Monday, June 8, 2015

సిడ్నీ షెల్డన్ నవల The Doomsday Conspiracy సంక్షిప్త కధ (2 వ భాగం)



సరే..Robert స్విజర్ లాండ్ లో దిగుతాడు.ఒక కారు ఇప్పుడవసరం తనకి అక్కడున్నన్నినాళ్ళు తిరగడానికి!Europcar అనే ఆఫీస్ కెళ్ళి ఎంక్వేరి చేస్తాడు.ఆ ప్రాంతం లో ఎక్కువ గా అంతా జర్మన్ భాష లో మాట్లాడుతుంటారుగదా..వెళ్ళి అక్కడున్న క్లర్క్ ని Guten tag( Good morning) అని విష్ చేస్తాడు.మన వాడికి యూరప్ లో మాట్లాడే ప్రధానమైన  ఆరు భాషలు వస్తాయని తెలుసు గదా.తన క్రెడిట్ కార్డ్ ఇచ్చి  నేనిక్కడ ఎన్ని రోజులు ఉంటానో నాకు తెలీదు..కాని ఉన్ననాళ్ళు నాకు ఓ కారు మీరు అరేంజ్ చేయగలరా అని అడుగుతాడు.ఆ క్లర్క్ ఆ కార్డ్ ని చూసి ఇదేమిటి మొత్తం నల్లగా ఉండి,నల్ల స్ట్రిప్ ఉండాల్సిన తెల్ల స్ట్రిప్ ఉంది అని యోచించి లోనికి వెళ్ళి మొత్తానికి డబ్బుల్ని దాని లోనుంచి డ్రా చేసుకుని ఒక ఓపెల్ ఒమెగా  కారు ని ఇతనికి ఇస్తుంది.

ఈ స్విస్ దేశం లో Robert ఇదివరకు కొన్ని ఆపరేషన్స్ చేశాడు.అమెరికా తరపున ఇంకా యునైటెడ్ నేషన్స్ తరపున.అందంగా చిత్రకారుడు గీసిన బొమ్మల్లా ఉండే ఇక్కడి గ్రామ ప్రాంతాలు అతనికి బాగా నచ్చుతాయి.పర్వత ప్రాంతాల్లో ఉన్నప్పటికి అన్ని సౌకర్యాలు ఉంటాయిక్కడ.స్విస్ గూఢచార సంస్థ Abteilung లో తనకి తెలిసినవాళ్ళున్నారు కాని వాళ్ళకి చెప్పే వీలు లేదు గదా వారి సాయం తీసుకోవలన్నా..!

అలా కారు ని ఓ 25 నిమిషాలు నడుపుకుంటు వచ్చి Dubenderf అనే ఊరికి వచ్చి అక్కడ ఓ హోటల్ లో దిగుతాడు.Zurich కి చాలా దగ్గర లో నే ఉంటుందది.అక్కడి రిసెప్షనిస్ట్ ని అడిగి ఒక MAP ని తీసుకుంటాడు.Zurich  ఇంకా Geneva లో ఎన్ని ట్రావెల్ కంపెనీలు ఉన్నాయి అని చెప్పి ఆరా తీసి ముందుగా ప్రముఖమైన ఆరింటిని నోట్ చేసుకుంటాడు. ఇది ఊహ తో మొదలెట్టాల్సిన పని.ఎందుకంటే ఆ పది మంది టూరిస్ట్ లు ..ఆ టూర్ అయిపోయినాక ఎవరి దేశానికి వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు గదా.. ఇప్పుడు వాళ్ళ అడ్రస్ లు పట్టుకోవాలంటే మాటలా..ఉన్న ఆధారాలతోనే గుడ్డి గానే వెళ్ళాలి మరి.ఆ బంతి వంటి రహస్య  Weather balloon  కిందకొచ్చి కూలింది మాత్రం గత ఆదివారం 14 వ తేదీన,ప్రాంతం పేరు Uetendorf ..అవే ఉన్న వివరాలు. గాల్లో ఓ బాణం వేసి చూద్దాం అని చెప్పి ఒక టూరిస్ట్ ఆఫిస్ కి వెళ్ళి అక్కడున్న క్లర్క్ ని అడుగుతాడు Robert ." ఎక్స్ క్యూజ్మి ..గత ఆదివారం నా భార్య మీ బస్ లో టూర్ కి వచ్చింది.Utendorf  దగ్గర దిగి ఏదో వస్తువు ని చూసి ..ఉన్నట్లుండి పర్స్ మర్చి పోయిందట " అని అడిగేసరికి అ క్లర్క్ అదోలా ఫీలయి గత ఆదివారం ఆ ప్రదేశానికి మేము బస్ నడప లేదే అంటుంది.ఒహో అని చెప్పి బయటకి వచ్చి ఇంకో టూరిస్ట్ ఆఫీస్ కి వెళతాడు.అది Bahanhofplatz అనే ప్రాంతం లో ఉండేది.

