Friday, October 2, 2015

సిడ్నీ షెల్డన్ నవల The Doomsday Conspiracy సంక్షిప్తంగా (12 వ భాగం)

సిడ్నీ షెల్డన్ నవల The Doomsday Conspiracy సంక్షిప్తంగా (12 వ భాగం)

Robert రిచ్ మండ్ లో బస్ దిగి వీధుల్లో తిరగసాగాడు.ఒక అయిదు నిమిషాల్లోనే పసిగట్టగలిగాడు తనని ఇద్దరు వ్యక్తులు ఫాలో అవుతున్నారని..!ఒకరు వాహనం మీద,ఇంకొకరు మామూలుగా నడుస్తూ.వాళ్ళ దృష్టి మళ్ళించడానికి కొన్ని సార్లు రెస్టారెంట్లలోను,కొన్ని సార్లు షాపు ల్లోకి దూరి వెనక గుమ్మాల ద్వారా బయటకి రావడం మొదలెట్టాడు.విచిత్రంగా వాళ్ళు తనని విడవకుండా ఏదో చోట అనుసరిస్తూనే ఉన్నారు.ఎంతైనా వాళ్ళూ శిక్షణ పొందిన Spy లే గదా..!అలా కొద్ది దూరం లో ఉంటూ తనని గమనిస్తున్నారు.

Robert ఉన్నట్లుండి ఒక లిఫ్ట్ ద్వారా మెన్స్ డిపార్ట్మెంట్ స్టోర్ లోకి వెళ్ళాడు.ఒక అరగంట తర్వాత తన డ్రెస్ మార్చుకుని అంటే వేరే కలర్ సూట్ ,టోపీ,లాంగ్ కోట్ వేసుకుని ,ఒక స్త్రీ ని ఇంకో చిన్న పిల్లని వెంటబెట్టుకొని బయటకి వచ్చి మెల్లిగా వాళ్ళ ముందరినుంచే ఆ మాల్ బయటకి వెళ్ళిపోయాడు.అట్లా అనుసరిస్తున్న ..ఏజెంట్ లని ఏమార్చి విజయవంతంగా తన Instructor చెప్పిన ప్రకారం Form కి తిరిగివచ్చాడు.ఆ విధంగా Surveillance లో ఓ ప్రాక్టికల్ ని పూర్తి చేశాడు రాబర్ట్.

*  *  *  *
గూఢచారులు తమ సాటి వారితో,ఇంకా కార్యాలయ సిబ్బంది తో మాట్లడేటప్పుడు కొన్ని కోడ్ పదాల్ని వాడాలి.వాటి మీద క్లాస్ నడుస్తోంది.

" ఏజెంట్ లలో రెండు రకాలు ఉంటారు.Agents of influence అనబడేవాళ్ళు వివిధ ప్రక్రియల ద్వారా, సాధనాల ద్వారా ప్రజాభిప్రాయాన్ని మార్చడానికి కృషి చేస్తుంటారు.రెండవ రకానికి చెందిన Agents of provocateure ..వాళ్ళు వివిధ సంఘటనల ద్వారా దేశం లో అస్తవ్యస్త పరిస్థితుల్ని సృష్టించడానికి యత్నిస్తుంటారు.CIA పరి భాషలో Biographic leverage అనేది ఒకటుంది.సింపుల్ గా చెప్పాలంటే కార్య సాధన కోసం Bribes నుంచి Burglary వరకు యత్నించే విధానం.Black mailing అనేది కూడా ఒక అంశం దీనిలో..!They are called "Black bag jobs" ,watergate was a black bag job ..!

ఆ ఇన్స్ట్రక్టర్ అలా చెబుతూ క్లాస్ మొత్తం వేపు చూశాడు,అంతా శ్రద్ధగా వింటున్నారు.మళ్ళీ చెప్పసాగాడు.

" మన పరిభాష లో ఫేక్ పాస్ పోర్ట్ ని తయారు చేసే వారిని Cobblers గా వ్యవహరిస్తాము,మన వృత్తిలో వాళ్ళ తో చాలాసార్లు పనిబడుతుంది.Demote maximally అనే అంటే టార్గెట్ ని "టెర్మినేట్" చేయడం.Firm అనే మాటని బ్రిటీష్ సీక్రెట్ ఏజెన్సీ ని ఉద్దేశించి అంటాము."Fumigate " చేయమని ఆఫీస్ నుంచి చెపితే దాని అర్ధం బగ్గింగ్  చేసే సాధానాల్ని ఉపయోగించమని.

