Sunday, February 21, 2016

అట్లా కొన్ని రోజులు బెంగాల్ రాష్ట్రం లో తిరిగి వచ్చేశాను

(గత భాగానికి కొనసాగింపు)

అట్లా కొన్ని రోజులు బెంగాల్ రాష్ట్రం లో తిరిగి వచ్చేశాను.ఎందుకో తెలియదు గాని మిత్రులతోనో,మంది మార్బలం తోనో అలా తిరగడం నాకు అంత సౌకర్యం గా అనిపించదు.మనం ఒక చోటికి వెళదాం అంటే అతని మనసు వేరే చోటికి వెళ్ళవచ్చు..మనం ఒంటరిగా తిరగడమే మేలు.అన్నిటికీ మనం ఒక్కళ్ళమే బాధ్యులం అవుతాము..దేనికైనా. అప్పుడు ప్రపంచం కనిపించే విధానమే వేరు గా ఉంటుంది. మంది గా వెళ్ళినప్పుడు ఊబుసుపోని కబుర్లతోనూ..రకరకాల అభిప్రాయాలు పంచుకోవడం లోనూ,ఇతర ధ్యాసల తోనూ కాలం గడిచిపోతుంది.

స్వేచ్చ లో ఉండే బాధ్యత ఏమిటో అర్ధం అవుతుంది.కొత్త ప్రదేశాల్లో కొత్త వ్యక్తులతో ఎలా మెలగాలో తెలుస్తుంది.శరీరాన్ని అలా అన్ని భద్రతలకి Vulnerable గా ఉంచడం లోని అంతరార్ధం బోధపడుతుంది.నాకు గనక అవకాశం ఇస్తే ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ స్థాయి విద్యార్తులకి  ఇలా ఒక రాష్ట్రాన్ని ఒంటరిగా చుట్టి వచ్చి వారి అనుభవాల్ని వ్యాసం గా రాసే ఓ ప్రాక్టికల్ ప్రశ్న ని చేరుస్తాను.అది వంద డిగ్రీ ల తో సమానం.మనం చదువు పేరు తో చేసే దాంట్లో బయట కి వస్తే ఉపయోగపడేది చాలా తక్కువ.

సరే....ఆ తర్వాత ...కొన్ని అనుభవాల  పిమ్మట....ప్రాణాయామం చేయడం  మొదలుపెట్టాను. పతంజలి మహర్షి చెప్పిన దానికి ఇప్పటికీ దానిలో చాలా మార్పులు వచ్చాయి.అసలు కొన్ని ఎంత పాతవైతే అంత సారం ఉంటుంది.అప్పటికే దాని యొక్క శాస్త్రీయ కోణాన్ని వివేకానందుని "రాజ యోగ" లో చదివి ఉన్నాను.ఇంకా కొన్ని బేలూరు లోని  కొందరి మహాత్ముల వద్దనుంచి గ్రహించాను.ఏదైనా ఒక విషయాన్ని మనం పరీక్షించకుండా నే అది చెడ్డదని,లేదా మంచిదని ఒక్క మాట లో తీర్పు ఇచ్చివేస్తుంటాము.అన్ని విషయాల్లో అది తగదు.అలాంటిదే ప్రాణాయామం. భారతీయులు కనిపెట్టిన గొప్ప విషయం ఏదైనా ఉందీ అన్నా,ఈనాటికీ ప్రపంచం విలువ ఇస్తున్నదీ అన్నా ఇలాంటి ప్రాచీన విషయాలకే.అయితే అవి నిత్య నూతనమైనవి.కాల పరీక్షకి తట్టుకుని నిలబడినవి..అందుచేతనే.

అసలు మత ప్రస్తావనే లేని విష్యాలవి..మతం అనే CRUDE  భావాన్ని మనలో ప్రవేశపెట్టినవి అన్నీ ఇతర ప్రాంతాలనుంచి వచ్చిన జాతులే.అసలు ఆ స్పృహ నే లేదు మనలో. ఒకానొక సమయం లో ప్రపంచం లో అన్ని మతాలు టార్గెట్ చేసిన యూదుల్ని కూడా హాయిగా ఆదరించాము.అదో పెద్ద టాపిక్..మరెప్పుడైనా చూద్దాము.

అలా గడుస్తుండగా ..నాకు తోచింది ఏమంటే ..ప్రాణాయామం లో దాని ఇతర సాధనల్లోనూ ఒక సారం ఉంది.చదవడం వేరు.స్వయంగా అనుభవించడం వేరు. నాకెందుకో అనిపించింది..మన పూర్వికులు కూడా అన్ని విషయాల్ని గ్రంధస్తం చేయలేదు.కొన్ని గురు ముఖతహ్ రావాలనే వదిలివేశారు.అవి చెప్పినా పిల్లాటల్లా ఉంటాయి.అందుకే గురువుకి అంత ప్రాధాన్యం ఇచ్చారు.

