Saturday, July 25, 2015

సిడ్నీ షెల్డన్ నవల The Doomsday Conspiracy సంక్షిప్తంగా (8 వ భాగం)

సిడ్నీ షెల్డన్ నవల The Doomsday Conspiracy సంక్షిప్తంగా (8 వ భాగం)

Uetendorf గ్రామం కి కొన్ని మైళ్ళ దూరం లో ఒక రైతు కి సంబందించిన Farm house  అది..!దాంట్లో నివసించేది Lagenfeld కుటుంబం.ఆ రాత్రి ఆ కుటుంబ సభ్యులకి ఓ వింత అనుభవం ఎదురైంది.ఒక రాత్రి పూట ఆ యింట్లోని కుర్రాడు కిటికీ  లోనుంచి చూస్తుండగా ఏదో వెలుగులు చిమ్మినట్లు అనిపించించి బయటకి వచ్చి చూశాడు.ఏమీ కనిపించలేదు.అంత లోనే వారి పెంపుడు కుక్క Tozzi ఏదో గమనించినట్లు మొరగ సాగింది.ఆ ఇంటి యజమాని లేచి దాన్ని సముదాయించాడు.పెరట్లోని గొర్రెలు కూడా బెదిరిపోయినట్లు అరుస్తూ వాటి కి కట్టిన దడిని దాటి రావాలని ప్రయత్నించసాగాయి.ఆ రైతు వాటి దగ్గరకి వెళ్ళి ఏమీ లేదులేరా పడుకోండి అంటూ వాటిని ఊరడించాడు.

అంతలోనే ఉన్నట్లుండి ఇంట్లో ఉన్న అన్ని లైట్లు ఆరిపోయాయి.ఎలాగో తచ్చాడుతూ లోపలకి వచ్చి పవర్ కంపెనీ కి కాల్ చేశాడు.ఊహూ ...ఫోన్ కూడా డెడ్ అయింది.అదే లైట్లు గనక ఇంకో నిమిషం ఉన్నట్లయితే ఆ రైతు కి ఓ గొప్ప దృశ్యం కనిపించేది.వింత అందం తో మెరిసే ఓ స్త్రీమూర్తి వాళ్ళ యింటి పరిసరాల్లోంచి బయటకి వెళ్ళిపోతున్న దృశ్యం అది..!

*  *  *  *
అది జెనీవా నగరం.రాత్రి ఒంటి గంట.స్విస్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ కి సంబందించిన డిప్యూటి డైరెక్టర్ తనకి వచ్చిన మెసేజ్ ని చదివి దాన్ని చాలా జాగ్రత్తగా టాప్ సీక్రెట్ ఫైల్ లో భద్రపరిచాడు.అతని ముందున్న స్విస్ దేశపు మంత్రి ముక్తసరిగా చెప్పాడు " ఇద్దరు మనుషులు..Hans Beckerman ఇంకా  Fritz Mandel" .

"విషయం పక్కాగా జరిగిపోతుంది. మేం చూసుకుంటాము"

" పని ఎప్పుడు ప్రారంభం అవుతుంది..?"

" ఈ క్షణం నుంచే ప్రారంభమవుతుంది.."

*  *  *  **

Hans Beckerman తాపీ గా కారు డ్రైవ్ చేసుకుంటూ జ్యూరిచ్ వెళుతున్నాడు.అక్కడ టూరిష్ట్ బస్ కంపెనీ లో నే గదా ఇతను పని చేస్తున్నది.లోపల అల్సర్ కొద్దిగా బాధిస్తూన్నది..మంచి డాక్టర్ దగ్గర చూపించుకోవాలి అనుకున్నాడు. తాను తప్పు చేశాడు..ఆ రిపోర్టర్ దగ్గర ఇంకొంచెం డబ్బు గుంజాల్సింది..డబ్బులు బాగానే ఉంటాయి గదా వాళ్ళదగ్గర ..!సరే జరిగిపోయిందానికి ఏం చేస్తాం  అలా అనుకుంటూ సాగుతున్నాడు.

అంతలోనే ఓ అందమైన అమ్మాయి రోడ్డు మీద నిలబడి కారు ఆపమన్నట్లు చేయి ఊపసాగింది.ఓ పక్కగా కారాపాడు Hans.ఆ అమ్మాయి దగ్గరగా వచ్చి ఇలా అంది" కొద్దిగా జ్యూరిచ్ దాకా లిఫ్ట్ ఇస్తారా..నన్ను నా బాయ్ ఫ్రెండ్ ఇక్కడ  అర్ధాంతరంగా వదిలేసి పోయాడు చిన్న గొడవై.."

