి కాసేపు అయ్యో అనుకొని మళ్ళీ మర్చిపోతుంటాము.కాని వెనుక కారణాల్ని లోతుగా పరిశీలించాలని పెద్దగా మన ప్రభుత్వం గాని,ఇంకొకరు గాని అనుకోరు.ఒకే ఒక కారణం చెబుతారు.జాతి విచక్షణ అని చెప్పి.మనం ఇంకో దేశం వెళుతున్నాం అంటేనే వారి పద్ధతులకి అణిగిమణిగి ఉండటానికి అని అర్ధం.ఒక స్టేటస్ సింబల్ కోసమో,స్థిరపడి డాలర్లు సంపాదించడానికో ఎక్కువగా మన వాళ్ళు తెల్లవాళ్ళ దేశాలు వెళుతుంటారు.కాని నిజంగా జ్ఞాన తృస్ణ తో వెళ్ళే వాళ్ళు బహు తక్కువ.లేరని కాదు.ఇది తెలుగు వారి లో మరీ వేలం వెర్రి గా తయారయింది.
అమెరికా లో ఉన్న భారతీయ విధ్యార్థుల్లో సగానికి ఇంచుమించు తెలుగు వాళ్ళే ఉంటారు.ఆ తర్వాత గుజరాతీ ,పంజాబీలు ఉంటారు.స్టేటస్ కొరకు అక్కడ చదివి ఇక్కడకి తిరిగి వచ్చే చాలామంది తమ కుటుంబ వ్యాపారాల్లో నిమగ్నమవుతారు.ఆ మాత్రం దానికి అమెరికా దాకా పోతే తప్ప ఆ మాత్రం నాలెడ్జ్ రాదా..? ఇదొక ఫాల్స్ ప్రిస్టేజ్ వ్యవహారం.ఆ తర్వాత మన విధ్యార్థులకి ఆయా దేశాల నిజ స్వరూపాలు తెలియకపోవడం. మన పత్రికలు కూడా వాటిని ఎక్కువగా ఫోకస్ చేయవు.
స్థానిక వ్యక్తుల్ని గాని,ప్రభుత్వ విషయాల్ని గాని, పురుషుల్ని గాని,స్త్రీలని గాని మన దేశం లో మాదిరి గా కామెంట్ చేయడం గాని..వాటిల్లోకి అనుచితం గా ప్రవేశించాలని చూసినా దానికి తప్పకుండా రిటాలియేషన్ ఉంటుంది.ఏదో ఓ రూపం లో.ప్రజాస్వామ్యం ..అవీ ఇవీ అని చెప్పే కబుర్లు అన్నీ మిగతా దేశాల్ని అదుపు లో పెట్టడానికే.ఒక్క మాటలో చెప్పాలంటే మనం పురాణాల్లో చెప్పుకునే గంధర్వుల స్థాయికి ఆ దేశాలు చేరిపోయాయి.ప్రతి ఒక్క విదేశీయుని జీవితాన్ని మానిటర్ చేసే స్థాయి ని చేరుకున్నాయి.రెండవ ప్రపంచ యుద్ధం నాటికే వారి రహస్య పోలీసు దళాలు గొప్ప పరిణితిని ప్రదర్శించినవి.విమర్శ్శ కోసమే విమర్శ చేసే దశ నుంచి వారు పైకి ఎదిగిపోయారు.దాన్ని అర్ధం చేసుకోవడానికి మన వ్యవస్థలకి చాలా అనుభవాలు రావాలి.అది మాటల్లో చెప్పినా అర్ధం కాదు.
ప్రపంచం లో వచ్చే వార్తలన్నీ యూరపు,లేదా వారి Strategic friends వంటి దేశాలనుంచే వస్తుంటాయి.దానిలో కొన్ని వివిధ సమాజాల్ని ప్రభావితం చేయడానికి వచ్చేవి కూడా గణనీయం గా ఉంటాయి.ఒకటి మాత్రం ఖచ్చితం గా చెప్పగలను..ఎవరైతే నిజాయితి తో కూడిన జ్ఞాన తృష్ణ తో ఆ దేశాల్లో చదువుకోవడానికి వెళతారో వారికి ఆ దేశాలు బ్ర్హమ రధం పడతాయి.దాని లో సందేహం లేదు.We can deceive ordinary people,but we can't deceive a master అది అర్ధం చేసుకుంటే చాలు.చాలా వాటికి సమాధానాలు దొరుకుతాయి.
good information
ReplyDeleteReally good analysis and I agree with you 100% sir!!
ReplyDelete