"ఓషో" గురుంచి ఎప్పటినుంచో రాయాలని ఉన్నా రకరకాల కారణాల వల్ల పడింది కాదు.కాని ఈరోజు రాయక తప్పదు అనుకున్నా ..అందుకే ఇది.జగ్గీ వాసుదేవ్ ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్,మొన్నటి దాకా సుఖబోధానంద అనే ఆయన బాగా కనిపిస్తూ వినిపించేవాడు..మీడియా లో గాని..కార్పోరేట్ మనుషుల మధ్య గాని..ఇంకా ఉన్నారిలా కొందరు. భారతీయ ప్రాచీన గ్రంధాల్ని బాగా ఆకళింపు చేసుకోవడమే గాక,ఇతర మత గ్రంధాల్ని ఇంకా పాశ్చత్యుల తత్వ శాస్త్రాల్ని చదివి అర్ధం చేసుకొని తమదైన పద్ధతి లో చక్కటి ఇంగ్లీష్ లో చెబుతూంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలు ,సినిమా దిగ్గజాలు ,విదేశీ భక్తులు చిన్నపిల్లల్లా వింటూ ఉండటం ఇదంతా గమ్మత్తు గా అనిపిస్తుంది.వినేవాళ్ళు మరీ వెర్రి వాళ్ళు ఏమీ కాదు..అనేక దారుల్లో పిండి కొట్టుకొని పైకి వచ్చిన వాళ్ళే.
అయితే ఈ ట్రెండ్ మొత్తం ఇప్పుడు ఇలా నడుస్తుందంటే ..ఒకప్పటి "ఓషొ" అనే గురువు కారణం అని చెప్పవచ్చు.మక్కీ కి మక్కీ కాదు గాని చాలా భావ ధార అతని నుంచే వచ్చిందే..ఆ ప్రభావం బాగా కనిపిస్తుంది.ఇప్పటి కార్పోరేట్ గురువుల్లో..!ఓషో అనగానే ఒక్కమాట తో ఓ అతను సెక్స్ గురువు గదూ అని ఒక్కమాట తో తీసిపారవేస్తారు.నిజమే సెక్స్ లోని తాత్వికత ని అది ప్రకృతి లో ఉండవలసిన అవసరాన్ని,దాని పరిమితిని ,దాని బోలు తనాన్ని గొప్పతనాన్ని చాలా లోతు గా వెళ్ళి చెప్పాడు.నాకు తెలిసి భూమి మీద ఉన్న అన్ని రకాల మంత్ర,తంత్ర,యోగ పద్దతుల్ని అంత గొప్పగా అంత చిన్న చిన్న మాటల్లో కిందికి దిగి వచ్చి చెప్పి న వాడు ఇంకొకరు లేరు.
మీరు ఓషో ని ఇంగ్లీష్ లో చదవండి.చాలా సింపుల్ భాష అది.డిస్కొర్సెస్ రూపం లో చెప్పినవే చాలా మటుకు.Master is a mirror,The Ultimate Vedanta, The grass grows on its own,From sex to superconsciousness ఇట్లా కొన్ని పుస్తకాలు చదివాను.ఇంకా Tantra మీద, సూఫీ గురువుల మీద,అనేక మంది ప్రాచీన గురువుల మీద ,శాస్త్రాల మీద ఆయన మాట్లాడిన వాటిని అన్నిటిని గ్రంధస్తం చేశారు.ఇప్పుడు రెబల్ ట్రెండ్ సెట్టార్స్ గా పిలువబడుతున్న వాళ్ళంతా ఓషో ని బాగా అధ్యయనం చేసిన వాళ్ళే.కాని ఎందుకనో వాళ్ళు బయటకి చెప్పరు.
ఓషో మనకి ఏమో కాని WESTERN PEOPLE కి ధ్యాన పద్ధతులు,భారతీయ తీరులు నేర్పడానికి పుట్టినట్లు అనిపిస్తుంది.ప్రపంచం లో ప్రాంతాల్ని అనుసరించి రకరకాల తీరులు ..ఎవరికి తగ్గ గురువులు వారికి అవసరం .మన ఇప్పటి రాం గోపాల వర్మ లాగేనే ఏది అనుకుంటే అది బయటకి అనేసే వాడు..దాని వల్ల అతనికి శత్రువులు కూడా బాగానే ఉండేవారు.ఒక్కోసారి బ్రాహ్మల్ని బాగా తిట్టేవాడు..బొజ్జలు పెంచడం తప్ప వీళ్ళకి ఆధ్యాత్మిత అనేది తెలియదు.నరకం అంటూ ఉంటే అక్కడకి మొదట వెళ్ళే వాళ్ళు వీళ్ళే.దేవుడి గురుంచి అణుమాత్రం తెలియని వీళ్ళు మళ్ళీ ఇంకొకరికి మార్గదర్శనం చేయడం మరీ ఘోరం..అది పాపం కూడా అని ఈసడించేవాడు.మళ్ళీ కొన్నిసార్లు నా ఉద్దేశ్యం అది కాదు ..అని చెప్పేవాడు.
