ఒక్కోసారి వ్యతిరేకమైన పబ్లిసిటి కూడా ఊహించని పేరు తెచ్చిపెడుతుంది.కొందరు మనుషులకి గాని..కొన్ని పాటలకి గాని.అదిగో అలాంటిదే ఈ సంఘటన.ఇటీవల ఎం టీవి వాళ్ళు కోక్ ఉత్పత్తుల ప్రచార నేపధ్యం లో ఒరిస్సా కి జాతీయ జానపద గీతం వంటి "రంగబతి.." అనే గీతాన్ని ఇంకా "వందే ఉత్కళ జనని" అనే రాష్ట్ర గీతాన్ని మిక్స్ చేసి వదిలారు.దానితో చాలా అగౌరవపరిచారంటూ అక్కడి మేధావులు ,పేపర్లు ధ్వజమెత్తారు.కోర్ట్ కి కూడా వెళ్ళారు.అయితే ఈ చర్య వల్ల ఈ రెండు గీతాలు బాగా ప్రాచుర్యం మరింత ఎక్కువ పొందాయి.అంతే కాదు దీన్ని ఆలపించిన సోనా మొహపాత్ర,రితురాజ్ మొహంతి,రాం సంపత్ లకి కూడా ప్రాచుర్యం ఇదివరకటికంటే బాగా పెరిగి చాలామందికి తెలిశారు.ఏ మాటకామాట రీమిక్స్ కూడా చాలా వినసొంపుగా ఉన్నది నాకైతే..!!!Click here
No comments:
Post a Comment