Thursday, August 27, 2015

సిడ్నీ షెల్డన్ నవల The Doomsday conspiracy సంక్షిప్తంగా (10 వ భాగం)

సిడ్నీ షెల్డన్ నవల The Doomsday conspiracy సంక్షిప్తంగా (10 వ భాగం)

కారు మొరాయించడం తో అలా రెండు గంటలపాటు రోడ్డు మీదనే ఉండిపోయాడు Leslie Mothershed..!ట్రాఫిక్ పెద్దగా లేదు.ఉండుండి ఎప్పుడో ఓ వాహనం వెళుతోంది.తనతో మాట్లాడిన ఆ బాటసారి చెప్పినట్లున్నాడు..మొత్తానికి ఓ మెకానిక్ వచ్చాడు ..తన చెడిపోయిన కారుని తన కారు తో లాక్కెళ్ళడానికి..!Leslie కూడా సిద్ధమవుతున్నాడు గ్యారెజ్ కి వెళ్ళానికి..!సరిగ్గా అప్పుడే జరిగింది ఓ వింత.

ఉన్నట్లుండి ధడేల్మని ఓ విచిత్ర వాహనం వంటిది పైనుంచి భూమ్మీద పడింది.అది రోడ్డుకి అవతవేపు పడింది.గమ్మత్తుగా ఉందది.గుండ్రంగా ఉంది..దాని చుట్టూ రంగు రంగు కాంతులు మెరుస్తూ ఆరుతూ ఉన్నాయి.సందేహం లేదు అది  UFO నే..! కిందబడ్డం తో దానికున్న తలుపులు గభాలున తెరుచుకున్నాయి.లోపల రెండు విచిత్ర ఆకారాలు ఉన్నాయి.వాటి పుర్రెలు పెద్దగా ఉన్నాయి.కళ్ళు లోపలికని ఉన్నాయి.చెవులు వంటివేమీ లేవు. సిల్వర్ మెటాలిక్ సూట్లు ధరించి ఉన్నాయి ఆ ఆకారాలు.

ఇప్పడిదాకా Flying saucers గురించి వినడమే తప్ప చూసింది లేదు.మై గాడ్ ఇది అదే.అలాగని Leslie అనుకుంటుండగా ..అంతలోనే దారిన పోతున్న టూరిస్ట్ బస్ ఒకటి అక్కడాగింది.దానిలోని టూరిస్ట్ లు కిందకి దిగి ఈ వింత దృశ్యాన్ని చూడసాగారు.ఒక్కొక్కళ్ళు ఒక్కోమాదిరిగా ఫీలవుతున్నారు.ఇక Leslie మెదడు పాదరసం లా పనిచేయనారంభించింది.తాను ప్రపంచ ప్రసిద్ధ ఫోటోగ్రాఫర్ అయ్యే రోజు వచ్చేసింది.దానితో పాటు మిలియన్ పౌండ్ల ధనం కూడా ..!లేకపోతే ఇలాంటి అరుదైన దృశ్యం తన కంట బడటం ఏమిటి..?వీటిని ఫోటోలు తీసి బ్రిటన్ లో The Sun,London Times,The Mail,The Mirror  లాంటి ప్రముఖ పత్రికలకి అమ్ముతాడు తను.విదేశం లో అయితే Le Figaro,Paris Match,Oggi,Der Tag,Time,USA Today వంటి పత్రికలకి మాత్రమే అమ్ముతాడు.సరే రష్యా,జపాన్,చైనా ఇలా ప్రతి దేశం వారికి అమ్ముతాడు ..ఎవర్కి Exclusive rights ఇవ్వడు.కావలసిన వాళ్ళు సొమ్ము చెల్లించి కొనుక్కోవలసిందే.ఇలా గాలిలో తేలుతూ Leslie ..ఆ గుంపుని తోసుకుంటూ దగ్గరకి వచ్చి ఫోటోల మీద ఫోటోలు తీయసాగాడు.కారు ని తీసుకుపోవడానికి వచ్చిన మెకానిక్ ని కూడా పిలిచి ఆ వింత వాహనం పక్కన నిలబెట్టి స్నాప్ లు లాగాడు. ఆ టూరిస్ట్ ల్ని అందర్నీ చక్కగా దానికి ఇరుపక్కలా సెట్ చేసి కొన్ని ఫోటోలు తీశాడు.

" మీరంతా మీ పోస్టల్ అడ్రస్ లు రాయండి.ఫ్రీగా ఓ కాపి మీ దేశం కి పంపించుతా " అంటూ వాళ్ళందరిచేత  అడ్రెస్ లు రాయించుకున్నాడు. అతనికి అలాంటి ఉద్దేశ్యం ఏమీ లేదుగాని ..ఎవరైనా  ఈ UFO ఫోటోలు నకిలీవి అని వాదిస్తే సాక్ష్యం గా వీళ్ళ అడ్రెస్ లు ఇస్తాడన్నమాట.అదీ Leslie ప్లాన్. టూరిస్ట్ ల దగ్గర కూడా కెమెరాలున్న సంగతి పసిగట్టి  వాటితో కూడా కొన్ని ఫోటోలు లాగినట్టు చేశాడు.అవి సరిగ్గా రాని విధంగా తీశాడు.టూరిస్ట్ లు అంతా ఒక ట్రాన్స్ లో ఉన్నట్లుగా ఉన్నారు...ఆ దృశ్యాన్ని చూస్తూ..!