కంచి శంకరాచార్యులు ను కూడా వదల్లేదు.ఏ బ్రహ్మ జ్ఞానం పొందిన మనిషికైనా ఆ కాంతి అతని మొహం లో ,కళ్ళలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.కాని చూడండి..పీఠాదిపత్యం వహించిన ఏ శంకరాచార్యుల లోను అలాంటి తేజస్సు నాకైతే కనబడలేదు.వీరంతా మామూలు ఉద్యోగస్తుల వంటి వారే అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
నన్ను ప్రేమించే వాళ్ళు,నన్ను ద్వేషించే వాళ్ళు ఇద్దరూ నాకు ఒకటే,ఎందుకంటే ఏదోరకంగా వాళ్ళు ఇరువురు నాతో సంబంధం కలిగిఉన్నారు.ప్రేమ ద్వేషంగాను ,ద్వేషం ప్రేమ గాను మారడానికి పెద్ద కారణాలు ఏమీ అవసరం లేదు అనేవాడు.తాను జీసస్ కంటే కూడ గొప్పవాడినని ఆయన తన జీవిత కాలం లో ఆరమిక్ మాట్లాడే ప్రాంతానికి పరిమితం కాగా తాను ప్రపంచమంతా తన సందేశాన్ని వినిపించానని చెప్పుకునేవాడు.తనని పోలిస్తే గీలిస్తే ఒక్క బుద్దుడు తో మాత్రం పోల్చమని కోరేవాడు.
మరొక అనుయాయుడు " నేను ప్రేమించిన ప్రతి స్త్రీ వల్లా మనహ్ శాంతి ని కోల్పోయాను.అసలు ఈ స్త్రీల మనస్సు ఏమిటో అంతు పట్టడం లేదు" అని అడిగినప్పుడు...ఓషో ఇలా అంటాడు" నువ్వు ఒక బొమ్మని తయారు చేసుకొని మళ్ళీ ఇది ఇలా ఉందేమిటి అని అడుగుతున్నట్లుగా ఉంది.అనేక వందల వేల ఏళ్ళుగా స్త్రీ యొక్క ప్రవర్తనని ,ఆదర్శాన్ని ,జీవన విధానాన్ని మత గ్రంధాల ద్వారా ,సమాజపు సూత్రాల ద్వారా ఆ విధంగా తయారు చేసింది పురుషుడే.నువ్వు స్త్రీ కి స్వాతంత్ర్యం ఇచ్చినపుడు ఆమె నీకు స్వాతంత్ర్యం ఇస్తుంది.
ఒకచోట ఓ జర్మన్ భక్తుడు అడిగిన దానికి సమాధానమిస్తూ ఫ్రాయిడ్ ,కారల్ జంగ్ లాంటి వాళ్ళు కూడా ఊహించలేని మానసిక ప్రపంచపు అంచులకు భారతీయ రుషులు వెళ్ళగలిగారని చెబుతాడు.సెక్స్ గురుంచి మనిషి ఏదో ఒక దశ లో తెలుసుకొనే తీరాలి ..మరి అలాంటప్పుడు దాన్ని ఒక పాప కార్యంగా ఎందుకని అనుకోవాలి.మనిషి జీవితం లో కళ్ళు తెరిచి చూస్తే అంతా సెలెబ్రేషనే..కాకపోతే ఫాలానా ఏదో పూర్వ గ్రంధం లో అలా ఉందని దాన్ని ఫాలో అవుతుంటాము.అసలు ఏ మత గ్రంధాని కైనా ఎందుకు అంత విలువ నివ్వాలి..అంటే అవి కేవలం పురాతనమైనవనేనా..?వాటిల్లో కొన్ని గొప్ప విషయాలు ఉన్నట్లే కొన్ని చెత్త సంగతులూన్నాయి.
నిర్వాణం పొందడానికి మీ మార్గమే శరణ్యమా అన్నప్పుడు..ప్రతి మనిషికి తన భావప్రపంచానికి తగిన గురువు దొరుకుతాడు.అది ఒక సీక్రెట్ ఏర్పాటు.నువ్వు ఎవరినైనా అనుసరించు..కాని పూర్ణ హృదయం తో చెయ్యి ఆ పనిని..అది కావలసింది..!అని ఓషో జవాబు.
