సిడ్నీ షెల్డన్ రాసినదే మరో నవల The Doomsday Conspiracy గురించి ఇప్పుడు చెప్పుకుందాము.ఇది సైన్స్ ఫిక్షన్ ఇంకా హ్యూమన్ డ్రామా కలిసి ఉంటుంది.ఒక రహస్య ఆపరేషన్ కి సంబందించినది.గ్రహాంతర జీవుల నేపధ్యం లో సాగుతూంది.1991 నుంచి ఇప్పటి దాకా సుమారుగా 19 ముద్రణలు పొంది మిలియన్ల కొద్దీ కాపీలు అమ్ముడైంది. చదువుతుంటే సస్పెన్స్ కి సస్పెన్స్...ఇంకా మంచి కధన శిల్పం కూడా...ఆవురావురు మని చదివేస్తాం.మరి ఎక్కువ గా పోతే చేంతాడంత అవుతుంది గాని కొన్ని భాగాల్లో తేల్చేసుకుందాం.
షెల్డన్ లోని ప్రత్యేకత ఏమంటే హీరో పాత్ర ఎంత బాగుంటుందో హీరోయిన్ పాత్ర కూడా అంత హుందా గా ,బలంగా ఉంటుంది.ఓ ప్రత్యేకత ఉంటుంది .సరే..Robert Bellamy దీని లో హీరో.వియాత్నం వార్ లో ఫాల్గొన్న అమెరికన్ నేవీ ఇంటిలిజెన్స్ అధికారి.అతనికి ఇంకా తెల్లవారుతుంది అనగా ఓ ఫోన్ కాల్ వస్తుంది.ఎత్తుతాడు.ఓ సీక్రెట్ మిషన్ పై నేషనల్ సీక్రెట్ ఏజెన్సి శాఖ ఇతణ్ణి తమ ఆఫీస్ కి రమ్మని పిలుస్తుంది.
సరే అని చెప్పి అతని కార్ లో వెళతాడు.రెండు రకాల సెక్యూరిటీ ప్రహరీలని,అంచెల్ని దాటిన తర్వాత లోపలికి ప్రవేశిస్తాడు.లోపల పెద్ద సైజ్ గ్రామమే ఉన్నట్లు అనిపిస్తుంది.బ్యాంక్ లు,పోస్టాఫీసులు,బార్బర్ షాపులు,వివిధ దుఖాణాలు సమస్తం ఉంటాయి.మనషులు అంతా లోపల పనిలో ఉంటారు.బయటకి అంతా ప్రశాంతం గా ఉంటుంది.అమెరికన్ సీక్రెట్ ఏజెన్సీల్లో ఇది అగ్రగామి.లోపలకి వెళ్ళగానే ఇతణ్ణి ఓ రహస్య కెమేరా ఫోటో తీస్తుంది.అక్కడున్న అధికారి దాన్ని తీసి ఏదో రాసి ఈ ప్రాంగణం లో ఉన్నంతదాగా దాన్ని ధరించమని చెపుతాడు.లోపలకి వెళ్ళగానే ఒక హాలు లో దాదాపు పదహారు వేల మంది కంప్యూటర్లముందు పని చేసుకుంటూ కనిపిస్తారు.ఏమిటి ఇక్కడ ఇంత మంది ఉన్నారే అంటాడు Robert .ప్రపంచం లోని అన్ని కావాలసిన ఇంఫర్మేషన్స్ ని ఇక్కడ ఎనాలిసిస్ చేస్తుంటారని,అలాగే కొన్ని వాటిని డీకోడ్ చేస్తుంటారని ..ఇలాంటివి మిగతా హాళ్ళు చాలా ఉన్నాయని వివరిస్తాడు.
జనరల్ హిలియార్డ్ అక్కడ ఇంచార్జ్.అతని గది లోకి ప్రవేశిస్తాడుRobert .ఎందుకు నన్ను పిలిపించారు అని అడుగుతాడు.నువ్వు ,నీ గత చరిత్ర వార్ లో నీ పోరాట విధానం,ఇంటిలిజెన్స్ విషయాల్లొ నీ పని తీరు పరిశీలించిన అనంతరం నీకు ఓ సీక్రెట్ మిషన్ అప్పగించాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది.అది చాలా రహస్యమైన పని.కేవలం కొద్ది మంది మనుషులకి మాత్రమే దీని వివరాలు తెలుసు అంటూ చెపుతాడు హిలియార్డ్.