అలాగే ప్రతి Spy కి అతనికి సంబందించిన బయోగ్రఫీ ని సమకూర్చుతాము ..దాన్ని Legend గా వ్యవహరిస్తాము.Going private అంటే అతను సర్వీస్ నుంచి వైదొలుగుతున్నాడని..!" క్లాస్ అంతటిని  ఆ మూలనుంచి ఈ మూలకి ఓ మారు చూసి అన్నాడు Instructor .." అవును Lion Tamer అనే మాట విన్నారా..?దాని అర్ధం సిమ్హాన్ని మచ్చిక చేసుకునే వాడని..కదా..కాని మన దగ్గర కొద్దిగా తేడాగా వాడబడుతుంది ఆ మాట..మన సీక్రెట్   ఏజన్సీ లో పనిచేసి బయటకి వెళ్ళిపోయిన ఏ ఏజంట్ అయినా తన వద్ద ఉన్న Information తో మనల్ని బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తే ..అలాంటి వారిని కట్టడి   చేయడానికి రంగం లోకి దిగే యోధులనే Lion Tamers అంటారు.బహుశా మీకెవరికీ అలాంటి వారితో పనిపడదనే భావిస్తున్నాను."

ఆ మాటకి క్లాస్ లోని వారంతా చిన్నగా నవ్వారు.దానిలో నెర్వస్నెస్ ధ్వనించింది.

" సరే..ఇంకొకటి ఫలానా మనిషి measels వల్ల మరణించాడు అంటే దాని అర్ధం బయటకి సహజ మరణంగా అగుపించేలా ఆక్సిడెంట్ లో చంపివేయడం..మళ్ళీ దీనిలో కొన్ని రకాలున్నాయి.అవి ముందు వస్తాయి.మరొకటి గుర్తుంచుకొండి.. మన వృత్తిలో Coincidence అనేది ఏది ఉండదు.ఒక వ్యక్తిగాని,వాహనం గాని రోజుకి రెండు మూడు సార్లు మీకు కనిపించిందంటే ..వెంటనే మీరు అలర్ట్ గా దానిపై ఒక కన్ను వేసి ఉంచాలి...ఈ రోజుకి ముగిద్దాము" అంటూ అతను సెలవు తీసుకున్నాడు.

ఆ తర్వాత కొన్ని రోజులు వరుసగా Colonel Johnson పని పెట్టుకొని పిలిచి పిచ్చాపాటి మాట్లాడే వాడు ... రాబర్ట్ తో..!అది బయటకి Casual talk లానే ఉండేది గాని ఏదో అంతరార్ధం ఉన్నట్లుగా అనిపించేది.Loyalty,Duty,Death ఇలాంటి వాటి పై చర్చ సాగేది.ఓసారి అతను అడిగాడు " You have faced death more than once...Robert..are you afraid to die " అని.

" No..but to die for a good reason,not sense lessly "  బదులిచ్చాడు.

*  * *  *
16 వారాల శిక్షణ. బయటివారు అక్కడికి వచ్చే అవకాశమే ఉండదు.మొత్తానికి పూర్తి చేసుకొని ఇంటికి వచ్చాడు.రాగానే Susan ఎదురేగి ముద్దాడి అన్నది " Hi ,sailor..want to have a good time " అని.

" I am having one,just holding you"  బదులిచ్చాడు రాబర్ట్.

"God, I missed you so much,I think I would die, if anything happens to you"

" Nothing is ever going to happen to me"

" You look so tired"

" It was pretty intensive course "  రాబర్ట్ చెప్పాడు.

ఒక అయిదు నిమిషాల్లో Susan  తన దుస్తులు విడిచి చెప్పింది " రాబర్ట్ .. నిన్ను నగ్నంగా చూడటం  నాకిష్టం." అని.ఇద్దరు ఆ విధంగా బాత్ టబ్ లో దిగి  క్రీడించటం మొదలెట్టారు. (సశేషం) Click here


No comments:

Post a Comment