ఓషో లో ఒక శక్తి మాత్రం వుంది.1993 లో ఒకసారి నేను ఆయన మరణాంతరం పూనా లోని ఆశ్రమానికి వెళ్ళాను.ఆయన పాలరాతి సమాధి..ఓ కృత్రిమ జలాశయం..దానిలో తిరుగాడే తెల్లని హంసల వంటి పక్షులు..పెద్ద ధ్యానమందిరం ..ఆడ,మగా శ్వేత జాతీయులు ..అదొక ప్రపంచం.అక్కడ కొన్ని పుస్తకాలు కేసెట్లు కొన్నాను.వచ్చిన తర్వాత ఆయన రచనలు బాగా చదవాలనిపించి చాలా తెప్పించుకొని చదివాను.అప్పటికి ఇంకా ఆయన తెలుగు అనువాదాలు రాలేదు.ఆ చెప్పే విధానం జివ్వున లాగుతుంది.మనసు లోతుల్లో అలజడి రేపుతుంది.భారతీయుల్లోని గొప్ప లాజిక్ అంతా అతనిలో మూర్తీభవించినట్లు అనిపించింది.సాహిత్యం,కళలు,సైన్సులు,గణితం,ఒక్కటేమిటి ఏ కోణం లో అంటే ఆ కోణం లో వచ్చి మనల్ని పిండి వేస్తాడు.దాసోహమనవలసిందే.
నిశ్శంశయంగా అతను ఒక గొప్ప మాస్టర్.అది తిరుగు లేని సత్యం.అతని ఆరా లోకి అలా వెళ్ళిపోతాము..ఆయన పుస్తకాలు చదువుతుంటే.అనేక గుప్త సాధనల వల్ల శక్తులు సాధించినాడండం లో అతిశయోక్తి లేదు.నా అనుభవం లో నూ ..నేను చూసిన మిత్రుల జీవితాల్లోనూ ..నేను చూశాను..ఒకటి..ముందుగా అతను వైవాహిక బంధాన్ని విచ్చిన్నం చేస్తాడు...!ప్రతి మాస్టర్ కి ఒక తనదైన బోధనా రీతి ఉంటుంది. అతని ఆరా ఉన్నది.సరే ..ఆయన పద్ధతి ఆయనది.ఇవన్నీ ఒకప్పుడు నేను నమ్మేవాడిని కాను,అసలు నేను నాస్తికుని గా కొన్ని ఏళ్ళు ఉండి ..ఆ తర్వాత ఎన్నో పరిణామాలు జరిగి ..ఇప్పటి ఈ స్తితి కి వచ్చాను.యోగమార్గం లో ముందుకుపోతున్న కొద్దీ ఎన్నో చెప్పలేని అనుభవాలు.చెప్పినా నమ్మని విష్యాలవి.నా అనుభవాల్ని నేను కొట్టివేయలేను గదా.

అంతే మరి. ఎవరో చెప్పారని కాదు. మనం అనుభవించి తెలుసుకొన్నదే సత్యం. ఈ విషయం మనిషి తెలుసుకుంటే ఎవరో కనుగొన్న సత్యం పట్ల వాదులాడుకుని కాలం వృధా చేసుకోరు. వారు వాదించుకునేది కేవలం నమ్మకాల ఆధారంగానే.
ReplyDelete
ReplyDeleteఓషో :) ఉష్ :) మరీ ఇంత ఓపెన్ నెస్సా :)
నిజమే సెక్స్ లోని తాత్వికత ని అది ప్రకృతి లో ఉండవలసిన అవసరాన్ని,దాని పరిమితిని ,దాని బోలు తనాన్ని గొప్పతనాన్ని చాలా లోతు గా వెళ్ళి చెప్పాడు.
చీర్స్
జిలేబి
చాలా బాగా రాసారు Sir..ధన్యవాదాలు..Bhaskar
ReplyDeletesir it is common trend if you criticize hindu dharma or guru you will get name and fame.Osho or Subhash patri they are not different from this category. Osho even criticized Adi Sankara and compared him with a Donkey carrying knowledge. This is level of Osho who encouraged and involved in Group Sex also.
ReplyDeleteOne can write many books like Osho, but can not get real peace and knowledge like sri guru ramana or rama krishna who attained and realized the god.
Comparisons have very little value in spiritual matters.Different people have different bags.Sri Rama Krishna and Ramana Maharshi had chosen different paths.Osho predominantly concentrated on Tantra to attract unreached people of different countries.
ReplyDeleteI used to think that how many people are there who read osho, who interpret him other than sex guru, who think people who read osho are promoting infedility and cultureless specially when it comes to a woman, who I can really talk about his words which makes a lot lot sense among other senseless things we grew up. Good to see one among few people I came across who talks about him.
ReplyDelete