Sunday, August 30, 2015

ఆవు మాంసం గూర్చి ఇప్పుడు చర్చలు జరగడం అజ్ఞానం గాక మరేమిటి...

ఆవు మాంసం గూర్చి ఇప్పుడు చర్చలు జరగడం అజ్ఞానం గాక మరేమిటి...


ఆవు మాంసం లేదా బీఫ్  గూర్చి ఇప్పుడు వాదోపవాదాలు జరగడం అది మన వెనకబాటు తనమే.తినే వారు తింటారు తినని వారు తినరు. దానికోసం సెంటిమెంట్ ని లేవదీయడం అనవసరం.కోడి ఎలాగో ,దుప్పి ఎలాగో ,పంది ఎలాగో అలాగే ఆవు మాంసం కూడా.రోడ్ల మీద యజమానులు వదిలేసిన ఆవులు నానా రకాల ఆక్సిడెంట్ లు అయి  ఉన్నా పట్టించుకునే నాధుడు ఉండడు...కాని వాటి పేరు మీద ఎంత రాజకీయాలు నడుస్తుంటాయి. ఒకసారి ఓ టి వి ఇంటర్వ్యూ లో సిసి రెడ్డి గారు ఒక మంచి మాట చెప్పారు,గోమాలక్ష్మి అని కబుర్లు చెబ్తాము కాని దాని కడుపు నిండా ఆహారం పెట్టాలని అనుకోము.అలా అవసరం తీరిన తర్వాత వదిలేస్తాము ..ఆ తర్వాత అవి ఎలా చచ్చినా మనకనవసరం.

అది 1897 వ సంవత్సరం.కలకత్తా లో బాగ్ బజార్ లో ఉన్న ప్రియనాధ్ ముఖోపాధ్యాయ ఇంటిలో స్వామి వివేకానంద కూర్చుని ఉండగా కొంత మంది వచ్చి గో సమ్రక్షులు పేరు తో వచ్చి విరాళం అడుగుతారు.అప్పుడు ఆయన వారిని అడుగుతారు.మధ్య భారతం లో కరువు వచ్చి లక్షలాదిమంది చనిపోయారు.ఏమైనా చేయగలిగితే వారి కొరకు చేయండి.ముందు మనుషులు గురించి ఆలోచించండి ..జంతువుల గురించి కాదు అంటారు.అది వారి కర్మ ప్రకారం జరిగింది మేమేమి చేస్తాం అంటారు వచ్చిన వాళ్ళు. ఆ జంతువులు కూడా గత జన్మలో చేసిన దానికే అనుభవిస్తున్నాయేమో అలా ఎందుకు అనుకోరు మీరు అని వివేకానంద బదులిచ్చారు.

ఒకసారి అమెరికన్ శిష్యులతో కూర్చొని తింటూ ఉండగా  ఒక శిష్యుణ్ణి రమ్మని భోజనం తినమని చెప్పి ఆ తర్వాత అంటాడు నేటితో నీ బ్రాహ్మణత్వం పోయింది.నీవు ఇప్పుడు తిన్నది గోమాంసం అంటాడు.  అట్లా ఎన్నో సంధర్భాల్లో వివేకానంద  స్వామి గోమాంసం పట్ల ఉన్న భ్రమల్ని బద్దలు చేశాడు.కబుర్లు చెప్పడానికి ఏమి గాని ఏ మాంసాహారం తినని జాతి ఎప్పుడు లోకం లో విజేత గా నిలవ లేదు.నీవు ఈ లోకం లో పోరాటం చేయాలంటే మాంసాహారం తినవలసిందే అని ఎన్నో సందర్భాల్లో నొక్కి వక్కాణించారు.స్వామిజీ బెంగాలీ కాయస్థ వర్గానికి చెందిన వారు.ఈ వర్గం బ్రాహ్మణ మరియు క్షత్రియ కులం గా సంభావింప బడే వర్గం.మన దగ్గర చెప్పాలంటే నియోగులకు సమానమైన వర్గం గా చెప్పవచ్చును.సుభాష్ చంద్ర బోస్,జగదీష్ చంద్ర బోస్,బాబూ రాజేంద్ర ప్రసాద్,లాల్ బహదూర్ శాస్త్రి ,ఇప్పట్లో అయితే అమితాబ్ బచ్చన్,జయప్రకాశ్ నారాయణ్  ఇలాంటి వారంతా ఆ వర్గానికి చెందిన వారే..!

ఇది TALKS WITH SWAMI VIVEKANADA  అనే పుస్తకం లో నుంచి చదివిన తర్వాత రాయాలనిపించింది. ఈ గ్రంధాన్ని 1995 లో హిమాలయాల్లోని మాయావతి ఆశ్రమం వారు ముద్రించారు. 

No comments:

Post a Comment