సమకాలీన ఆంగ్ల ఫిక్షన్ చదువుతున్న కొద్దీ నాకు అర్ధమైన ఇంకొక విషయం ఏమంటే మేరియో ప్యూజో కావచ్చు,సిడ్నీ షెల్డన్ కావచ్చు ఇంకా ఇర్విన్ వాలెస్ కావచ్చు ఇతరులు శ్వేత జాతీయులు ఎవరైనా కావచ్చు...ఎందుచేతనో మత పరమైన విషయాల్ని రాసేప్పుడు పెద్ద ఎమోషనల్ గా ఫీల్ అయి రాయడం అనేది చాలా తక్కువ.ఇతర విషయాలు ఎలానో అవి అలాగే అన్నట్లు రాస్తారు.వాటి ద్వారా ఇతరుల్ని ఆకర్షించాలని గాని మన ఫోల్డ్ లోకి తీసుకురావాలని గాని ప్రయత్నించరు.ఆయా పాత్రలు మత పరమైన అంశాలు పెద్ద గా బోధించడం అనేది ఉండదు.అప్పటికి అది కరెక్ట్ ..దానిలోనూ లోపాలు ఉండవచ్చును ఈ కాలానికి అవి వర్తించకుండానూ ఉండవచ్చును అన్నట్లుగా ఉంటాయి.అలాని పనిగట్టుకొని దునుమాడటమూ ఉండదు. కొన్ని చోట్ల సెటైర్లు వేస్తుంటారు..అయితే అవి ఆహ్లాదకరంగా ఉంటాయి.తప్ప బండగా ఉండవు.ఇది మన మతానికి సంబందించింది గనక ఏది ఏమైనా సపోర్ట్ చేస్తూ రాయాలిసిందే అనుకోవడం ఉండదు.గాడ్ ఫాదర్ నవల్లో కూడా పెద్దాయన Vito Corleone కి కూడా దైవ భక్తి ఉంటుంది.అలాని ఇహలోక విషయాల్ని దాని కోణం లోంచి Impractical చూడటం అనేది ఉండదు.పెద్ద కొడుకు Sonny హత్యగావించబడినప్పుడు కూడా ...రేపు అతని ఆత్మ సమ్రక్షణార్ధం చర్చ్ లో ప్రార్ధనలకి సిద్ధపడిఉండండి అంటాడు.అంతే తప్ప అంతకు మించి బోధ చేయడు.మతం మానవ జీవితం లో ఒక అంగం మాత్రమే తప్ప అదే మొత్తం జీవితం కాదు అని ఆ పాత్రలూ చెపుతుంటాయి.
మరి ఒకటి ఏమంటే మతం అనేది మనం ఊహించడానికి కూడా ఇష్టపడని ఒక పాత్ర నిర్వహిస్తుంది.మనుషుల్ని దేశాలతో నిమిత్తం లేకుండా ఏకం చేస్తుంది.దాని ద్వారా రాజకీయ ప్రయోజనాల్ని తెలివిగా పొందవచ్చును..ఆ విషయాన్ని రాగ ద్వేషాలు లేకుండా ఓ సైన్స్ మాదిరిగా స్టడీ చేసినారు కాబట్టే మతాన్ని ఒక పొలిటికల్ టూల్ గా వాడుతుంటారు ..అంతకు మించి ఎమోషన్ ని చూపించడం అనేది ఉండదు.
మీరు Family అనే ప్యూజో నవలనే చదవండి.అసలు Pope అవడానికి ఎన్ని నీచ రాజకీయాలు తెరవెనుక జరుగుతాయి అనేది తెలుస్తుంది.ఆ నవల్లో Borgia కుటుంబానికి చెందిన ఓ పాత్ర తన ఇంటి పేరుని కూడా మార్చుకుని ..కుమార్తె ని తనకి ప్రయోజనం చేకూర్చే ఓ కుటుంబం లోకి ఇచ్చి పెళ్ళి చేస్తాడు.ఆమె తన భర్తకి అతని వైపు వారికి కాకుండా తన వంశానికి విధేయురాలయి ఉండాలి అనే ఉద్దేశ్యం తో ఆమెని సొంత కొడుకు తో శోభనం చేయిస్తాడు పెళ్ళికి ముందు రోజు..అంటే అన్నా చెల్లెళ్ళ మధ్య కలయిక అన్నమాట.ఆ విషయాన్ని ఎంత మర్యాదగా ఎంత డిప్లోమేటిక్ గా చెబుతాడంటే మనం ఆ తండ్రి పాత్రని కూడా పెద్ద గా ద్వేషించలేము.ఇవన్నీ ఒక ఎత్తయితే అధికారం,సంపద ల కోసం రకరకాల ఎత్తులు ఒక ఎత్తు.అందుకనే యూరపు లోని రాజవంశాలు పోప్ తాకిడి తట్టుకోలేక అతనికి మర్యాద గల స్థానం ఇస్తూనే ఒక ప్రాంతానికి పరిమితం చేశారు.అలానే మతాన్ని పాలనకి లంకె పెట్టడాన్ని తీసిపారేశారు.డాన్ బ్రౌన్ లాంటి రచయిత బైబిల్ ని విమర్శిస్తూ ఓ నవల రాస్తే (The Davin ci code) యూరపులో చాలా స్పోర్టివ్ గా తీసుకున్నారు తప్ప ఆందోళనలు లేవలేదు. దానికి కారణం వారి గత అనుభవాలే ఆ చరిత్రే..!ఆ నేపధ్యమే వేరు..! Click here

No comments:
Post a Comment