Sunday, July 19, 2015

సిడ్నీ షెల్డన్ నవల The Doomsday Conspiracy సంక్షిప్తంగా (6 వ భాగం)

సిడ్నీ షెల్డన్ నవల The Doomsday Conspiracy సంక్షిప్తంగా (6 వ భాగం)

ఆరు గ్రహాంతర జీవులు కూర్చుని ఉన్న ఆ UFO భూమి చుట్టూరా వాతావరణం లో నిశ్శబ్దంగా ఈదుతున్నట్లుగా తిరుగుతున్నది.క్రింద ఉన్న భూమి ని లోపల ఉన్న మానిటర్ సహాయం తో వాళ్ళు చూస్తూ టెలీపతి ద్వారా పెదాలు కదపకుండా మాట్లాడుకుంటున్నారు.గతం లో వచ్చినప్పటికి ఇప్పటికీ భూమి చాలా మారిపోయింది.కాలుష్యం గాలి లో బాగా పెరిగిపోయింది.ఫ్యాక్టరీలనుంచి  వదలబడే అపరిమితమైన ఆ కలుషిత వాయువుల వలన..అంతేకాదు సముద్ర జలాల రంగు కూడా ఇదివరలో నీలి రంగు లో ఉండగా..ఇప్పుడది మసకబారి చాలా వ్యర్ద పదార్థాలతో,కాలుష్యాల తో నిండి ఒక  అందవిహీనంగా నూ ..ఉన్నది.ఆ విష జలాల ప్రభావం వల్ల కూడా చాలా చేపలు జల చరాలు చచ్చిపోయి కనిపిస్తున్నాయి.అమెజాన్ అరణ్యం కూడా తన పచ్చదనాన్ని కోల్పోతున్నది.లేదు..ఈ మనుషులకి బుద్ధి రావడం లేదు.తగిన గుణపాఠం నేర్పవలసిందే.ఇలా తమలో తాము మాట్లాడుకొంటున్నాయి ఆ గ్రహాంతర జీవులు.

*   *  *
Robert ఫోన్ చేశాడు General Hilliard కి..!లైన్ లోకి వచ్చాడతను..!

"కమాండర్ రాబర్ట్ ...చెప్పండి ఏమిటి విషయం"

"ఇదేదో  చూడబోతే UFO ల వ్యవహారంలా ఉంది.ఈ పని అప్పగించే ముందు నాకెందుకు చెప్పలేదిది.."కొద్దిగా అసహనంగా నే అన్నాడు రాబర్ట్.

" ఇది దేశ రక్షణకి సంబందించిన ఒక సీక్రెట్ వ్యవహారం.కొన్ని పరిమితులవల్ల మీకు నేను ఎక్కువ గా చెప్పలేకపోయాను.కొన్ని గ్రహాంతర జీవులు భూమిని ఆక్రమించాలని చూస్తున్నాయి.పట్టుబడిన ఒక ఆ జీవి వల్ల తెలిసింది." చెప్పాడు హిలియార్డ్ .

Bureaucratic double talk.. విసుగ్గా అనుకున్నాడు రాబర్ట్.

"అవును ఆ జీవుల్ని చూసిన పదిమంది లో ఎంతమందిని కనిపెట్టడం జరిగింది ఇంతదాకా"

" ఇద్దర్ని కనిపెట్టాను.ఒకతని పేరు Hans Beckerman  ..! ఒక టూరిస్ట్ బస్ డ్రైవర్ అతను..కొప్పెల్ అనే స్విస్ దేశపు గ్రామం లో ఉంటాడు.ఇంకొకతను  Fritz Mandel అని బెర్న్ లో ఉండే ఓ మెకానిక్..అతనికి ఓ గ్యారేజ్ ఉంది." చెప్పాడు రాబర్ట్.

"మరి మిగతావాళ్ళు"

"ఆ విషయం మీదనే ఉన్నాను.అన్నట్లు ఆ జీవుల గురించి వీళ్ళతో చర్చించితే .."

"అది నీ పని కాదు.కేవలం వాళ్ళ అడ్రెస్లు కనిపెట్టి చెప్పడమే నీ పని..ఆ తర్వాత పనులు చేయడానికి వేరే మనుషులున్నారు"

తనకి అప్పగించిన మిషన్ లో ఏదో సీరియస్ విషయాన్ని జనరల్ హిలియార్డ్ దాస్తున్నాడు..సరే బాధ్యత తీసుకున్నాక తప్పదు గదా అనుకున్నాడు రాబర్ట్.

(To be concluded) 

No comments:

Post a Comment