*  *  *  *
Swissair ఫ్లయిట్ లో కూర్చొని రిలాక్స్ అవుతున్నట్లుగా కళ్ళు మూసుకున్నాడు Robert.ఆ విమానానికున్న రోల్స్ రాయిస్ ఇంజన్లు ఆ రాత్రి గాలిని తాగుతూ ముందుకు ఉరికిస్తున్నాయి ఆ లోహ విహంగాన్ని..!" ప్చ్..ఏమిటో ఈ అసైన్ మెంట్ ఎన్ని రోజులు తీసుకుంటుందో " అనుకున్నాడతను.ఒక్కసారిగా గతం గుర్తుకు రాసాగింది.కొన్ని ఏళ్ళక్రితం ఇదే లండన్ కి Susan తో కలిసి వచ్చాడు.ఎంత తేడా ..ఎంత మార్పు..!కనీసం ఓ వంద చోట్లయినా ఆమె గుర్తుకు వచ్చింది.ఆ ప్రదేశాలు అలానే ఉన్నాయి.ఆమె మటుకు ఇప్పుడు లేదు.

ఆ రోజుల్లో Susan తో ఉండటమే ఒక విషయం గా ఉండేది.ఎక్కడ ఉన్నామనేది తర్వాత..!సంతోషంగా సాగుతున్న వారి వైవాహిక బంధం అలా తెగి పోవడం ఇప్పటికీ కలగానే ఉంది.తాను Navy నుంచి డిశ్చార్జ్ అయి  ఆరు నెలలు అప్పటికి. ఓ రోజు ఉన్నట్లుండి Admiral Whittaker  నుంచి ఫోన్ వచ్చింది.అతను రాబర్ట్ కి ఫాదర్ ఫిగర్ వంటివాడు ఇంకా సీనియర్ కూడా..!

తను అప్పుడు బ్యాంకాక్ లో ఓరియంటల్ హోటల్ లో ఉన్నాడు. Susan తో కలిసి.

"How soon can you get back to Washington " అడ్మిరల్ అడిగాడు.

"ఏమిటి విషయం.." ప్రశ్నించాడు రాబర్ట్.

" నీకు ఒక కొత్త అసైన్మెంట్ ఇవ్వాలని భావిస్తున్నాము.17th District Naval Intelligence కి ప్రస్తుతం నన్ను డైరక్టర్ గా నియమించారు.నీ అవసరం ఉందిప్పుడు.."

" అసలు సంగతి చెప్పకూడదా"
" అది ఫోన్ లో వివరించేది కాదు.You would be doing an important service for your country..సాధ్యమైనంత త్వరలో నన్ను కలుసుకో "  ఫోన్ డిస్కనెక్ట్ అయింది.

ఈ విషయాన్ని Susan కి చెప్పాడు. " రాబర్ట్ నీకిష్టమైన పనిని నువు చెయ్యి" అన్నదామె. కాని మనస్ఫూర్తిగా అన్నట్లు లేదు.Robert ఎట్టకేలకు Admiral ని కలిశాడు.అతను అసలు విష్యం చెప్పసాగాడు." This job requires brains,courage and initiative,Robert..! ఈ మూడు నీకు పుష్కలంగా ఉన్నాయి.అందుకే నిన్ను ఎన్నుకున్నాను.కొన్ని టెర్రరిస్ట్ గ్రూపులు మన దేశ భద్రత కి సవాలుగా మారాయి.వారికి అండ దండలు ఇచ్చే ఓ అరడజను దేశాలు ఆటం బాంబులు కూడా వారి కోసం తయారు చేస్తున్నాయి.ఇపుడు నా జాబ్ ఒకటే. మెరికల వంటి వారిని Intelligence network లోకి తీసుకొని వాళ్ళ పనుల మీద నిఘా పెట్టడం..ఇంకా కొన్నిటిని నిర్వర్తించడం..దానికి నీ సాయం కావాలి."

" సరే" అన్నాడు రాబర్ట్.

అతడిని Naval intelligence  లో భాగంగా చేర్చడం జరిగింది.Rosslyn(Virginia)  లో ఓ అద్దె అపార్ట్ మెంట్ లో Susan ఉండసాగింది.అది రాబర్ట్ పనిచేసే కార్యాలయానికి దగ్గరగానే ఉంటుంది. అక్కడ శిక్షణ అయిన తర్వాత అతడిని Farm కి పంపించారు.Secret service agents కోసం CIA ఇచ్చే శిక్షణా కార్యక్రమం అది. (సశేషం)  

No comments:

Post a Comment