Sunday, September 13, 2015

సిడ్నీ షెల్డన్ నవల The Doomsday Conspiracy సంక్షిప్తంగా ( 11 వ భాగం)

సిడ్నీ షెల్డన్ నవల The Doomsday Conspiracy సంక్షిప్తంగా ( 11 వ భాగం)

రమారమి ఇరవై చదరపు మైళ్ళ పరిధిలో  విస్తరించి ఉన్న కార్యాలయాల సముదాయమది.Virginia లో చాలా లోపలకి ఉంటుంది.బయటనుంచి చూసేవారికి  ఒక పెద్ద వ్యవస్థ అక్కడ ఉన్నట్లు కనిపెట్టడడం కష్టమే.ఆ ప్రదేశానికి చేరువుగా ఉండే రోడ్లన్నీ చాలా పాత గా  దుమ్ముతో నిండి పైన్ చెట్ల తో ఇంకా ఇతర చెట్ల తో చిందర వందర గా అడవి మాదిరి గా ..పెంచబడి ఉంటాయి అవి.బారికేడ్లు ఉంటాయి.అనుమతి ఇవ్వబడని ప్రదేశం అని కూడా వెలిసిపోయిన బోర్డులు కనిపిస్తాయి.అక్కడకి దరిదాపుల్లోకి వచ్చే ప్రతి చీమ స్కాన్ చేయబడుతుంది.

లోపల ఉండే వ్యవస్థ భిన్నంగా ఉంటుంది.ప్రతి రోజు అనేకమార్లు విమానాలు దిగడానికి అనువుగా నిర్మాణాలు ఉంటాయి.చిన్న చిన్న బిల్డింగ్ లు అక్కడక్కడ కట్టబడి ఉంటాయి.ఆ కాంపౌండ్ లోపలి ప్రదేశం ..అదొక వేరే ప్రదేశం.వేరే ప్రపంచం.

Robert కేవలం అక్కడ నేవీ వాళ్ళకి మాత్రమే శిక్షణ ఇస్తారు అనుకున్నాడు.కాని దానిలో CIA ఎంపిక చేసిన రకరకాల వ్యక్తులు ,ఆర్మీ ,నేవీ,ఎయిర్ ఫోర్స్,మెరైన్స్ లాంటి వాళ్ళకి కూడా శిక్షణ ఇస్తారు అని అర్ధమయింది. ఒకరోజు ఆడిటోరియం లో మీటింగ్ కి Colonel Frank Johnson  అనే పై స్థాయి అధికారి వచ్చి ప్రసంగించాడు.ఒక్క అనవసరమైన పదం దానిలో లేదు.

" మీ అందరకీ ఆహ్వానం పలుకుతున్నాను.ఈ క్షణం నుంచి మీ జీవితాలు Closed books వంటివి.మీ మొదటి పేరు తో పిలవబడతారు.మీరు ప్రతిజ్ఞని సీరియస్ గానే చేయవలసి ఉంటుంది.మీ స్నేహితులకి,మీ భార్యలకి,ఇంకా మీ దగ్గరి వారికి మీ యొక్క నిజమైన వృత్తి గూర్చి తెలియవలసిన అవసరం లేదు.
మీలో కొంత మంది బిజినెస్ మెన్ లు గా,డిప్లొమేట్ లు గా ,రచయితలుగా,ఉపాధ్యాయులుగా సమాజం లో వివిధ వృత్తుల్లో ఉన్నవారిగా బయట ప్రపంచం లో మెలుగుతు మీ పని చేసుకుపోవాలి.ఎవరకి అనువుగా ఉన్న ప్రొఫెషన్ ని వాళ్ళు ఎన్నుకోవచ్చు.ఒకటి గుర్తుంచుకొండి..మీలో ఉన్న కొన్ని ప్రత్యేక అర్హతలవల్లనే  ఇక్కడికిదాకా మీరు వచ్చారు. మీరు చేయబోయే అసైన్ మెంట్లన్ని దేశ రక్షణకి ,భవితకి ఉద్దేశింపబడినవి. కనుక వాటి ప్రాధాన్యతని ప్రత్యేకంగా  చెప్పనవసరం లేదు.

కొన్ని లిబరల్ సర్కిల్స్ లో కొంతమంది వ్యక్తులకి మనల్ని విమర్శించడం ఒక ఫేషన్ అయిపోయింది.కాని మీలాంటి అంకిత భావం గల మనుషుల వల్లనే మన దేశం అగ్రగామిగా నిలవగలిగింది.లేనట్లయితే కుక్కలు చింపిన విస్తరి అయ్యేది.ఇక్కడ మీ శిక్షణ ముగిసిన తర్వాత మిమ్మల్ని Case officer గా వ్యవహరిస్తారు.అంటే ఒక Spy అని అర్ధం. You have to work under cover.

వివిధ విషయాల్లో Surveillance ,counter surveillance,radio communication,encoding,weaponry  ఇంకా Map reading లలో మీరు ఇక్కడ శిక్షణ పొందుతారు.ఒక మనిషి తో Rapport ఎలా పెంపొందించుకోవాలి...ఎలా Motivate చేయాలి,మీ యొక్క Target ని ఎలా Ease లో ఉంచాలి..ఇంకా సంకేత భాషలో మీ Contacts తో ఎలా మాట్లాడాలి...ఇల్లాంటి వాటి మీద తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది.సరే..మిగతా విషయాలన్నీ  మీ  instructors ద్వారా మీరు తెలుసుకుంటారు."

