సిడ్నీ షెల్డన్ నవల The Doomsday Conspiracy సంక్షిప్తంగా (9 వ భాగం)
Fritz Mandel తన గ్యారేజ్ ని కట్టేయదలచుకుని కార్యాలయానికి తాళం వేసి పయనమవబోతుండగా ఇద్దరు ఆగంతకులు వచ్చారు." లేదు నేను క్లోజ్ చేస్తున్నాను...తర్వాత తీసుకురండి మీ వెహికిల్ ని" వాళ్ళని చూస్తూ అన్నాడు Mandel.
"కావాలంటే మీకు ఎక్స్ ట్రా పైకం ఇస్తాం,కొద్దిగా మా బండి బాగు చేసి వెళుదురు ప్లీజ్" బతిమిలాడారు వాళ్ళు.
"హ్మ్మ్ ..సరే.." అంటూ ఆగాడు Mandel.
" మాది Rolls కారు..మీ దగ్గర అన్ని పరికరాలు ఉన్నాయిగా.." ఒక ఆగంతకుడు అడిగాడు.
" నా దగ్గర లేనిదంటూ ఏమీ లేదు" గర్వంగా అన్నాడు Mandel .అడ్వాన్స్ గా కొంత డబ్బు బయటకి తీసి Mandel చేతిలో పెట్టాడు మరోకతను.థాంక్స్ అని చెప్పి హైడ్రాలిక్ మిషన్ బటన్ ని ఆన్ చేసి ,కిందికి పిట్ లోకి దిగాడు Mandel సామాన్లు తెచ్చుకుందామని.అంతే ..ఆ మిషన్ ని పైనుంచి గట్టిగా అరచేతితో కిందై బలంగా తోశాడు ఒక ఆగంతకుడు.అది మెల్లిగా Mandel మీదికి దిగబోతున్నది.గబుక్కున పైకి చూసి "ఏయ్ ..ఏం చేస్తున్నారు...దాన్ని..కిందకి వస్తోంది..నన్ను కాపాడండి" అంటూ అరిచాడు Mandel.కొద్ది క్షణాల్లో ఆ మిషన్ అతడిని అప్పచ్చి లా తొక్కేసింది.Mandel ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.వచ్చిన ఇద్దరు ఆగంతకులు తాము వచ్చిన కారు లోనే ఎక్కి రయ్ మని దూసుకుపోయారు.మెసేజ్ ఒకచోటి నుంచి ఇంకో చోటికి ఇలా పంపబడింది.TOP SECRET ULTRA,ESPIONAGE ABTEILUNG TO DEPUTY DIRECTOR NSA,EYES ONLY,COPY ONE OF (ONE) COPIES,SUBJECT: OPERATION DOOMSDAY,1.HANS BECKERMAN-TERMINATED,2.FRITZ MANDEL-TERMINATED (END OF THE MESSAGE)
* * * **
అది కెనడా లోని ఒక నగరం.Janus పన్నెండు మంది వ్యక్తులతో మాట్లాడుతున్నాడు.వాళ్ళు వివిధ దేశాలకి చెందిన ప్రతినిధులు.
" ఇప్పటికి ఇద్దరు Witness ల్ని ఫినిష్ చేయడం జరిగింది..గుడ్ ప్రోగ్రెస్..Commander Robert Bellamy మూడవ విట్నెస్ ని కనిపెట్టేందుకు బయలుదేరుతున్నాడు."
"SDI కి సంబందించి ఏమైనా సమాచారం వచ్చిందా కొత్తగా" ఇటాలియన్ ప్రతినిధి అడిగాడు.
" లేదు,అయితే Star wars కి సంబందించి న టెక్నాలజీ త్వరలోనే పనిచేయడం ప్రారంభమవుతుంది.." Janus జవాబిచ్చాడు.
" సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభించాలి.డబ్బుకి ఇబ్బంది లేదు..అవసరమైనంత పెట్టవచ్చును.." సౌదీ ప్రతినిధి అన్నాడు.
" లేదు,కొన్ని టెస్ట్ లు జరుగుతున్నాయి"
"తర్వాత టెస్ట్ ఎప్పుడు"
" బహుశా ఒక వారం లో ఉండవచ్చు.వచ్చే రెండు రోజుల్లో మళ్ళీ మనం కలుద్దాం" చెప్పాడు Janus .
* * * *
ఈ Leslie Mothershed అనే లండన్ కుర్రాడికి బిబిసి లో Robin Leach నిర్వహించే "Life styles of the Rich and Famous " అనే కార్యక్రమం అంటే బాగా ఇష్టం.క్రమం తప్పక చూస్తుంటాడు.ఎందుకంటే తనూ ఏదో ఒకరోజు ఆ కార్యక్రమానికి గెస్ట్ గా పిలువబడతాడు..ఇంటర్వ్యూ చేయబడతాడు..అది అతని ప్రగాఢ నమ్మకం. వాళ్ళమ్మ కూడా అంటూంటుంది." ఒరేయ్..నువ్వు మామూలు వ్యక్తివి కావురా...పెద్ద జీనియస్ వి" అని. అవును..తను తప్పకుండా వరల్డ్ ఫేమస్ అవుతాడు..ఏదో రోజు..ఏదో రంగం లో..!
