కిర్గిజ్ స్తాన్.. ఒక రచయిత వల్ల ఆ ప్రాంతం కి,ఆ సంస్కృతికి కలిగిన మర్యాద ఇంకా గుర్తింపు
కిర్గిజ్ స్తాన్.. ఒక రచయిత వల్ల ఆ ప్రాంతం కి,ఆ సంస్కృతికి కలిగిన మర్యాద ఇంకా గుర్తింపు అది అలా కొనసాగుతూనే ఉన్నది.ఈపాటికి అది ఎవరో కాదు చింగీజ్ ఐత్మతోవ్ అని గుర్తించి ఉంటారు.చంగీజ్ ఖాన్ మీద గల అనురక్తి తోనే ఆయన తల్లి దండ్రులు ఆయనకి ఆ పేరు పెట్టడం జరిగింది.తల్లి కిర్గీజ్ తెగ కి తండ్రి తార్తార్ తెగ కి చెందిన వారు.ఈ రెండు తెగల యొక్క ఉత్తమ లక్షణాలు చింగీజ్ ద్వారా పురి విప్పుకున్నవని చెప్పవచ్చు.
ఆయన రచనల్లో కనిపించే కుర్కురేవ్ గ్రామం,ఆ వొడ్డునే ప్రవహించే నది,పర్వతమయమైన ప్రాంతాలు,స్టెప్పీలు,అక్కడి ఆచారాలు ,జానపద గాధలు ,సంచార జీవనం లోని ఒడిదుడుకులు ఇలా అవన్నీ స్వయంగా ఆయన పుట్టి పెరిగిన ప్రాంతానికి చెందినవే..తొలి ఉపాధ్యాయుడు ,జమీల్య లో కనిపించే ఆ కుర్కురేవ్ లోనే ఆయన తండ్రి జన్మించింది.1928 లో సేకార్ అనే కిర్గీజ్ గ్రామం లో చింగిజ్ జన్మించినా చిన్నతనం నుంచి సంచార తెగ ఆనవాయితీ ప్రకారం అనేక ఊళ్ళు పట్టుకు తిరిగాడు కుటుంబం తో..!
ఆయన తన తొమ్మిదవ యేటనే అతని తండ్రి ఉరి తీయబడ్డాడు.కిర్గిజ్ తెగ లోని వారికి స్వ ప్రాంతం పై ఆపేక్ష చింగీజ్ నవలల్లో అంతటా కనిప్స్తుంది.ప్రతి చిన్న పాటని,అక్కడ పెరిగే ప్రతి మొక్కని అతను ఎరుగును అనిచెప్పవచ్చు.అంతే కాదు జంతువుల పట్ల మమకారం కూడా..అలాగే కనిపిస్తుంది.ఒక గుర్రం,ఒక మనిషి మాత్రమే పాత్రలు గా పెట్టి ఆయన ఒక నవల రాశాడు.
తొలి ఉపాధ్యాయుడు లో ఒక సన్నివేశం ఉంటుంది.ఒక రాత్రి ..మంచు వర్షం పడుతున్న చీకటి లో అడవి దారి గుండా డ్యూషేన్ ..ఓ గుర్రం మీద వస్తుండగా .. రాత్రి లో ఉన్నట్టుండి తోడేళ్ళు గుంపు అతని వెంబడించి గుర్రాన్ని చంపడమూ..ఆ శబ్దాల్ని ..ఇంట్లో పడుకున్న చిన్న పిల్ల వింటూ ..భయం తో మునగదీసుకొని పడుకొని ఏడుస్తూండటం... అంతలోనే డ్యూషేన్ తప్పించుకొని గుడిసె లోకి వచ్చి రైఫిల్ ఉంటే ఇమ్మని అడగడమూ...ఆ దృశ్యం నిజంగా అద్భుతంగా కళ్ళకి కట్టినట్లు రాస్తాడు.అలాంటి కఠినమైన జీవన ధార నుంచి వచ్చిన మనిషి మాత్రమే అంత చక్కగా రాయగలడు.
చింగీజ్ యొక్క రచన లో ఒక కవితాత్మ అంతర్లీనంగా కనిపిస్తుంది.అయితే అది వాస్తవానికి చాలా సమీపంగా ఉంటుంది.స్వతహాగా కమ్యునిష్ట్ అయినప్పటికి సోవియట్ లోని కొన్ని చేదు నిజాల్ని వెల్లడించడం లో వెనుకడుగు వేయలేదు.The Scuffold (1988) లో డ్రగ్ ప్రేరిత నేర ప్రపంచాన్ని ఆవిష్కరించాడు.The first teacher,Farewell Gulsary,The white ship,The dreams of a she-wolf ఇలా ఎన్ని నవలలు ,ఇంకా అనేక కధలు రాసినా Jamila తోనే ఆయనకి విశ్వ ఖ్యాతి వచ్చింది.ప్రపంచం లోని ప్రేమ కధల్లో అత్యుత్తమమైనది అని ప్రశంసలు పొందింది.సినిమాలు గా కూడా ఆయన రచనలు రూపు దాల్చాయి.
కిర్గిజ్ భాషలోను, రష్యన్ లోను సమానమైన ప్రతిభ తో రాయగలిగేవాడు.మొదట్లో కిర్గిజ్ లో రాసినా ఆ తర్వాత రష్యన్ భాషలో రాయడం మొదలు పెట్టాడు.సైన్స్,తాత్విక ధోరణుల తో కూడిన The day lasts more than a hundred years ని ఆయనే సినిమా గా రూపొందించాడు.టర్కీ ప్రభుత్వం తమ భాషనుంచి చింగీజ్ ఐత్మతోవ్ ని నోబెల్ బహుమతికి సిఫారసు చేసింది.యూరోపియన్ యూనియన్ కి,యునెస్కో కి,నెదెర్లాండ్స్ కి,బెల్జియం కి కిర్గిజ్ స్తాన్ తరపున రాయబారిగా పనిచేశాడు.గ్రామ కార్యదర్శికి సహాయకునిగా,గోధుమ క్షేత్రం లో రైతుగా, పశువుల ఆసుపత్రి లో ఉద్యోగి గా,పశువుల కాపరి గా ,ప్రావ్దా పత్రిక కి విలేకరి గా ఇలా ఎన్నో పనుల్ని తన జీవిక కోసం చేసిన ఆయన వాటన్నిటి ద్వారా ఆయా జీవిత అనుభవాలు పొంది పరి పూర్ణ రచయిత గా ఆవిర్భవించి ప్రపంచం లోని ఎన్నో హృదయాల్ని ఇప్పటికి అలరిస్తూనేఉన్నాడు.జర్మనీ లో చనిపోయినప్పటికి అతని అంతిమ కోరిక మేరకు కిర్గిజ్జ్ స్తాన్ లోని స్వంత గ్రామం లో ఆయన తండ్రి సమాధి పక్కనే ఖననం చేశారు.పరవస్తు పరమేశ్వర్ గారు తన సిల్క్ రూట్ యాత్ర పుస్తకం లో ఈ సమాధుల్ని దర్శించుకున్నట్లు రాశారు. ఆయన రచన ల్లో కనిపించే ఆ పోప్లార్ చెట్లు ఆ చుట్టు పక్కల మొత్తం ఉన్నట్లు రాశారు.Click here

No comments:
Post a Comment