*  *   *    *

Robert కి ఇక్కడి శిక్షణ చాలా ఆసక్తిదాయకంగా ఉంది.Instructors అందరూ బాగా ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారే.సామాన్యులు కారు.వివిధ ఆపరేషన్ లలో ఆరితేరినవారు. వివిధ భాషలు నేర్చుకోవడం అనేది కూడా ఓ అంశం ఇక్కడ. లోపల ఉన్న ఓ రూమర్ ప్రకారం Colnel Frank Johnson కి వైట్ హవుస్ తో ప్రత్యక్ష సంబంధాలున్నాయి.వివిధ దేశాల్లో జరిపే కోవర్ట్ ఆపరేషన్లు అన్నీ ఈయన కనుసన్నల్లో జరుగుతాయని కూడా..!

*  *  *  *   *

ఈరోజు Ron అనే Instructor క్లాస్ చెబుతున్నాడు.అతనూ ఒక ఏజెంటే.

" Clandestine operational process లో  ఆరు దశలుంటాయి.మొదటిది Spotting .అంటే మనకి కావలసిన information  ఎవరి వద్ద ఉంది అనేది కనిపెట్టడం. ఆ తర్వాత దశ ..ఏ ఉద్యోగి ఆ సమాచారానికి చేరువ లో ఉంటాడు అనేది తెలుసుకోవడం..ఆ మనిషికి నిజంగా ఆ పని చేయగలిగే అవకాశం ఉందా అనేది తెలుసుకోవాలి.ఆ వ్యక్తి ఉపయోగపడేవాడే అయితే అతని యొక్క అవసరాలు ఏమిటి...అనేది గుర్తించాలి.అంటే అతనికి డబ్బు అవసరమా లేదా ఇంకేదైనా సుఖం అవసరమా దేని ద్వారా అతను Motivate అవుతాడు అని పరిశీలించాలి.  లేక ఎవరిమీదనైన అతను అసంతృప్తిగా ఉన్నాడా అనేది గమనించాలి.అవన్నీ ఎనాలిసిస్ చేసిన తర్వాత మన పనిని అతను చేస్తాడా లేదా అని గుర్తించాలి.

ఇక మూడవ దశ  ,You build up a relationship with a prospect.సాధ్యమైనంత తరచుగా మాట్లాడుతూ Rapport ని డెవలప్మెంట్ చేసుకోవాలి.అతను మనకోసం సంసిద్దుడైనాడు అని అనుకోగానే రిక్రూట్ చేసుకోవాలి.ఇది నాల్గవ దశ.అప్పుడు కొన్ని సైకలాజికల్ వెపన్స్  ని ఉపయోగించాలి.అంటే అతని అవసరాలకి ధన సహాయం చేయడం...ఇంకా ఏదైనా థ్రిల్లింగ్ ని అతనికి కలిగించడం...అలాంటివి.ఆ తర్వాత అతన్ని నీ పని కోసం రిక్రూట్ చేసుకోవచ్చును.

సరే...ఇపుడు నీ కోసం పనిచేయడానికి ఒకరని సమకూర్చుకున్నావు..అవునా..?తర్వాత స్టెప్ అతడిని Handle చేయడం.నిన్ను మాత్రమే కాదు నీ యొక్క సోర్స్ ని కూడా నీవు రక్షించుకోవాలి.మనకి కావలసిన చోట వివిధ సీక్రెట్ వస్తువుల్ని ఎలా పెట్టాలి..ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి ఇలాంటివాటి ల్లో అతడికి తర్ఫీదు ఇవ్వాలి.అంటే ఈ అయిదవ దశ లో అతణ్ణి ఎడ్యుకేట్ చేస్తూ మన పనికి ఉపయోగించుకోవాలి.

చివరి దశ Disconnecting కి సంభందించింది.అంటే ఉదాహాణకి అతను ఎక్కడో వేరే ప్రాంతానికి బదిలీ అయిపోయాడు అనుకుందాం లేదా మనకే అతనితో అవసర తీరిపోయింది అనుకుందాం ..అపుడు అతణ్ణి జాగ్రత్తగా Disconnect చేయాలి.తనను ఉపయోగించుకొని వదిలేశారు అనే భావం అతనికి కలగకుండా చేయాలి.మనపై కక్ష తీర్చుకోవాలి అనే ఉద్దేశ్యం అతని లో రాకుండా విడిచిపెట్టాలి."

*  *  *  *  *
అవును ..Colnel Johnson ఆ రోజు చెప్పింది నిజమే.చాలా కొద్దిమంది తప్ప ఎవరూ ఈ శిక్షణని  విజయవంతంగా పూర్తిచేయలేరు.దీనికి ఒక ప్రత్యేక మైన అర్హత ఉండాల్సిందే.కొన్ని రోజుల్లో ఈ Instructors పరిచయం అయారు అనుకునేలోగా ఎవరో కొత్త వాళ్ళు వచ్చేవాళ్ళు.అక్కడున్న స్టాఫ్ విషయమూ అంతే.అయితే ఎవరూ కూడా దాన్ని ప్రశ్నించే చొరవ చేయలేక పోయేవారు.ఒక మారు ఒక Instructor అన్నాడు రాబర్ట్ తో..!

" శిక్షణలో భాగంగా నీకొక పరీక్ష పెడుతున్నాను ఈ రోజు...నువు రిచ్మండ్ ఏరియా లో ఏదైనా ప్రదేశం కి వెళ్ళు.నీ వెన్నంటే ఉండి నీ క్రియలన్నిటిని కనిపెట్టడానికి ఒక మనిషిని నీకు  తెలియకుండా అనుసరించేలా చేస్తాను.అయితే అతడిని తప్పించుకుని బురుడి కొట్టించి నువు బయటబడి ఇక్కడకి రావాలి.ఇది Surveillance లో ఒక ప్రక్రియ" అని..!

" Yes sir " అన్నాడు Robert..!   (సశేషం) www.newsvarsha.com


  

No comments:

Post a Comment