Saturday, July 25, 2015

బాహుబలి సినిమా ని కొన్ని విషయాల్లో

బాహుబలి సినిమా ని కొన్ని విషయాల్లో అభినందించక తప్పదు.ముఖ్యంగా సినిమా నిర్మాణం లోని తెలుగుల ప్రేమని,శక్తి ని లోకానికి చాటింది.ఒక ప్రయోగం,ఒక నూతన శక్తి ప్రదర్శన.ఉత్తరాది వెబ్సైట్ లు కూడా పొగడటం ఆనందం కలిగించే అంశం.ఇది ఒక కోణం.

అయితే నాకు ఈ సినిమా చూసిన తర్వాత ఏమనిపించింది అని అడిగితే కొన్ని విషయాలు చెబుతాను.CGI వర్క్స్ అద్భుతం..!కాదని అనడానికి లేదు.అయితే నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమంటే ఈ సినిమా లో కధ జరిగే వాతావరణం అంతా తెలుగు వారి ప్రదేశాల్లోనే కదా..మరి అలాంటప్పుడు ఆ మంచు తుఫానులు ఏమిటి...ఏ స్వీడన్ లోనో,నార్వే లోనో,ఇంకా ఏ ఉత్తర ధృవానికి దగ్గర గా ఉన్న దేశాల్లోనో ఉన్నట్లుగా చెట్ల మీద ఆ కురిసిన మంచు పేరుకుని ఉండటమేమిటి...? కధకి,దాని లోని వాతావరణానికి సంబంధం ఉండాలి గదా ఎంత ఊహాజనితమైనా..?అంత మంచు కురిసే దేశం అయిన మహిష్మతి ప్రజలు ఇంకా చాలా రంగు ఉండి తీరాలి.అది ప్రకృతి ధర్మం.

ఇంకొకటి రాజుల కిరీటాలు గాని,కవచాలు గాని ,ఆయుధాలు గాని అన్నీ కూడా రోమన్ సంస్కృతిని ప్రతిబింబించేవే ..కనీసం చందమామ బొమ్మల్లో వడ్డాది వారి బొమ్మలు చూసిన తెలుస్తుందది.ఇహ మీరు చరిత్ర ని చదివితే ఇంకా రూఢి గానూ తెలుస్తుంది.ఆంగ్ల సినిమాల్ని ఆదర్శంగా తీసుకోవడం తప్పుగాదు గాని వారి లాంటి ఆ పరికరాల్ని ఆ కాలం లో ఎప్పుడు వాడామని..?

సినిమా కధ ఏ శతాబ్దానికి చెందినది అంటే..రకరకాల సీన్ల లో నుంచి రకరకాల అంశాల ద్వారా ఏ కాలానికి చెందినదో ఎవరూ చెప్పలేరు..?కీరవాణి అద్భుతమైన కంపోజర్..కాని ఎందుకనో హిట్ అయి రెండు రోజులు నిలబడే పాట ఒక్కటీ లేదు.Sparta,Lord of the Rings ,Zorro  ..ఇలాంటి కొన్ని సినిమాల్లోని కొన్ని చాయలు కనబడతాయి.డైలాగ్స్ పేలవంగా ఉన్నాయి..ఇంకా అవకాశం ఉంది గాని బహుశా డబ్బింగ్ వెర్షన్స్ ని కూడా దృష్టి లో పెట్టుకుని ఉంటారు.Click

1 comment:

  1. తీసింది తెలుగువాళ్ళైనా ఈ మాహిష్మతి కథ ఆంధ్రాలో కాకుండా ఉత్తరాదిన హిమాలయ ప్రాంతంలో జరిగిందనుకోవాలేమో!

    ReplyDelete