ఈ మధ్య సిం హా చలం వెళ్ళాను.దైవ దర్శనానికి..మరీ ఎక్కువ లేరు తక్కువా లేరు జనాలు.ఆ క్యూ లో అలా ముందుకు నడుస్తున్నానా..ఆ లైన్ లోనే వికవికలు,పకపకలు...ఎదుటి వారి మీద ఎత్తి పొడుపు మాటలు,టీజింగ్ డైలాగులు ఎప్పుడో జరిగి పోయిన రొమాంటిక్ సీన్లు తల్చుకుంటూ కిత కితలాడుకుంటూ ముందుకు సాగుతున్నారు ..అదే క్యూ లో దైవ దర్శనానికి వచ్చాము గదా కనీసం ఈ కొద్ది గంటలైనా నిశబ్దం గా ఉందాము అనే స్పృహ ఉండటం లేదు జనానికి..నూటికి యాభ శాతం ఇలాగే కనిపిస్తున్నారు.అక్కడ కూడా తమ డైలీ యవ్వారాలే.కనీసం ఎదుటి వారి ఏకాంతానికైనా ,ప్రశాంతత కైనా విలువనిద్దాం అనే స్పృహ ఉండడం లేదు.అసలు వీళ్ళకి ఎవరు చెప్పాలి.ఎవరు దిశా నిర్దేశం చేయాలి.ఎవరు చెప్పినా వినే రకాలుగా కూడా కనిపించడం లేదు. ప్రతి దాన్ని వేళాకోళం చేయడం ,వెర్రి జోక్ గా తీసుకోవడం అనేది ప్రస్తుత సినిమాలు నుంచి బాగా అబ్బుతున్నట్లు తోచింది.అసలు ప్రజాస్వామ్యం కూడా ఇలాంటి వాళ్ళకి పనిచేయదు.సింగపూర్ లో మాదిరిగా క్రమశిక్షణ ని పబ్లిక్ లో నిర్లక్ష్యం చేసేవారికి పేము బెత్తాలు ఉపయోగించడం ఒకటే దారి.
భక్తి వల్ల నో భయమో లేక ఇతరులకి ఇబ్బంది కలిగించకూడదనే ధ్యాసో గాని ప్రార్ధనా స్థలాలలోకి వచ్చినప్పుడు చర్చ్ లోగాని మసీదు లో గాని అక్కడి యువత ఇలాంటి ప్రవర్తనకి దూరం గా ఉంటారు.అక్కడున్న మత పెద్దలు చెప్పినా మిగతావారు కూడా దాన్ని సపోర్ట్ చేస్తారు.కాని మన హిందూ మతం లో ఈ బాధ్యతని ఎవరూ చేపట్టడానికి ముందుకు రారు.పీఠాధిపతులు హై ప్రొఫైల్ మనుషులతో బిజీ గా ఉంటారు.వాళ్ళకి ఇవన్నీ అనవసరం. Click here

No comments:
Post a Comment