Friday, June 12, 2015

సిడ్నీ షెల్డన్ నవల The Doomsday Conspiracy సంక్షిప్త కధ (3 వ భాగం)


మొత్తానికి ఆ ప్రదేశం వద్దకి చేరుకున్నారు ఇద్దరు.Hans Beckerman అక్కడ పడి ఉన్న అల్యూమినియం తో చేసినట్టున్న పద్నాలుగు అడుగుల డయామీటర్ లో ఉన్న ఆ వస్తువుని చూసి ..దాని చుట్టూతా పరిశీలనగా చూసి నిన్నటి కి ఇప్పటికి ఏదొ తేడా ఉంది దీంట్లో.ఎవరో వచ్చి కొన్ని లోపలున్నవాటిని తీసుకెళ్ళినట్లుగా అనిపిస్తోంది,అంటూ చెప్పుకుపోతున్నాడు.Robert కూడా బాగా పరిశీలిస్తుంటే తోచింది  ఏమంటే మామూలు గా గతం లో చూసిన కొన్ని Weather balloons లాగే ఇదీ ఉంది.ఇక్కడి వాతావరణం అంతా తేమ గా ఉంది.తన బూట్ల తో నేల ని నొక్కి చూశాడు.వాన వచ్చి తడిసినట్లుగా ఉంది.ఆ వస్తువు ఉన్న కింద భాగం లో కూడా అలానే ఉంది. ఇద్దరూ కలిసి  ఓ పక్కకి వంచారు దాన్ని. 

అసలు దాన్ని ఎవరో మాయం చేసి ఈ వస్తువు ని ఇక్కడుంచినట్లు అనిపించింది Robert కి..బహుశా స్విస్ ప్రభుత్వం అలా చేసి ఉండవచ్చునేమో.కవర్ చేటానికి దీన్ని ఇక్కడ ఇలా పెట్టేసి ఉంటారు.ఉన్నట్లుండి Hans అడిగాడు. " అవును ..దీని పక్కన నేను నిలబడి ఉండగా ఒక ఫోటో తీయ కూడదూ ,మొన్నా ఆ కుర్రాడు తీసినట్లుగా,అది మీ మేగజేన్ లో పడితే బాగుంటుంది గదా " అన్నాడు.

ఉలిక్కి పడ్డాడు Robert."మిమ్మల్ని అప్పుడు ఫోటో తీసిందెవరు" 

" సరిగ్గా ఆ UFO లాంటిది కిందపడినప్పుడు  అందరం మూగి చూస్తున్నామా ..అప్పుడే ఓ కుర్రాడు తన కారు పాడయి పోతే ఓ మెకానిక్ కారు కి దాన్ని కట్టి లాక్కుపోతున్నాడు.ఈ రోడ్డు గుండానే.మమ్మల్ని అంతా చూసి చప్పున దగ్గరకొచ్చి అందర్నీ ఆ UFO పక్కన నిలబెట్టి రరకాల ఏంగిల్స్ లో ఫోటోలు తీశాడు" 

" అంటే మీరు కాక ఆ మెకానిక్ ఇంకా ఆ ఫోటోలు లాగిన కుర్రాడు కూడా దీన్ని చూశారు అంతేనా.." అడిగాడు Robert.

" అంతేకద మరి.ఆ మెకానిక్ కూడా మా గుంపు తో కలిసి ఫోటో దిగాడు..ఆ ఫోటోగ్రాఫర్ కుర్రాడు మా అందరి అడ్రస్ లు సైతం తీసుకున్నాడు.తలా ఓ కాపీ పంపిస్తాను అని కూడా చెప్పాడతను" ఉత్సాహంగా అన్నాడు  Hans. అయితే ఆ ఫోటోగ్రాఫర్ కుర్రాణ్ణి పట్టుకుంటే అందరి మొహాలు దొరికిపోతాయి.పని కొంత తేలికయింది రా బాబూ అనుకున్నాడు Robert.

" అవునూ ..ఆ కుర్రాడి వివరాలు ఏమన్నా తెలుసా " 

" నా ఉద్దేశ్యం ..అతను  బ్రిటన్ కుర్రాడిలా ఉన్నాడు.ఈ స్విస్ వాడైతే కాదు." చెప్పాడు Hans.

" మరి ఆ మెకానిక్ గారేజ్ " 

" అతను ఆ కారు ని లాక్కుంటూ ఈ ఉత్తర దిక్కుకి వెళ్ళాడు.ఇక్కడినుంచి బెర్న్ నగరం దగ్గరే గదా.నాకు ఓ కాపీ పంపించండి మీ ఆర్టికల్ ప్రింట్ అవగానే " బదులిచ్చాడు Hans. 

Robert నవ్వుతూ అలాగే అని చెప్పి జేబు లోనుంచి నాలుగు వందల మార్కుల్ని తీసి  అతని చేతిలో పెట్టాడు.ఇంకా కొంత ఎకస్ట్రా డబ్బుల్ని కూడా అతనికిచ్చాడు.Hans చాలా ఖుషీ అయ్యాడు. ఉన్నట్టుండి ఒక మెటల్ ముక్కని  తన జేబు లో నుంచి తీసి Robert కిచ్చి ఇది ఆ UFO కిందపడినప్పుడు ఆ పరిసరాల్లో దొరికిన ఓ ముక్క అని చెప్పి ఇచ్చాడు.బాగా పరిశీలనగా చూశాడు Robert.అది సిల్వర్ కలర్ లో ఉంది..చాలా తేలిగ్గానూ ఉంది.దాన్ని భద్రపరిచాడు. (To be continued)...News Varsha

No comments:

Post a Comment