Saturday, January 16, 2016

గూర్ఖా ల స్వరం Prajwal Parajuly..!

!

మన కి గూర్ఖా వారి తో నిత్య జీవితం లో పరిచయం ఉండవచ్చునేమో గాని వారి జీవనం గురించి గాని వాటి లోని సుఖ సంతోషాలు,బాధామయ గాధలు ఇలాంటి వాటి తో మిగతా సమాజాల వారికి అవగాహన తక్కువే.నేపాల్ నుంచి వచ్చి ఇటు డార్జిలింగ్ లో అయితేనేమి ఇంకా ఇతర ఈశాన్య రాష్ట్రాల లో అయితే నేమి చెప్పుకోదగిన సంఖ్య లో ఉన్నారు.ఇతర పట్టణాల లో సైతం సెక్యూరిటీ పరమైన ఉపాధి లో జీవితాన్ని అలా లాగిస్తుంటారు.వీరిల్లో 98 శాతం వరకు హిందువులు కాగా మిగతా వారు బౌద్ధులు,ఇతరులు ఉన్నారు.


అలాంటి చెల్లా చెదరైన ఆ గూర్ఖా జాతి ప్రజల గుండె చప్పుళ్ళను  The Gurkha's daughter అనే కధా సంపుటి ద్వారా ఇప్పుడు Prajwal Parajuly ప్రపంచ వ్యాప్తం గా వినిపిస్తున్నారు.32 ఏళ్ళ చిన్న వయసు లోనే గొప్ప ప్రాచుర్యం కలిగిన రచయితల లిస్ట్ లో చేరిపోయారు ఆయన.సిక్కిం లోని గాంగ్టక్లోని ఓ నేపాలీ బ్రాహ్మణ కుటుంబం  నుంచి వచ్చిన ఈయన తమ గూర్ఖా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు,దేశ విదేశాల్లో వారి గాధలు పుస్తక రూపం లోకి అదీ కధల రూపం లోకి తెచ్చి ఖండాంత ఖ్యాతి గడించారు.The Asian Review,The Guardian,Calcutta Telegraph  వంటి పత్రికలు Promising debut గా అభివర్ణించాయి.హిందుస్తాన్ టైంస్ The best story collection గా కొనియాడింది.ప్రఖ్యాత  Dylan Thomas prize కోసం షార్ట్ లిస్ట్ చేయబడిన ఏడింటిలో ఒకటిగా నిలిచింది.

తమ పట్టణం లోని Tashi Namgyal school తాను సాహిత్యం పై అభిరుచి పెంచుకోవడానికి కారణమైందని తెలిపారు.ఆక్స్ ఫర్డ్ లో చదువు పూర్తి అయిన  తర్వాత ఒక ప్రయివేట్ కంపెనీ లో యాడ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేశారు.ప్రముఖ ప్రచురణ సంస్థలు అతని తో రెండు పుస్తకాలకు ఒప్పందం కుదుర్చుకున్నాయి.ఒక విధంగా తాను అదృష్టవంతుడినని ప్రాచుర్యం,ఆర్దిక విజయం చేకూరడం  అది నలభై దాటని వయసులో ..అంటూ చెప్పుకొచ్చారు.The land where I flee అనేది ఈయన మరి యొక నవల.దీనికి సైతం మంచి ఆదరణ లభించింది.గూర్ఖా లేండ్ లోని గూర్ఖా లవే గాక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈ నేపాలీ వారి హృదయ స్పందనల్ని వినడానికి ఈయన రచనలు చదవండి.అమెజాన్ లో లభ్యమవుతున్నాయి.   

1 comment: