ఈ రోజు క్రిస్మస్ సందర్భంగా ఈ కొన్ని మాటలు లేదా ఏదో స్వగతం.మతం మత్తు మందు అదీ ఇదీ అంటుంటాం గాని మతం మాదిరి గా మనుషుల్ని దేశ సరిహద్దులు,ఖండాల సరిహద్దులు దాటి ఏకీకృతం చేయగలిగేది ఇంకొకటి ఉందా అనిపిస్తుంది.లేకుంటే ఎక్కడో పశ్చిమాసియా లోని బెథ్లెహేం అనే ప్రదేశం లో జన్మించిన ఆ మహానుభావుని అంశ ఈ భూమి చుట్టూతా పరుచుకోవడం ఏమిటి..? ఇన్ని దేశాలు ఈ రోజున ఒకే ఆనందం లో పులకించడం ఏమిటి..?ఒక రీతి,ఒక సంస్కృతి ఆ పేరు పై అల్లుకోవడం.ఈ గ్రహం మీద ఉన్న జీవులన్నిటి కోసం ఒక సూపర్ ప్లాన్ ఎవరో తయారు చేస్తున్నట్లు అనిపిస్తుంది..ఇన్ని వందల కోట్లు జనాభా ఉన్న ఇక్కడ మతాలు మాత్రం ఇంచు మించు ఓ అరడజను మాత్రమే ప్రధానమైనవి ఉండడం దాని మూలంగా భౌగోళిక సరిహద్దులు దాటిన మానవీయ ప్రేమ లేదా ఓ Belongingness ని కలిగి ఉండడం..ఆలోచిస్తే అంతు తెగనిదే.వాటి విస్తరణకి మనిషి నానా వ్యూహాలు పాటించి ఉండవచ్చును..కాని అదీ ఒక చారిత్రక అవసరం లో భాగమేనేమో..!
భారత్ లో మతం మారినవారంతా స్వార్ధ ప్రయోజనం కోసమే మారినారు అనడం సత్య దూరము.ఈ విషయాన్ని నూరు ఏళ్ళ క్రితం స్వామి వివేకానంద స్ఫుటంగా చెప్పారు.మీ మతం లో వారు కొన్ని వందల ఏళ్ళుగా తమ ఆత్మ గౌరవాన్ని కోల్పోయినారు.కనుకనే అన్య మతాలను ఆదరించినారు."How mercyless your religion is ..." హిందూ మతం లోని ఉన్నత భావాలని కింది స్థాయి వరకు తీసుకువెళ్ళలేకపోయినందుకు ఏర్పడిన స్థితి ఇది.ప్రపంచం లోని దీనులను,సమాజము చే కొట్టివేయబడిన వారిని లేవనెత్తడానికే ఆ యోగి పుంగవుడైన క్రీస్తు అవతరించినాడని తెలుసుకో అని చెపుతారు. Click here

No comments:
Post a Comment