" దానిదేముంది..కారులో ఎక్కు ..అక్కడ దింపుతాను"  అన్నాడు Hans .

" I's very kind of you.My name is Karen" ఆ అమ్మాయి చెప్పిందింలోపల కూర్చుంటూ...!

తాను కూడ పేరు చెప్పి పరిచయం చేసుకున్నాడు...!

" నిజంగా భలే కలిశారు.మీరే గనక కలవకుంటే ఒంటరిగా ఈ నిర్మానుష్యమైన రోడ్డు మీద భయంకరంగా ఉండేది నా స్థితి.." అన్నదామ్మాయి.

" నీలాంటి అందమైన అమ్మాయికి ఎవరైన లిఫ్ట్ ఇస్తారులే..." సరదాగా అన్నాడు Hans.

ఆమె అతనికి చేరువగా జరిగింది.ఫ్రాక్ పైకి వెళ్ళి ఆమె తొడ కనిపిస్తోంది.అతనికీ లోన వేడి పుట్టడం మొదలైంది.

" చూడ్డానికి మధ్య వయసు వారిలా ఉన్నా మీరు మంచి అందంగా నే ఉన్నారు" కవ్వింతగా అన్నాదామె.

" ఈ మాట కొద్దిగా నా భార్యకి కూడా చెప్పకూడదూ " నవ్వుతాలు గా అన్నాడు Hans..!

" ఏమిటి..మీకు పెళ్ళయిందా ..?Why is it all the wonderful men are married..?You look very intelligent ,too.."  ఆశ్చర్యంగా అన్నదామె.

Hans నిటారుగా కూర్చున్నాడు ఆనందిస్తూ..!

" నిజం చెప్పనా..I like mature men like you..! ఎందుకనో నా బాయ్ ఫ్రెండ్ తో నేను ఇన్వాల్వ్ కాలేకపోయాను.మీలో ఏదో ఉన్నదనిపిస్తోంది.Do you like sex,Hans ..?"

ఆమె అలా అనేసరికి Hans తన లక్ కి తబ్బిబ్బు అయ్యాడు.పైకి మాత్రం " అయినా ఇది ఆఫీస్ సమయం గదా ..లేట్ అయితే ఎట్లా" అన్నాడు.

" నా బాయ్ ఫ్రెండ్ తో గొడవ పెట్టుకొని ఉన్నానా..తిక్క తిక్క గా ఉంది లోపల..మీరేం కష్టపడక్కర్లేదు,నేను చేస్తాను అలా ఉంటే చాలు .." అందామె.

కారుని బాగా చెట్లు,పొదలు ఉన్న ప్రదేశం రాగానే అక్కడ ఆపాడు ఆమె కోరిక మీద.ఆమె Hans ట్రవుజర్స్ ని విప్పదీసింది.కాసేపు అలా నిమిరిన పిమ్మట " నోటితో చేసేదా.." అని అడిగింది.ఇంట్లో తన భార్య అలా ఎప్పుడూ చేయదు.అతగాడికి ఆనందమనిపించి అలానే కానిమ్మాడు.కొద్దిసేపు అలా ఆనద లోకం లో తేలిపోయాడు.ఉన్నట్లుండి అతని తొడలో ఏదో నీడిల్ గుచ్చుకున్నట్లయింది.అంతే..కాసేపటిలో Hans శరీరం అతని కారు లోకి చేర్చబడింది.ఆమె ఆ కారుని ఎత్తు గా ఉన్న ఓ గుట్ట మీదికి తోలుకుంటూ వెళ్ళి ఇతగాడిని స్టీరింగ్ దగ్గర కూర్చోబెట్టి తాను దిగి రెండు చేతులతో ఆ కారుని కింద లోయ లోకి తోసేసింది.Hans చాప్టర్ క్లోజ్ అయిపోయింది..అంతే..!  సరిగ్గా అయిదునిమిషాల తర్వాత ఓ లిమోసిన్ కారు ఈ అమ్మాయిని పికప్ చేసుకోడానికి వచ్చింది.దాంట్లో ఉన్న వ్యక్తి అడిగాడు..

" Ingred welche problem "

"Keins " చెప్పిందామె.

(సశేషం)      

No comments:

Post a Comment