సిడ్నీ షెల్డన్ నవల The Doomsday Conspiracy సంక్షిప్తంగా (7 వ భాగం)
అది జెనీవా లోని 4 Rue de Lausanne లో ఉన్న కార్లని అద్దె కి ఇచ్చే కంపెనీ యొక్క కార్యాలయం.దాని పేరు Avis rental car company ..!దాని లోకి అడుగు పెట్టాడు రాబర్ట్ కోపంగా..!అతని చేతి లో కారు కి ఉండే ఓ నెంబర్ ప్లేట్ కూడా ఉంది.
" మీరు పోయిన ఆదివారం ఒక కుర్రాడికి కారు అద్దెకిచ్చారు గదా..వాడు నా Porch కారుని హై వే మీద ఢీ కొట్టి డేమేజ్ చేశాడు. ఇదిగో మీ అద్దె కారు నెంబర్ ప్లేట్.ఊడి తే పట్టుకొచ్చా..నా కారుకి అయిన నష్టానికి మీ కంపెనీ డబ్బులివ్వాల్సిందే,లేకపోతే దావా వేస్తా.." ఆ ఆఫీస్ లోని సెక్రెటరిని దబాయించి అడిగాడు రాబర్ట్. ఆమె ఒక్క సారిగా ఆశ్చర్యానికి గురయి "అదెట్లా ..మేమెందుకు చెల్లించాలి " అంటూ దగ్గర ఉన్న ఫైళ్ళు కొన్నిటిని చెక్ చేసింది.
"అవును ..గత ఆదివారం ఓ కుర్రాడు కారు అద్దె కి తీసుకున్నది నిజమే.అయితే ఆక్సిడెంట్ అయినట్టు మాకు సమాచారం ఏమీ లేదే.." అందామె.
" ఓ పని చెయ్యండి..మీ జోలికి నేను రానులే గాని..ఆ కుర్రాడి అడ్రెస్ ఇవ్వండి.వాడి మీద కేసు పెట్టి అతనితోనే తేల్చుకుంటాను వ్యవహారం.." రాబర్ట్ ఫేవర్ చేస్తున్నట్లుగా అన్నాడు.
ఆమె కూడా హాయిగా నిట్టూర్చి చిరునామా ని ఇచ్చింది.ఆ కుర్రాడి పేరు Leslie Mothershed .లండన్ లోని Grove road లో ఉంటాడు ఆ ఫోటోగ్రాఫర్ కుర్రాడు.నయానో భయానో అతను తీసిన ఆ UFO ఫోటోల్ని సంపాదిస్తే దాంట్లో మిగతా వాళ్ళ మొఖాలు కూడా తెలుస్తాయి.అలా పని సుఖమవుతుంది.అదీ రాబర్ట్ అయిడియా..మొత్తానికి ఫలించింది.
కాసేపట్లో లండన్ కి వెళ్ళే విమానం లో ఎక్కి కూర్చున్నాడు.కొద్దిగా రిలాక్సింగ్ గా అనిపించింది. ప్లాన్ బాగానే సక్సెస్ అయింది అనుకున్నాడు రాబర్ట్.
* * *
" హలో.. Janus ని మాట్లాడుతున్నా.."
" ఆ Janus చెప్పు..నేను General Hiliard ని"
" ఇక నువు పనిలో ముందుకెళ్ళవచ్చు,Commander Robert ఇద్దరు సాక్షుల్ని కనిపెట్టాడు ..వాళ్ళ పని చూడు"
" ఆ విష్యం నాకు వదిలి పెట్టు..అన్నట్టు రాబర్ట్ ఇప్పుడు ఎక్కడున్నాడు "
" ప్రస్తుతం లండన్ వెళ్ళే విమానం లో ఉన్నాడు.ఇంకో సాక్షి ని కనిపెట్టే పనిలో భాగంగా.."
" సరే..మిగతా కమిటీ కి ఈ విషయాల్ని తెలియజేస్తాను.ఆపరేషన్ అనుకున్నట్లే జరిగిపోతుంది. దీని పేరు Nova Red అని పెడుతున్నాను.అంతే ఫోన్ కట్ అయింది.
ఒక ఫ్లాష్ మెసేజ్ ఈ విధంగా పంపబడింది.పంపవలసిన చోటికి..! TOP SECRET ULTRA,NSA TO DEPUTY DIRECTOR BUNDESAN-WALTSCHAFT- EYES WITNESS ONLY- SUBJECT: OPERATION DOOMSDAY -1.HANS BECKERMAN-KOPPEL 2.FRITZ MANDEL-BERN-MESSAGE END.
(సశేషం) Click here

No comments:
Post a Comment