చాలా చోట్లా చూస్తున్నా..చదువుతున్నా..వింటున్నా..అసలు ఫౌంటైన్ హేడ్ చదివిన తరవాత నా ఆదర్శమే మారిపోయింది..నా జీవితమే మారిపోయింది ఇలా స్టేట్మెంట్ లు ఇస్తున్నారు.నిజంగా వీళ్ళంతా మొదటి పేజీ నుంచి చివరి పేజీ దాకా తృప్తిగా చదివే ఈ మాట చెబుతున్నారా..అని నాకో అనుమానం ఎప్పటినుంచో..!అసలు ఆ నవల రాయబడింది 1943 ప్రాంతం లో..!అప్పటి అక్కడి సామాజిక స్థితిగతుల్ని కొంత చిత్రించుతూ ఒక రకమైన ఆదర్శవాదాన్ని ఓ మేరకు ప్రేరేపించింది.Objectivism అనే పేరు మీద ప్రసిద్ది చెందింది.The man is a hero అంతే.సమాజమూ అదీ ఇదీ కాదు..ఒకరి కోసం త్యాగం చేయడానికి గాని ఇంకొకరి త్యాగాన్ని అర్ధించడానికి గాని మనిషి పుట్టడం జరగడం లేదు..తన శక్తి తో సాధించడం లేదా ఆ క్రమం లో చచ్చినా ఫరవాలేదు అనే క్రమాన్ని ఇది బోధించింది.మరీ పూర్తిగా కాదు ఇతర కధా క్రమాన్ని తొలుచుకుంటూ ఇది సాగుతుంది.
సరే..ఈ దశల్ని మన సమాజం దాటిందా అంటే నా దృష్టిలో అయితే లేదు.ఓ యాభై లేదా వంద ఏళ్ళకి యూరపు లేదా అమెరికా లో ఏం ఆలోచిస్తారో ఇప్పటికి పట్టుకోవడం చాలా కష్టం.చాలా కొద్దిమంది వల్ల మాత్రమే అవుతుంది.మన వద్ద నుంచి వెళ్ళిన వాళ్ళు ఇంకా ఏమైనా ఇతర సాంస్కృతిక కార్యక్రమాలకి సాయం చేయగలరేమో గాని కొన్ని విష్యాలు అర్ధమయ్యేట్టు చెప్పలేరు.అది అంతే.
మరి Dominique అనే పాత్ర ముందు Roark నుంచి మొదలుపెట్టి Keating నుంచి Wynaad దాకా వెళ్ళి మళ్ళీ Roark దాకా ఎందుకు వస్తుంది..ఈ మధ్య లోని ఫిలాసఫీ ని ఏమైనా గమనించారా ..?దీని గురించి ఎవరైనా మాట్లాడతారేమోనని వెయిట్ చేశాను..ప్చ్..ఒక్కళ్ళు మాట్లాడటం లేదు..ఎందుకని..?
The Fountainhead నా ఆదర్శం అనే వాళ్ళు ఒక్కళ్ళు మాట్లాడేతే వినాలని వుంది.నా దృష్టిలో..శంకరాభరణం లోని హీరో పాత్ర చాలా అద్భుతమైనది.నన్ను అడిగితే నేను అదే చెబుతా ఎప్పటికైనా..! ఎందుకు..అని ఎవరు అయినా అడిగితే నాకు తిక్క పుడితే ఈ 694 పేజీల నవలని ఏ శుభ ముహుర్తానో అనువదిస్తా తెలుగులో ...!Click
No comments:
Post a Comment