Saturday, June 13, 2015

సిడ్నీ షెల్డన్ నవల The Doomsday Conspiracy సంక్షిప్త కధ (4 వ భాగం)

సిడ్నీ షెల్డన్ నవల The Doomsday Conspiracy సంక్షిప్త కధ (4 వ భాగం)

నిజంగా UFO ల వంటివి ఉన్నాయా లేక ఊహేనా ఆనే అనుమానం Robert కి కూడాకలిగింది.పేపర్ల లో అక్కడక్కడ ఏదో చదవడమే తప్ప సరైన వాళ్ళు చెప్పగా తనూ వినలేదు.ఎలాంటి పబ్లిసిటీ ఆశించని కొంతమంది చెప్పినపుడు మాత్రం కాసేపు నిజమా అనిపిస్తుంది.ఆస్ట్రోనట్స్,యుద్ధ విమాన పైలట్ లు కూడా వీటి గురించి చెప్పిన వారిలో ఉన్నారు.న్యూ మెక్సికో లోని Roswell అనేచోట అల్లాంటిదే ఒకటి కూలిపోతే దాని లోని Aliens ని ఆ UFO ని అమెరికా ప్రభుత్వం పరిశోధనల నిమిత్తం రహస్య ప్రయోగశాల కి తరలించినట్లు రిపోర్ట్ లు ఉన్నాయి.రెండవ ప్రపంచ యుద్ధ సమయం లో కూడా కొంతమంది పైలెట్ లు తమకు కొన్ని విచిత్ర వస్తువులు ఆకాశం లో కనిపించినట్లు చెప్పారు.

అసలు ఈ ఇతర Galaxy ల్లోనుంచి వచ్చే ఈ గ్రహాంతర జీవుల వల్ల మన భూమికి లాభమా ..నష్టమా ..?Hans Beckerman చెప్పిందాన్ని తీసివేయడానికి కూడా లేదు.అయితే ఇంకో వ్యక్తిని..అది చూసిన వాణ్ణి కలిస్తే ఇంకా కొన్ని సంగతులు తెలిసే అవకాశం ఉంది.అతనికి ఇంకో అనుమానం సైతం తొలిచింది.ఇది నిజంగా Weather balloon నే అయితే అంత పొద్దున వేళ ఆ NSA అధికారులు తనని అంత రహస్యంగా పిలిచి ఈ పని ఎందుకు అప్పగించారు..?ఏదో మిస్టరీ ఉంది దీనిలో అనిపించింది Commonder Robert కి..!

   *  *  * *  *    ***
అది Geneva నగరం.Swiss ministry of international affairs కార్యాలయం లో ప్రెస్ మీట్ జరుగుతోంది.వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రింట్,ఎలెక్ట్రానిక్,రేడియో ప్రతినిధులు 50 కి పైగా నే ఉన్నారు.Weather balloon పడినట్లుగా చెబుతున్న ఆ ప్రాంతం లో ఫ్లయింగ్ సాసర్ వంటిది పడిందని ప్రజలు అంటున్నారు.అది నిజమేనా..లేదా ఏదైనా ప్రయోజనం నిమిత్తం ప్రభుత్వం దాన్ని దాచిపెడుతున్నదా అని వాళ్ళంతా ఒక్కొక్కళ్ళే అడగసాగారు.

ఆ స్విస్ ప్రభుత్వ ప్రతినిధి వాళ్ళందర్ని రెండు వేన్ ల లో ఎక్కించి ఆ పడిన చోటు అదే Uetenderf దగ్గరకి తీసుకెళ్ళాడు.మీరే చూసుకోండి అని చెప్పాడు.అక్కడేముంది..ఆ Weather balloon మాత్రమే గా ఉంది.దాన్నే వాళ్ళు ఫోటోలు తీసుకున్నారు.ఇప్పటికి ఇదే మాకూ తెలిసింది..ఇంకేమన్నా కొత్త విషయాలు ఉంటే తర్వాత మీ అందరకి కబురు చేస్తాములే..అని చెప్పి వాళ్ళందరిని పంపించివేశాడు..!

******************
Virginia లోని Langley Air base  అది.అక్కడ లోపల ఉన్న ఓ భవనాన్ని Armed Marines కాపాలా కాస్తున్నారు.అత్యున్నత స్థాయి ఆర్మీ అధికారులు 24 గంటలు దాన్ని కనిపెట్టుకుని ఉంటారు.లోపల జరిగే పరిశోధనలు వీళ్ళకి కూడా తెలియదు.

అక్కడ లోపల పనిచేసే సైంటిస్ట్ లకి ఇంకా కొంత మంది చాలా ముఖ్యులకి తప్ప వేరే వాళ్ళకి ప్రవేశం కష్టం.ఆ Sealed chamber లోకి ఇపుడు ముగ్గురు వచ్చారు.ఇద్దరు సైంటిస్ట్ లు ఇంకోకతనుBrigadier General Paxton.ఇంకొన్ని నిమిషాల్లో నాల్గవ వ్యక్తి వచ్చాడు ..అతని పేరు Janus.బ్రిగేడియర్ అతనికి గ్రీట్ చేశాడు.

"ఎప్పటినుంచో ఇక్కడికి రావాలని అనుకుంటున్నా.." చెప్పాడు Janus.

