చింగీజ్ ఐత్మతోవ్ దే మరియొక నవల "తొలి ఉపాధ్యాయుడు" గురించి....
ఈ సారి చింగిజ్ ఐత్మతోవ్ దే ఇంకొక నవల గురుంచి మాట్లాడుకుందాము.అది తొలి ఉపాధ్యాయుడు.ఎంతో సాదా సీదా గా సాగిపోయే గ్రామీణ జీవితాల్లోని వేదనని ,శోధనని,విజయాన్ని ఇంకా అనేక కోణాల్ని అత్యంత ప్రతిభావంతం గా చిత్రించిన రచన ఇది.విద్యా నేపధ్యం లో ఇంత కరుణ రసం తో కూడుకున్న నవల మరియొకటి లేదు అంటే అతిశయోక్తి ఎంత మాత్రం లేదు.మనకి తెలియకుండానే అలా కుర్కురేవ్ గ్రామ ప్రాంతం లోకి వెళ్ళిపోతాము..ఆ కొండ దిగువనున్న విశాల పీఠభూమి ,కనుమల్లోనుంచి ప్రవహించే సెలయేళ్ళు,నల్లని కొండల వరుసలు,మనుషుల మనసుల్లోని వివిధ భావాల్ని పలికిస్తున్నవా అన్నట్లు రకరకాల ధ్వనులు రకరకాల వేళల్లో చేసే ఆ పోప్లార్ మహావృక్షాల అలికిడులు..చదూతున్నంతసేపు ఒక ధ్యానమ్మ్ లోకి వెళ్ళిపోతాము.
ఒక అనాధ బాలిక,ఒక ఉపాధ్యాయుని నడుమ పెనవేసుకొని మహాలత మాదిరిగా భాసించే అనుభవాల హారమే ఈ సున్నిత మైన నవల.అల్తినాయ్ సులైమానోవ్న అనే తత్వ శాస్త్ర అకడమీషియన్ ఒకావిడ మాస్కో యూనివర్సిటీ నుంచి తమ గ్రామం కి వస్తుంది..వాళ్ళ ఊరి లో కొత్త గా నిర్మించిన ఓ పాఠశాలకి ప్రారంభోత్సవం చేయడానికి..ముఖ్యంగా ఆ ఊరి ప్రజల కోరిక మేరకు..! అయితే ఈ సందర్భంగా ఆమె ఒక్కరోజు కూడా అక్కడ ఉండకుండా వెంటనే వెనక్కి పయనమవుతుంది..అప్పుడు ఆ ఊరిలో ఒకతను అంటాడు..' ఏమండీ..మీ అనుభవం లో ఎన్నో గొప్ప సన్మానాలు అందుకొని ఉండవచ్చును...ఎన్నో సమావేశాల్లో ఫాల్గొని ఉండవచ్చును..కాని మీరు చిన్నప్పుడు చదివిన ఈ పాఠశాల కోసం ఒక్క రొజు ఉండలేరా 'అని అంటాడు.
ఆ తర్వాత ఆమె అక్కడినుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇతనికి ఒక సవివరమైన ఒక లేఖ అందుతుంది. దానిలో తన బాల్యం లోని అనుభవాలు,ఆ గ్రామం లోని పాఠశాల తో తనకి గల అనుబంధం అన్నీ సవివరంగా రాస్తుంది.ఈ నవల మొత్తం కూడా ఆ లేఖ మూలంగా సాగిపోతూంటుంది.ఒక్కసారిగా 1920 ప్రాంతం లోకి వెళ్ళిపోతాము.అది సోవియట్ నిర్మాణం జరుగుతున్న రోజులు.
