Wednesday, July 22, 2015

పూజ సినిమా లోని ఎన్నెన్నో జన్మల బంధం అనే గీతం గాని....

ఈ రోజు దాశరధి గారి జయంతి..మన మిత్రులు పోస్ట్ ఒకటి చూడగానే ఇది రాయాలనిపించింది.ఆయన మిగతా సాహిత్య కృషి ఒక ఎత్తయితే సినిమా పాటలు ఒక ఎత్తు అని చెప్పాలి. పాత సినిమా పాటల్లో నాకు నచ్చి హం చేసే పాటల్లో ఎందుకనో ఒక సారి ఆరా తీస్తే చాలా దాకా దాశరధి గారివే అనిపించి ఆశ్చర్యమనిపించింది.మంచి అభిరుచి గల సంగీత దర్శకులు,దర్శక నిర్మాతలు ఉన్న కాలం లో ఆయన పాటలు రాయడం ఆయనకి దొరికిన అదృష్టమనాలి. ముఖ్యంగా ఆయన  పదాలు తేలిగ్గాను,చక్కని భావ పుష్టితోనూ ఉన్నట్లు నాకనిపించాయి.ప్రేమ గీతాలు గాని,భక్తి గీతాలు గాని  పరవశానికి గురి చేస్తాయి.ఎంతెంత ఒక భావుకుడు ఒక భావం లో మునిగిపోతాడో అంతంత గా వినేవారిని కూడా లాక్కెళతాడు.  ఎందుకంటే ఒక స్థాయి దాకే మనిషి పై పటాటోపాం..అది దాటితే అంతా హృదయ భాషే.అక్కడ కాళిదాసు నుంచి  ఖలీల్ జిబ్రాన్ నుంచి వేటూరి వరకు అందరూ మనసు కిటికీల్ని తెరిచి అలరించే వారే.ఏమిటీ పోలిక అంటారా ..నా వరస అయితే అంతే.

పూజ సినిమా లోని ఎన్నెన్నో జన్మల బంధం అనే గీతం గాని,నింగి నేల ఒకటాయెనే ..ఇలాంటి గీతాల్ని గాని ఎంత హాయిగా పాడుకోగలం..!అలాగే మ్రోగింది వీణ (జమిందారు గారి అమ్మాయి),బాబూ వినరా ..(పండంటి కాపురం) ,ఏ దివిలో విరిసిన పారిజాతమో (కన్నె వయసు) ,మల్లె తీగ వాడి పోగా (పూజ),ఎక్కడో దూరాన కూర్చున్నావు (దేవుడమ్మా) ,రారా కృష్ణయ్యా  (మూగ నోము) ,చిన్ని చిన్ని కన్నయ్యా ..(భద్రకాళి) ,నడి రేయి ఏ జాములో (భాగ్య చక్రం) ఇలా ఎన్నో మధురమైన గీతాల ద్వారా శాశ్వతంగా  మనోఫలకాల పై ముద్ర వేసిన దాశరధి గార్కి అక్షర నివాళి.Click here   

No comments:

Post a Comment