మరీ ఇంత చీకట్లో తెల్లారకమునుపే ఎందుకు పిలిచారు అసలు విషయం చెప్పండి అంటాడు Robert.నాటో దేశాల యొక్క కూటమి వాతావరణం ని పరిశీలించే ఒక సైంటిఫిక్ పరికరాన్ని (బంతి లాంటిది) దానిలో కొన్ని రహస్య సామాగ్రిని పెట్టి ఆకాశం లోకి పంపింది.అది దేశ రక్షణ కి సంబందించిన విషయం.కనుక ఏమున్నాయి దానిలో అని అడగ వద్దు.అయితే అలాంటి ఆ బంతి ఉన్నట్లుండి స్విజర్ లాండ్ లోని ఆల్ప్స్ పర్వతాల్లో పడి ముక్కలయింది.
"మరయితే నేనేం చేయాలి..దాన్ని తీసుకు రావాలా " అంటాడు Robert.
"అదేం చేయనక్కర లేదు.అలా అది కిందపడినప్పుడు ముక్కలయ్యి దానిలోవి బయటకి వచ్చినప్పుడు ఒక పదిమంది మనుషులు వాటిని చూశారు. వాళ్ళెవరు అనేది నువ్వు కనుక్కోవాలి.వాళ్ళ వల్ల ఈ సీక్రెట్ బయటకి వచ్చి గందరగోళం కి దారి తీస్తుంది.అది జరగకూడదంటే వాళ్ళని లేకుండా చేయాలి.అసలు తిరకాసు ఎక్కడుందంటే ఆ పది మంది ఓ టూరిస్ట్ బస్ లో ప్రయాణించే వ్యక్తులు.ఆ దేశాన్ని చూడ్డానికి వచ్చి చూసి వెళ్ళిపోయి ఉండవచ్చు.రకరకాల దేశాల మనుషులు...ఈ విషయం లో నువ్వెవరి హెల్ప్ అడగకుండా ఒంటరిగా నీకు చేతనైన విధానం లో చేసి.వాళ్ళ చిరునామాల్ని మాత్రం మాకు తెలియ జెయ్యి..చాలు,మిగతాది మేము చూసుకుంటాము "అని చెప్పి ఓ స్పెషల్ క్రెడిట్ కార్డ్ ని ఇస్తాడు.దానిలోనుంచి ఎంత డబ్బు అవసరం అంతా డ్రా చేసుకో అంటూ ఇంకా కొంత క్యాష్,రకరకాల ఐ.డి.కార్డ్ లు ఇస్తాడు హిలియార్డ్.
Robert ఈ సీక్రెట్ మిషన్ గూర్చి తనకి నేవీ లో శిక్షణ ఇచ్చిన Whittaker కి మాత్రం చెపుతాడు..ఇతను సీనియర్ అధికారి.తండ్రి వలె భావించే వ్యక్తి.అసలే ఇప్పుడు తను ఒంటరి..ఎటొచ్చి ఎటు పోయినా ఒక మనిషికి తెలియడం మంచిదని అలా చేస్తాడు.అప్పటికే Susan అనే ఆమె ని పెళ్ళి చేసుకుని విడిపోతారు.నవల ప్రారంభం లో నుంచే వీళ్ళ మాటలతో నిండి ఒక సస్పెన్స్ ఉండి విడిపోతుంది.Susan తన రెండవ భర్త తో బ్రెజిల్ వెళ్తూ Robert కి ఫోన్ చేస్తుంది..ఏం చేస్తున్నావు..ఎలా ఉన్నావు..మరో ఆమె ని కలిసి హాయిగా జీవితాన్ని కొనసాగించు అని చెబుతూంది.అలాగే నేనిప్పుడు హ్యాపీ గానే ఉన్నాను..అని ఒక అబద్ధం ఆడతాడు.ఇలాంటి సన్నివేశాలప్పుడే
ఓహో మనం ఆంగ్ల నవల కదా చదివేది అనిపిస్తుంది.
సరే..మరి స్విస్ లోని ఆల్ప్స్ పర్వాతాల వద్ద గల Uetendorf అనే గ్రామం వద్దకి చేరుకోవడానికి ఉద్యుక్తుడవుతాడు రాబర్ట్.ఆ తరవాత సంగతులు వచ్చే భాగం లో చూద్దాము.Click here
No comments:
Post a Comment