Saturday, January 9, 2016

"కిల్లింగ్ వీరప్పన్" సినిమా గూర్చి



ఈ రోజే కిల్లింగ్ వీరప్పన్ చూశాను.కన్నడ భాష లో తీయబడి తెలుగు హింది తమిళ్  ల లోకి అనువదించబడింది.వీరప్పన్ అంటే తెలియంది ఎవరికి..ఆ చనిపోయే సమయం దాకా పశ్చిమ కనుమ ల వల్ల దట్టంగా అల్లుకున్న మూడు రాష్ట్రాల అడవి లో సంచరిస్తూ స్మగ్లింగ్ లో కొత్త పుంతలు తొక్కి అనేక మంది ఫారెస్ట్ ఇంకా పోలిస్ అధికారులని చంపిన అతని గురుంచి ఇప్పటికే ఓ అరడజన్ సినిమాలు వచ్చినట్లు గుర్తు.విలువైన చందనపు కర్రలు,ఏనుగు దంతాలు వంటివి పెద్ద ఎత్తున స్మగ్లింగ్ చేసి కొన్ని వందల కోట్లు గడించి ఆ అడివి లోనే ఎక్కడెఖ్ఖడో పాతి పెట్టినట్లు కధనాలు వచ్చాయి.తమిళ్ నాడు,కర్నాటక రాష్ట్రాల్లోని   కొందరి మంత్రుల చేతులు కూడా వీరప్పన్ ఎదగడం లోను ,తప్పించుకోవడం లోను ఉన్నాయని అంటారు.అల్లాంటి వీరప్పన్ ని గూర్చిన వేట ఆసక్తి కలిగిస్తుంది.తప్పదు.అయితే కొన్ని అంశాల్ని వివాదస్పదమైనవి వదిలేశారు.

ముఖ్యంగా పోలీస్ అధికారి గా శివ రాజ్ కుమార్ ఒక ప్లస్ పాయింట్.నిజ జీవితం లో సెందామరై  కణ్ణన్ అనే అనే అధికారి ని పోలి ఉంటుంది గాని ఆ పేరుని పెట్టలేదు.నూటికి నూరు పాళ్ళు న్యాయం చేశాడు.వీరప్పన్ గా సందీప్ భరద్వాజ్ అచ్చు గుద్దినట్లు గా సరిపోయాడు.ఈ రెండు పాత్రలే బాగా సత్తా ఉన్నవి.రెండూ సమంగా ఎలివేట్ అయ్యాయి.ఇలాంటి సినిమాలో పాటలకి ప్రాధాన్యతని ఆశించరాదు.ఎత్తు జిత్తులు కలిగిన ఒక రాక్షసుని వంటి వ్యక్తిని అలాంటి గుణ గణాలే కలిగిన వ్యక్తి బాగా అర్ధం చేసుకొని ట్రీట్ మెంట్ ఇవ్వగలడని చివరకి తేల్చుతారు.రాం గోపాల్ వర్మ లో ఒకప్పుడు ఉన్న  అన్ని వర్గాల్ని మెప్పించే ఒక పనితనం పోయిందేమో అనిపిస్తుంది.భయానకం,శృంగారం ఈ రెండు వెంటనే మనిషి ని వెనుదిరిగి చూసేలా చేస్తాయి.ఆ దారి  లో సింపుల్ గా అలా వెళ్ళిపోతున్నాడంతే.ఇటీవల ఓ రెండు డజన్ ల సినిమాలైనా అతనివి పెద్ద హిట్ ని చవి చూడనివి ఉన్నాయి.వాటి అన్నిటితో పోలిస్తే ఇది కాస్త మెరుగు...హాల్లో కూర్చుని చూడగలం.చెప్పే విధానం లో బిగి ఉండటం,ఓ వ్యక్తి జీవితానికి సంబందించింది గావడం దీనికి ఉపకరించాయి.


హీరో శివ రాజ్ కుమార్ యొక్క పని పై ఏకాగ్రతని,అంకిత భావాన్ని చిన్న చిన్న డైలాగుల్లో చెప్పడం బాగున్నది.మరీ సాగదీయకుండా..!అనువాదం లో గదా ..కన్నడ ఒరిజినల్ లోని కొన్ని సీన్లని కట్ చేసినట్లుగా తోచింది.ఏమైనా ఇది ఒక Docu drama అనుకోఅవాలి.సంగీతం మామూలు గా ఉంది.పశ్చిమ కనుమ ల చాయల్లోని ఆ అడవులు కనుల విందు గా ఉంటాయి.ఎందుకనో ఫోటోగ్రఫీ పనితనం ఇంకా మంచిగా ఉండానికి అవకాశం ఉంది అనిపించింది.యజ్ణా శెట్టి ,పరుల్ యాదవ్ లు పాత్రల్ని చెడగొట్టలేదు.శివ రాజ్ కుమార్ తమ శాఖ లోని కోవర్ట్  ని చంపేటప్పుడు " అబద్దం చెప్పకు..అది నా ఇంటిలిజెన్స్ నే అవమానపరిచినట్లు ఉంటుంది" అంటూ చెప్పే డైలాగు  ప్రసిద్ధ ఆంగ్ల నవల గాడ్ ఫాదర్  లోని మైఖేల్ డైలాగ్ ని యధాతధంగా దించి వేసినట్లుగా ఉన్నది.ఏది  ఏమైనా చాణాళ్ళకి రాం ఖాతా లోకి ఓ మాదిరి హిట్ వచ్చినట్లుగా భావించవచ్చు.

ఇండియా లో కుల ప్రభావం చాలా గొప్ప గా పని చేస్తుంది...అది వీరప్పన్ జీవితం లో కూడా ఉన్నది.ఆ అడవి కి చేరువ  లో ఉన్న గ్రామాల్లో అతని వర్గానికి చెందిన గౌండర్లు ఎక్కువ గా ఉండటం అతనికి బాగా పనికి వచ్చింది.చాలా మంది ఇంఫార్మర్లు గా ఉండేవారు.అధికారులకి సహకరించేవారు కాదు.పెళ్ళిళ్ళకి ,గుళ్ళు నిర్మాణానికి  విరాళాలు ఇస్తూ వారి పాలిట రాబిన్ హుడ్ లా ఉండేవాడు.అందు చేతనే అతని ఆనుపానులు సులభంగా దొరికేవి కావు.ఈ కోణం మిస్ అయింది సినిమా లో.సరే సినిమా అన్నాక ఏవో పరిమితులూ ఉంటాయి గదా ..కనక సరిపెట్టుకోక తప్పదు. Click

No comments:

Post a Comment