" మీరు నిరాశ చెందరు.రండి లోపలికి పోదాం" అన్నాడు బ్రిగేడియర్.ఆ చాంబర్ లోపలికి వెళ్ళేముందర అంతా స్పెషల్ సూట్లని ధరించారు.లోపలికి వెళ్ళగానే ఆ మధ్యన Space ship ఒకటి ఉన్నది.ఒక టేబుల్ మీద రెండు Aliens శరీరాలు ఉన్నాయి.వాటి ఆటప్సి ని కొంతమంది పేథోలజిస్ట్ లు పరిశీలిస్తున్నారు.

"ఇక్కడున్న ఈ Space ship చూశారా..ఇది ఇంకొక Mother ship కి అనుసంధానమై ఉంటుంది.అంటే కమ్మ్యూనికేషన్ పాస్ అవుతూ వుంటుంది రెండిటి మధ్య. " చెప్పాడు బ్రిగేడియర్. మిగతా ఇద్దరు స్పేస్ షిప్ ని చూస్తున్నారు.సుమారు 35 అడుగుల డయామీటర్ లో ఉందది.లోపల ఒక పెద్ద ముత్యం మాదిరిగా ఉంది స్థల..మూడు సీట్లు ఉన్నాయి.దాని గోడలు కి రకరకాల అరలు ఉన్నాయి.వెనక్కి ముందుకి సాగే విధానం లో ఉంది.

" చూశారా...ఈ లోపల అరల్లో కూడా ఏదో సామాగ్రి ఉంది.చాలా దూరం నుంచి చూడగలిగే ఒక వ్యవస్థ కూడా ఉంది. బహుశా ఈ సామాగ్రి తో ఎక్కడ జీవం ఉంది అని కూడా వీరు తెలుసుకోగలరు. A communication system with voice-synthesis capability and a navigational system that,frankly,has us stumped. .ఒక రకమైన ఎలక్ట్రో మేగ్నటిక్ పల్స్ ద్వారా ఇది పని చేస్తున్నది." బ్రిగేడియర్ చెప్పాడు.

"లోపల ఆయుధాలు వంటివి ఏమీ లేవా" Janus అడిగాడు.

" ఇంకా పరిశోధించాల్సింది చాలా ఉంది.ఇప్పుడే ఒక నిర్ణయానికి రాలేము"

"అలా గా ..మరి దీనికి ఎనర్జీ ఎలా వస్తుంది అని భావిస్తున్నారు"

" Monoautomic hydrogen సూత్రం మీద ఇది నడుస్తుంది అని ఒక అంచనా.With all that perpetual energy ,it has a free ride in interplanetary space...ఇంకొకటి ..మనకి దీంట్లో రెండు Aliens దొరికాయి.బహుశా ఒకటి మిస్ అయి ఉండవచ్చు."

"ఏమిటి ఒకటి మిస్ అయిందా"

"అలాని ఊహిస్తున్నాము..ఎందుకంటే..దీంట్లో  మూడు సీట్లు ఉన్నాయి గదా మరి.."

ఆ Aliens ని అంతా ఒక మారు పరిశీలనగా చూశారు.టేబుల్ మీద ప్రశాంతం గా పడుకున్నట్లుగా ఉన్నాయి.ఆ జీవుల ఫాల భాగం చాలా వెడల్పుగా ఉన్నాయి.నెత్తి మీద అంతా నున్నగా Bald గా ఉంది.కనుగుడ్లుగాని,కనురెప్పలు గాని లేవు.అయితే కళ్ళ స్థానం లో Ping pong balls వంటివి ఉన్నాయి.

" అసలివి ప్రాణం తో ఉన్నట్టా ..లేనట్టా " అడిగాడు Janus.

" ఆ సంగతి మాకే ఇంకా అర్ధం కావడం లేదు.ఇంకా శోధించాలి.అయితే వీటి లోపల రక్తం లేదు.ఒక రకమైన ఆకుపచ్చని లిక్విడ్ ఉంది.ఒక చెయ్యిని కొద్దిగా కట్ చేస్తే కాసేపటికి అది మళ్ళీ మొలుచుకొచ్చింది" ఒక సైంటిస్ట్ చెప్పాడు.

" ఆకుపచ్చ ద్రవం ఉందా రక్తానికి బదులు " ఆశ్చర్యంగా అన్నాడు Janus.

అవును..నేననుకోవడం మొక్కల్లో ఉండే ఒక లాంటి వ్యవస్థ ఈ జీవుల్లో ఉందని..." ఆ సైంటిస్ట్ చెప్పాడు.

" ఏమిటి...ఆలోచించగలిగే మొక్కలు వంటి జీవులా ఇవి..గమ్మత్తుగా ఉందే"

" అంతదాకా ఎందుకు..ఈ ప్రపంచం లో మనకి తెలిసిన మొక్కలని తీసుకున్నా వాటికి ఓ కుక్క లానో పిల్లి లానో ..అంటే అలాంటి ఓ జీవి లా ఆలోచించి స్పందించే లక్షణం ఉంది.They can feel love,hate,pain,excitement ..అలా అన్నీనూ"  సైంటిస్ట్ బదులిచ్చాడు.

" దీని గురించి ఇంకా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను..సాధ్యపడుతుందా"

" తప్పకుండా..ఇలా ఇంకో Lab లోకి వెళదాం రండి.ఈ విషయం లో Jagdis chandra Bose అనే ఆయన చాలా పరిశోధనలు చేశాడు.అవి మీకు కళ్ళారా చూపిస్తాను పదండి" అన్నాడు ఆ సైంటిస్ట్.

 (TO BE CONCLUDED)---Murthy Kvvs  

No comments:

Post a Comment