"గత ఆదివారం మీ బస్ ఒకటి Utendorf దగ్గర ఆగిందట గదా..అక్కడ Weather Balloon వంటిది కింద పడి ముక్కలయిదట..దాన్ని బస్ లోని టూరిస్ట్ లు కూడా చూశారట.." అంటూ వాళ్ళ దగ్గర ఎంక్వైరి చేశాడు." అవును..ఓ పావు గంట ఆగిందక్కడ.అయినా మీకెందుకు ఇవన్నీనూ" అన్నది అక్కడున్న క్లర్క్.హమ్మయ్యా మొత్తానికి ఓ క్లూ దొరికిందిరా బాబూ అనుకుంటాడు.

" నేను Travel & Leisure అనే పత్రిక లో విలేఖరి గా పనిచేస్తున్నాను.మీ బస్ కంపెనీ గాని డ్రైవర్ లు గాని  మంచి ఎఫీషియెంట్ అని విన్నాను.ఈ స్విస్ బస్ ల మీద ఓ ఆర్టికల్ రాస్తున్నాను.మీ డ్రైవర్ ని కూడా ఒకతన్ని ఇంటర్వ్యూ చేయాలని భావిస్తున్నాను.అనుమతినివ్వగలరా" అంటూ ఓ I.D.Card ని తీసి చూపిస్తాడు Robert." సరే..అయితే మా కంపెనీ పేరు ఆర్టికల్ లో ఎక్కువసార్లు వచ్చేటట్టు చూడాలి మరి" అని షర్తు విధించగా సరేనంటాడు.ఆ పర్టిక్యులర్ డ్రైవర్ చిరునామా ని అడిగి తెలుసుకుంటాడు. అతగాడి పేరు Hans Beckerman ..అతను ఉండేది Kappel అనే గ్రామం లో..అక్కడనుంచి 40 కి.మీ.దూరం లో ఉందది. 

అవును..ఆరోజున ప్రయాణించిన టూరిస్ట్ ల అడ్రెస్ లు ఉంటే ఇవ్వండి అని అడగ్గా మా దగ్గర లేవు అంటుంది ఆ క్లర్క్.ఆ రోజున బస్ డ్రైవర్ తో కలిపి దాంట్లో ఎనిమిది మంది మాత్రం ఉన్నారు అని చెప్తుంది. అంటే మిగతా ఇద్దరు బయటి వాళ్ళన్నమాట అనుకుంటాడు Robert.సరేనని చెప్పి కారుని ముందుకి దూకిస్తాడు ఆ Kappel అనే గ్రామం వైపు.Adliswil,Langnau,Hausen ఇలాంటి కు గ్రామాలు మధ్యలో తగులుతాయి.ఇళ్ళు అక్కడక్కడ పచ్చిక బయళ్ళలో విసిరేసినట్లుగా ..ఆ ఆల్ప్స్ పర్వత సానువుల పాదాల వద్ద ముచ్చటగా ఉన్నాయి.పోస్ట్ కార్డ్ సీనరీ ని చూస్తున్నట్లుగా ఉంది వాతావరణం అంతా..!కొద్ది దూరం పోయినాక Kappel వచ్చింది.ఓ చిన్న చర్చ్,పోస్ట్ ఆఫీస్ ,ఓ డజన్ ఇళ్ళు కనిపించాయి.కార్ ని దగ్గర లోని ఓ రెస్టారెంట్ వద్ద ఆపి అక్కడున్న వెయిట్రెస్ ని అడుగుతాడు "  Entsehuldigen sie bitte,Fraulein.Welche Richtung ist das Hans von tterr Beckerman" (ఇక్కడ Hans Beckerman ఇల్లు ఎక్కడ ఉంది) అని..!  "An der kirche rechts " అని చెప్తూ వేలి తో చూపిస్తుంది ఆమె. "Danke "(థాంక్యూ) అని చెప్పి ఆ ఇంటిముందుకెళ్ళి కారాపుతాడు.కాలింగ్ బెల్ కనిపించక పోవడం వల్ల ..టక్ టక్ మని తలుపు కొడతాడు.ఆ ఇల్లు రెండు అంతస్తుల్లో ఉంది.సిరామిక్ రూఫ్...ఇంటో సీలింగ్ గాని ,ఫర్నిచర్ గాని కాఫీ కలర్ కలప తో చేసినట్లుగా ఉంది.కొద్దిసేపటికి బొద్దు గా ఉన్న ఒకామె బయటకి వచ్చింది..Hans భార్య లా ఉంది.ఏమిటి అన్నట్లు చూసింది.

" మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు ఏమీ అనుకోవద్దు.Mr.Hans Beckerman ఇంట్లో ఉన్నారా..ఆయన పనిచేసే కంపెని అతని చిరునామా ఇచ్చింది.నేను స్విస్ లోని మంచి నైపుణ్యం గల డ్రైవర్ లని ఇంటర్వ్యూ చేస్తున్నాను మా పత్రిక నుంచి" అని చెప్పి తన కార్డ్ ని చూపెట్టాడు Robert. 

"ఓ ..అలాగా ..లోపలికి వచ్చి కూర్చొండి.మా Hans మంచి టాలెంట్ ఉన్న మనిషి." అందావిడ.లివింగ్ రూం నీట్ గా ఉంది.కూర్చున్న కాసేపటికి Hans Beckerman వచ్చాడు.వస్తూనే" ఏవిటి నన్ను ఇంటర్వ్యూ చేస్తారా..అసలు మీరు అడిగేది దాని గురించేగా..అక్కడ కింద పడి పగిలిపోయిన ఆ విచిత్ర వస్తువు గురించేగా " అన్నాడతను! " అబ్బే అది ఒక భాగం మాత్రమే.." అన్నాడు Robert.

" మా ఇంట్లో కాఫీ గాని,స్నాక్స్ గాని ఏమీ లేవు మీ కివ్వడానికి..నాకు అల్సర్ ప్రోబ్లం ఉంది." కడుపుని తాటించుకుంటూ అన్నాడు Hans . "దానిదేముంది..ఒక సంగతి చెప్పండి..ఆ Weather Balloon ని మీరు చూశారు గదా ఎలా ఉందది" అడిగాడు Robert.

" Weather Balloon ఏమిటి..?అది అలా లేదే.ఒక Spaceship మాదిరిగా ఉంది.అదే ఫ్లయింగ్ సాసర్ అంటారు గదా అలా అనిపించింది." అన్నాడు Hans .ఈసారి ఆశ్చర్యపోవడం Robert వంతయింది." నిజంగానా..అలా ఉన్నదా" రెట్టించి అడిగాడు అనుమానం తీరక.

" ఔను..అది అదే..ఖచ్చితంగా UFO నే అని నా అభిప్రాయం.అది పగిలిపోయి ఉంది గదా ..దానిలో రెండు శవాలు కూడా  ఉన్నాయి.అవి పూర్తిగా మనుషుల మాదిరిగా కూడా లేవు.కళ్ళు వింత గా ఉన్నాయి.తల పై వెంట్రుకలు లేవు.నున్న గా ఉంది.సిల్వర్ మెటాలిక్ కలర్ లో ఉన్న సూట్లని ధరించి ఉన్నారు.కొంచెం భయమే అనిపించిది చూడ్డాకి" చెప్పాడు Hans .

" మీతో పాటు ఆ రోజున బసులో ఎంతమంది ఉన్నారు..వాళ్ళ అడ్రస్ లు తెలుసా..ఎవరివైనా" అడిగాడు Robert 

" ఉన్నదంతా పురుషులే..అడ్రెస్ లు నాకు తెలియదు.ఒకాయన మాత్రం ప్రొఫెసర్ అనుకుంటా ..నా లెక్చర్ కి టైం అవుతోంది బస్ ని తోందరగా పోని అని కంగారు పెట్టాడు" 

" మనం ఇద్దరం కలిసి ఇప్పుడు ఆ ప్రదేశానికి వెళదాం వస్తారా" అడిగాడు Robert 

" ఈ రోజు నాకు సెలవు.ఇంట్లో చేయవలసిన పనులు చాలా ఉన్నాయి.నాకు కుదరదు" చెప్పాడు Hans.

" మీకు అభ్యంతరం లేకపోతే రెండు వందల మార్క్ లు ఇస్తాను వచ్చినందుకు గాను" ఆశ కలిగించాడు Robert.

" నాకు పనులున్నాయి గదా " నసిగాడు Hans 

" నాలుగు వందల మార్క్ లు ఇస్తాను" రేటు పెంచాడు Robert 

" సరే..కానివ్వండి..ఏం చేస్తాం ఈ సమయం లో Drive చేయడానికి కూడా ఆహ్లాదంగా నే ఉంటుందిలే" అంటు సమ్మతించాడు Hans.

(వచ్చే భాగం లో మరి మిగిలింది చూద్దాము)Click here

No comments:

Post a Comment