సాధ్యమైనంత శాంతికరంగా ,నిత్య జీవితం లో మసలుదామని ..ఆ ఆనందం లోని మాధుర్యం చవి చూద్దామని అనుకోవడం ..అలా ఉండగలగడం కూడా ఒక జీవిత కళే ,కళే కాదు.అసలు జీవిత సారం ఎంతో కొంత అర్ధమయ్యేది అలాంటి క్షణాల లోనే.. !జీవితాన్ని ఎప్పుడూ అలా తోసుకుంటూ పోవడం ఎలాను తప్పదు కాని ..కొన్ని వీలున్నా క్షణాల్లోనైనా ఈ సమస్త క్రియలు దేనికోసం అని..ఈ శరీరం నాది కాదు అని చెప్పి కాసేపు భావించి గమనిస్తూ ఉంటే ...ఎప్పటికప్పుడు దుర్భరం చేసుకుంటూ మళ్ళీ దాని గూర్చి ప్రణాళికలు వేసుకుంటూ ..అదే పనిగా పోతూ పోతూ ఎక్కడో ఈ దేహ ప్రయాణాన్ని ఆపేస్తాము.ఆ తర్వాత ఏమిటో చూసి వచ్చి చెప్పిన వారు లేరు.ఎవరి గ్రంధాలు వారు చదువుకుని ఏదో అనుకోవడమే తప్ప.
పేపర్ లలో చూస్తుంటాము. చదువుకున్నవాళ్ళు,ఎంతో కొంత ఆర్దిక స్థిరత్వం ఉన్నవాళ్ళు కూడా ..హత్యలు, ఆత్మ హత్యలు ఇలాంటి వాటికి లోనవడం.తమతో పాటు పిల్లల్ని కూడా !ప్రేమ ఒక మారు ఏర్పడితే అది అలా నే ఏడు జన్మలూ ఉండిపోవడం అటుంచి ఒక్కోమారు ఏడు మాసాలు కూడా ఉండకపోవచ్చును.అది ఒక అవకాశమున్న స్థితి. ఏ ప్రేమ స్థిరం కాదు.అది మానవ స్వభావం.నేరం కూడా కాదు.దాన్ని అంగీకరించకలిగితే చాలా సమస్యలు దూదిపింజలు మాదిరిగా తేలిపోతాయి.నీరు లాగా గాలి లాగా ప్రేమ కూడా అంతే.ఎటునుంచి ఎటు సాగుతుందో ..దానికి ఉండే కారణాలు ఒక్కోమారు కనిపెట్టడమూ కష్టమే...చాలా లోనకని ఉండవచ్చును.కాని లోపల పెంకి ఘటం ఉంటుంది..అది అంత తిన్నగా ఒప్పుకోదు..అక్కడనే వస్తుంది చిక్కు..!Click here

No comments:
Post a Comment