వివేకానందుని లో మార్మికుడు,ఒక యోగి,ప్రబోధకుడు ఎలా ఉన్నారో అలానే ఒక మంచి ప్రయాణికుడు కూడా ఉన్నాడు.ఆ మహానుభావుని అంతర్దృష్టి ఆయన రచనల్లో కనబడుతుంది.ఒక యూరోపియను కి సగటు భారతీయుడు ఎలా కనిపిస్తాడు..అలాగే ఒక భారతీయుడు వాళ్ళ రీతుల పట్ల ఎలా ఫీలవుతాడు అనేదాన్ని The east and west లో గమ్మత్తుగా వర్ణిస్తాడు.అసలు కొన్ని విషయాల్ని ఆయనంత హాస్య పూర్వకంగా కొండొకచో కుండ బద్దలు కొట్టినట్లు చెప్పడం చాలా అరుదుగా చూస్తాము.కేవలం వివేకానందుని కొటేషన్లు మాత్రమే చదివితే అది తెలియదు.ఆయన రచనల్ని పరిశీలనగా చదివితేనే తెలుస్తుందది.
ఎన్నో శతాబ్దములుగా అనుభవిస్తున్న నైరాశ్య దారిద్ర్యములచే ముఖములందు లోతగు రేఖ లేర్పడి ,చీలిక పేలిక ప్రాతలు కట్టుకుని ఇటు అటు తిరుగాడు శల్య వశిష్ట దేహులగు యువకులు,వృద్దులు, ప్రతి చోటను సర్వ సామాన్యముగా సంచరించుచుండు ఆవులు,ఎద్దులు,దున్నలు,- వాటిలో కూడా అట్టిదే దీన దృష్టి..అట్టిదేయగు శరీర దౌర్బల్యము,తోవల ప్రక్కల పెంట,చెత్తకుప్పలు,,ఇదియే ఇప్పటి మన దేశము.. దివ్య వస్త్రములు ధరించిన వారి పక్కన నడయాడు కౌపీన ధారులు..సంపద కలిగి కడుపార తిని తిరుగువారిని కాంతివిహీన నేత్రములతో చూచుచుండు అన్నార్తులు ...స్వదేశీయుల చేతను,విదేశీయులచేతను త్రొక్కబడి ప్రాణములనే చాలవరకు లోల్పోయిన ప్రజలు....ఈ జీవితం ఎంత అనిశ్చ్య రూపముగా నున్ననూ ..ఏదో రకముగా కాపాడుకొనచూచువారు...బానిసలకు సహజమగు అసూయ తో తోటి వారి ప్రగతిని ఆమోదింపనివారు...బలవంతుల పాదధూళి నాకుచుండియే తమకన్నా కొంచెము కింది వారిని చావమోదువారు...ఇదియే మనలను గూర్చి ఆంగ్లేయ బుద్ది యందు సజముగా ఏర్పడు భావ చిత్రము..!
ఇక మనము ఆంగ్లేయులను చూచు విధానము ఎట్టిదనిన...నూతన అధికారము అనే మద్యంచే ఉన్మాదం నొందిన వారు...భార్యాదాసులు,కామాతురులు,ఆటవిక మృగము వలె కౄర బుద్ది గలవారు,భౌతిక పదార్థము తప్ప వేరేదియు లోకమున లేదు అను భావం తో ఉండువారు..బలాత్కరించియు,వంచించియు, ద్రోహమొనర్చియు ఇతరుల దేశములను ,సంపదను ఆక్రమించు వారు..స్త్రీ పురుషులు ఒకరినొకరు కౌగలించుకొని లజ్జా విహీనులై నృత్యము చేయువారు, ఇట్లు పాశ్చాత్యులు ప్రత్యక్ష రాక్షసులుగా భారతీయులకు కనిపించుదురు. ఇటువంటి జాతుల యందు ఏదైన ఎన్నదగిన సౌశీల్యం ఉండునా అని మనము భావిస్తాము,అదే విధముగా మనలను బానిసలుగా చూచుచు వీరియందేమైన గొప్ప గుణము ఉండునా అని వారు మనలను ఈసడీంచుట జరుగును. కాని ప్రియ మిత్రుడా ..ఈ రెండు అభిప్రాయములు పాక్షిక సత్యములే..ఒకరినొకరు నిజముగా ఎరుగని కారణముచేతనే సత్యవిషయము కాంచుట లేదు...ఆ విధంగా చాలా సోదాహరణముగా వివిధ విషయాల్ని వివరిస్తారు.ప్రతి వాక్యము లో ఎన్నో భావములు ఉంటాయి,నిజం గా ఆసక్తిగా చదవగలిగినట్లయితే..! మళ్ళి ఒకసారి దీని గూర్చి మాట్లాడదాము.

No comments:
Post a Comment