సంచార జీవితాలు గడిపే కొందరు రైతులు ఆ ప్రాంతం లో ఒక గ్రామాన్ని నిర్మించుకుంటారు.దాని పేరే కుర్కురేవ్.ఇళ్ళు అక్కడక్కడ ఉంటాయి.వీధులేమీ ఉండవు.అలాంటి గ్రామం లో అల్తినాయ్ అనే అనాధ బాలిక ఉంటుంది.పిన తండ్రి వద్ద పెరుగుతూంటుంది.పిన తల్లి రాచి రంపాన పెడుతూంటుంది.ఆ గ్రామం లోకి డ్యూషేన్ అనే నడికారు వ్యక్తి వస్తాడు.తాను కోంసామోల్ సభ్యుడినని ,ఈ గ్రామం లో బడి పెట్టడానికి వచ్చానని చెబుతాడు.గ్రామస్తులు మొదట వ్యతిరేకించినా తర్వాత సరేనని అంటారు.ఇహ అతను అక్కడి పాడైపొయిన గుర్రపు శాలని చెమట ఓడ్చి ఒక చిన్న బడి లా చేస్తాడు.పార,పలుగు,కొడవలి చేతబట్టి పనిచేసే అతని దగ్గరకి పిల్లలంతా వస్తుంటారు.వాళ్ళు అక్కడి బయలు లోని పేడ పిడకలు అవీ ఏరుకోవడానికి వస్తూంటారు. దానిలో ఒక పిల్ల అయిన అల్తినాయ్ కి చదువు అంటే బాగా ఇష్టం.ఈ మేష్టారు కి తాను ఏరుకునే పిడకల్లో చాలా భాగం ఇచ్చి వేస్తుంటుంది..వంట కి దానికి వాడుకోమని.డ్యూషేన్ కూడా ఎంతో ప్రేమ తో తనకి వచ్చిన ఎన్నో కధలు అవీ చెబుతూ వాళ్ళకి రాయడం చదవడం నేర్పుతుంటాడు.అల్తినాయ్ కి బడికి వెళ్ళడం అంటే పండగ లా ఉంటుంది.ఎందుకంటే ఇంట్లో తల్లి దండ్రులు ఉండరు..ఇంకా లాలించే పెద్దలూ ఎవరూ ఉండరు..కాబట్టి ఆ బడి లో ఆ మేష్టారు చెప్పే ఆ పాఠాలు,ఇంకా బయటి ప్రపంచం గురుంచి చెప్పే మాటలు ఆమెని ఎంతో అలరిస్తూంటాయి.ఎప్పుడు తెలవారుతుందా ..ఎప్పుడు బడికి ఉరకాలా అని ఉంటుంది ఆ పిల్లకి..!
డ్యూషేన్ కూడా తాను చెప్పే ప్రతి అంశాన్ని ఎంతో ఘాడంగా,లీనమై చెబుతాడు..టీచర్ కి ఉండే సంప్రదాయ శిక్షణలు ఏమీ అతనికి లేవు.అలాంటివి ఉంటాయని కూడా తనకి తెలియదు.తన లక్ష్యం ఒకటే ఇక్కడున్న పిల్లలకి విద్యా గంధం అంటాలి..!వాళు చేతనైనంత పైకి ఎదగాలి.తాను ఒకప్పుడుసైన్యంలో పని చేసిన ఇంకొకటి చేసినా ఈ మాత్రం చదువు తెలియబట్టే గదా..!అతను చిన్నప్పుడే ఇంటినుంచి పారిపొయి ఎన్నో పనులు జీవిక కోసం చేసి ఇదిగో మళ్ళీ ఈ స్వగ్రామం చేరాడు..తనకి తెలిసిన నాలుగు ముక్కల్ని మళ్ళీ ఇక్కడి పిల్లలకి చెబుదామని వచ్చాడు.
ఒకసారి డ్యూషేన్ లెనిన్ గురుంచి చెప్పడం మొదలు పెట్టాడు ..ఆ పిల్లలంతా తన్మయులై వినసాగారు.అతను చెప్పే విధానం లో ఆ పిల్లలంతా ఎంత మునిగిపోయారంటే ..ఒక పిల్ల అమాయకంగా లేచి..అడిగింది ఎంతో గౌరవం తో..!" మేష్టారండి ..మీరు లెనిన్ గారి తో ఎప్పుడైనా మాట్లాడారాండి" అని..! ఎంతో బాధపడిన వాడిలా చెప్పాడతను" లేదర్రా...నేను మాట్లాడలేదు " అంటూ.
అల్తినాయ్ కి మాత్రం ఆ బడి గోడకి ఉన్న ఒకే ఒక పటం ..ఆ లెనిన్ ది..ఆ వ్యక్తి సాక్షాత్తు మరెవరో కాదు ఈ డ్యూషేన్ మేష్టారే ..!దానికి ఓ కారణం ఉంది..ఆమె పిన తల్లి బడి మాంపించాలనే ఉద్దేశ్యం తో ఈమెని పని లో పెట్టింది.బడి మొహం చూడరాదని శాసించింది.ఓ రోజు మేష్టారే వీళ్ళ ఇంటికొచ్చి ఆ అమ్మాయిని బడికి పంపించమని కోరగా ఆమె బండ బూతులు తిడుతుంది.చివరకి పిన తండ్రి కల్పించుకొని వెళ్ళడానికి అనుమతిస్తాడు. (మిగతాది తరువాయి భాగం లో చూద్దాము)

ముందుగా మంచి వేరే భాషల్లోని మంచి నవలలను పరిచయం చేస్తున్నందుకు ధన్యవాదాలు. ఈ నవల కూడా ఆసక్తిగా ఉంది. ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుందో కూడా చెప్పండి.
ReplyDeleteకృతజ్ఞతలు. విశాలాంధ్ర,నవ చేతన అనీ బ్రాంచీ లలో ఈ పుస్తకం లభ్యం.
ReplyDelete