Thursday, July 16, 2015

సిడ్నీ షెల్డన్ నవల The Doomsday Conspiracy సంక్షిప్తంగా (5 వ భాగం)

సిడ్నీ షెల్డన్ నవల The Doomsday Conspiracy సంక్షిప్తంగా (5 వ భాగం)

"సరే..మీరు అడిగిన విషయాన్ని ప్రయోగాల ద్వారా చూపించడం చేస్తాను.అది నాకు సైతం సంతోషం కలిగించేదే.." సైంటిస్ట్ Rashman చెప్పాడు.ఒక టేబుల్ మీద Polygram machine ఉంది.దానిలోని నీడిల్ విశ్రాంత స్థితిలో ఉంది.

" దానినే గమనిస్తూ ఉండండి..మొక్కలు కూడా మన లాగానే వివిధ అనుభూతుల్ని పొందుతాయని తెలుస్తుంది." చెప్పాడు Rashman.

అతను అలా చెప్పి ఒక మొక్కకి చేరువ గా వెళ్ళి అన్నాడు. " నువ్వు చాలా బావున్నావు.నీ పూవులు,ఆకులు ఎంత బావున్నాయో.." అలా ఆ మాటల్ని మృదువుగా ప్రేమగా చెప్పాడు.ఆ మొక్కనుంచి వైర్లు ఆ Polygram machine కి కలపబడి ఉన్నాయిగదా ,వెంటనే ఆ మెషీన్ లోని నీడిల్ మెల్లమెల్లగా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా కదిలింది.అలానే కాసేపు అటూ ఇటూ కదిలింది.
" మై గాడ్" Janus ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు.

" మనుషులు వ్యక్తం చేసే ఆనందం వంటిదే ఇదీనూ..ఈ విషయాల మీద పత్రికల్లో సోదాహరణంగా వ్యాసాలు కూడా వచ్చాయి కొన్నాళ్ళ క్రితం ..ఆ ఇంకోటి మరో ప్రయోగం  లో మొక్కలు మన లానే భయం కూడా వ్యక్తం చేస్తాయి.ఒక ఆరుగురు విద్యార్థుల్ని ఓ రూం లోకి పంపించి దానిలో ఒకడి చేత ఓ మొక్కని నాశనం చేయించారు.కాసేపున్న తర్వాత ఆ ఆరుగురు విద్యార్థుల్ని రూం లోనికి పంపారు.అయిదుగురు వచ్చినప్పుడు అవి ఏ ఫీలింగ్ వ్యక్తం చేయలేదు.కాని మొక్కని నాశనం చేసిన ఆ విద్యార్థి లోనికి రాగానే మొక్కలన్నీ వణికిపోయాయి.అంటే వాటి నుంచి పాలీగ్రాం మెషిన్ కి ఉన్న వైర్ల ద్వారా అవి భయాన్ని వ్యక్తం చేస్తూ ..మెషీన్ లోని నీడిల్ ని పైకి వెళ్ళేట్లుగా చేశాయి.

"Incredible " అన్నాడు Janus.

" True..మొక్కలు సంగీతాన్ని కూడా ఆస్వాదిస్తాయి.ఈ ప్రయోగాన్ని Denver లోని Temple Buell college లో చేశారు.మూడు గ్లాస్ చాంబర్ లలో ఒక్కోదానిలో ఒక్కో మొక్క ఉంచి మొదటి చాంబర్ లోకి Acid rock music ని ,రెండో చాంబర్ లోకి మృదువైన సితార్ మ్యూజిక్ ని పంపించారు.మూడో మొక్క లోకి ఏ మ్యూజిక్ ని పంపలేదు.ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఫలితాల్ని రికార్డ్ చేస్తే తేలింది ఏమంటే Rock music ని విన్న మొక్కలు చనిపోయే స్థితికి చేరుకున్నాయి.. ఏ మ్యూజిక్ ని వినని మొక్క మామూలు పెరుగుదలని నమోదు చేసింది.అయితే సితార్ మ్యూజిక్ విన్న మొక్క మాత్రం ఎక్కువ పెరుగుదలని నమోదు చేసింది.అంతేకాక త్వరగా పూవులు పూసింది.1970 అక్టోబర్ 26 న దీన్ని వివరించే ఓ ఫిల్మ్ ని కూడా అక్కడ ప్రదర్శించారు.."

"అంటే Intelligence అనేది మొక్కలకి ఉందనేగా దాని అర్ధం"

" అవును.They breath,eat,reproach,feel pain,defend..  ఇలా అవన్నీ వాటి పరిధిలో అవి చేస్తాయి.అంతేకాదు.Plants can communicate with another  by phermones"

" అవును అది విన్నాను"

"అన్నట్టు మిస్ అయిన ఆ మూడో గ్రహాంతరజీవి అదే Alien ..అది ఎక్కడ ఉన్నట్లు..?" తనలో తాను అనుకున్నాడు Janus.



(సశేషం)

No comments:

Post a Comment