అయితే ఎలాగా..ఏ రంగం లో తీవ్రంగా యోచించాడు ఒక రోజు..!
Soccer star అవుదామా అంటే తను అథ్లెట్ కాదు.సైంటిస్ట్ అవుదామా ..తనకి ఏ సబ్జక్ట్ లోనైనా అత్తెసరు మార్కులేగదా.. పెద్ద లాయర్ అయితే ఫీజ్ విపరీతంగా వసూలు చేయచ్చు...కాని తను హై స్కూల్ డ్రాపవుట్ ,అదీ కుదరని పని.అయినా చాలామంది గొప్పవాళ్ళు పెద్దగా చదువుకున్నవాళ్ళేమీ కాదు గదా..పోనీ సినిమా స్టార్ అవుదామా ..తన హైట్ కొద్దిగా తక్కువ .అయిదు అడుగుల అయిదన్నర అంగుళాలు.. ఎవరైనా తన హైట్ గురించి చెప్పేటప్పుడు ఆ అరంగుళం చెప్పకపోతే అతనికి ఎక్కడో మండుతుంది. అయినా Dudley Moore,Dustin Hoffman,Peter Falk ఇలాంటి వాళ్ళంతా తన హైటే గదా..!
చివరకి బాగా ఆలోచించి "ఎస్..ఫోటోగ్రఫీ రంగం లోకి వెళ్ళాలి" అని తీర్మానించుకున్నాడు.అదే తనకి బాగా సూటవుతుంది.Taking photographs is ridiculously simple.Anyone could do it.One simply is to press a button ...!
వాళ్ళమ్మ దగ్గర కొద్దిగా పెట్టుబడిని అప్పుగా తీసుకొని ఒక ఫోటో స్టూడియో ని White chapel ఏరియా లో ఒక ఫ్లాట్ లో ప్రారంభించాడు.కొద్ది రోజుల్లో తాను Ansel Adams,Richard Avedon ల మాదిరిగా ప్రపంచ ప్రసిద్ధ ఫోటోగ్రాఫర్ అయిపోతాడు...అనుకుని కలలు గనసాగాడు.
ఒకరోజున ఒక దగ్గర బంధువు వాళ్ళింటికి వచ్చాడు.అతను లండన్ లోని Harper Collins పబ్లిషింగ్ సంస్థ లో పనిచేస్తాడు.Leslie ఫోటోలు తీస్తాడని తెలుసుకొని ఓ సలహా ఇచ్చాడు" మా సంస్థ స్విజర్ లాండ్ లోని అందమైన లొకేషన్ లతో ఓ కాఫీ టేబుల్ బుక్ ని ప్రచురించాలని అనుకుంటోంది.నువు దాని కోసం పని చేయకూడదూ..నీ పేరు మీద ఒక బుక్ కూడా ప్రపంచం లోకి వస్తుంది గదా" అన్నాడు.ఆహా వెదకబొయిన తీగె కాలికి తగిలింది.అని చెంగున గెంతు వేసి స్విజర్ లాండ్ కి వచ్చేశాడు Leslie..తన ఇంటర్వ్యూలు కేవలం ప్రపంచ ప్రసిద్ది చెందిన టీవీ లకి,పత్రికలకి మాత్రమే ఇస్తున్నట్లుగా ఊహల్లో తెలిపోసాగాడు.ఏది ఏమైనా తాను Robin Leach కి మాత్రమే మొదటి ఇంటర్వ్యూ ఇస్తాడు.అదంతే.
Geneva కి వచ్చి ఓ కారుని అద్దెకి తీసుకున్నాడు.Swiss Chalets ని,Water falls ని,snow peaked mountains ని, Sunsets ని , పొలం లో పనిచేసే వారిని ఇట్లా రకరకాల ఫోటోల్ని తీశాడు.మరి అదేమిటో గాని Bern నగరం సమీపిస్తుండగా ఇక కారు మొరాయించింది.అటుగా వచ్చే వెహికిల్ ని ఆపి అడిగితే కొద్ది దూరం లో మెకానిక్ గ్యారేజ్ ఉంది..నేను వెళ్ళి అతణ్ణి పంపిస్తాలే అని చెప్పాడు.సరేలే అనుకుంటూండగా ..ఒక అద్భుత దృశ్యం అతనికి కనిపించింది.Yes..my mother is right ..నేను ప్రపంచ ప్రసిద్ది పొందే దగ్గరకొచ్చేసిందిక అనుకున్నాడను..!!
--Murthy Kvvs

No comments:
Post a Comment