ముందు జరగబోఏ కొన్ని సంగతులు సింబాలిక్ కనిపిస్తుంటాయి.ముందు ఒకటి రెండు రోజులు అది మామూలే లే అని వదిలి వేస్తాము.పురోగమిస్తున్న కొద్దీ ఆ శక్తి ఇంకా ముందుకు వెళుతుంది.మెదడు లో చురుకుదనం పెరుగుతుంది.ప్రతి విషయం త్వరగా అర్ధమవడం మొదలవుతుంది.నిజానికి నేను ఇంగ్లీష్ లో ,కాలేజీ లో ఉన్నప్పుడు ఒక మాదిరి వాణ్ణి.అంతే.ఎన్ని పేజీలు చదివినా తెలుగు లాగే వెంటనే అర్ధమవడం మొదలుపెట్టేది.నన్ను కలవబోయే వ్యక్తులు లీలగా ఓ తెర అడ్డు ఉన్నట్లుగా కనిపించేవారు.అప్పటికే నేను ఫ్రాయిడ్ ని ఇంకా ఇతర విజ్ఞానుల రచనలు చదివి ఉన్నాను.అవి కూడా నాకు సమాధానమివ్వలేదు.

మరి దైవ కృప నో ఏమో గాని కొంత మంది మహాత్ముల పరిచయ భాగ్యం తో నా సందేహాలు అన్నీ పటా పంచలు అయినవి.ఇవన్నీ ఎందుకు రాస్తున్నానంటే..కొన్ని ప్రపంచంలో తెలియాలని.ఎవరు ఏదైనా అనుకోనీ ఎవరి అంభవాలు వారివి..అవి ఏ కొద్ది మందికో ఏ రకంగా నో ఉపకరించవచ్చునేమో..లేదా ఈ అనంత కాల గమనం లో అలా కొట్టుకొని పోతాయి.

..ఇంకొకటి...నన్ను బాధించేది ఏమంటే ..మన దేశం లో కొన్ని రాజకీయ శక్తులు "వివేకానందుని" సొంతం చేసుకోవడం వల్ల ఆయనకి తీవ్రమైన అన్యాయం జరిగింది.పైపైన చదివే వారు కేవలం ఆయన భావ జాలాన్ని ఒక పార్టి కి చెందినదిగా అర్ధం చేసుకుంటున్నారు. అది తాపనీయమైన విషయం.మన దేశం లోని సకల వ్యవస్థల గురుంచి ఈ గడుస్తున్న జనరేషన్ కూడా ఊహించలేని స్థాయిలో ఆయన మాట్లాడారు.కేవలం మాటలు చెప్పి ఊరుకోలేదు..చేతల్లో చేసేలా చేశారు.ఎంతటి పరి తాపం...ఒక మారు ఆశ్రమం లో సంతాల్ జాతికి చెందిన వారు బావి తవ్వుతుండగా ..వారితో కలిసిపోయి స్వామి గునపం తీసుకొని తవ్వడం ప్రారంభించారు.స్వామీ ..మిగతా స్వాములు చూస్తే మమ్మల్ని తిడతారు..మీరు అలా వెళ్ళి కూర్చొండి అని అంటారు.ఆ తర్వాత వచ్చిన అథితులతో అంటారు ..మనం మన దేశం లోని పేద ప్రజల్ని ఉద్ధరించడం చాలా సులువు..విదేశాల్లో ని పేదప్రజలు నిజంగా పిశాచాల్లాంటి వారే.అగ్రవర్ణాలపై నిజంగా వీరే తిరుగుబాటు చేసినట్లయితే ఏ మాత్రము నిలువరించలేరు..ఎందుకంటే తరతరాల శ్రమ వల్ల వారి శరీరాలు,మనసులు బలంగా తయారయినాయి అంటారు.

ఒకసారి మహ్మద్ ప్రవక్త ప్రస్తావన వచ్చినపుడు ప్రవక్త యే అక్కడ జన్మించి ఉండకపొఇనట్లయితే అక్కడి వివిధ తెగలు అన్నీ అంతర్యుధాల్లో రూపు మాసి పోయి ఉండేవి అంటారు..రాజస్థాన్ లో ఖేత్రి మహారాజు ని సందర్షించినపుడు  ఆస్థానం లోని ఒక ముస్లిం మత పండితుడు తమ ఇంటికి భోజనానికి ఆహ్వానించి ఏ కాయగూరలు తో వండాలని అడిగినపుడు మీరు ప్రతి రోజు ఏ విధమైన ఆహారం తీసుకుంటారో అదే నాకు పెట్టండి..అదే నాకు ప్రీతికరం  అంటారు. ప్రపంచం లో సమానత్వం ని పాటించే మతం ఏదైనా ఉందీ అంటే అది ఒక్క ఇస్లాం మాత్రమే..ఒక వ్యక్తి యోగ్యుడే గనక అయితే అతను నీగ్రో అయినా సరే టర్కీ మహారాజు లాంటివాడు సైతం  తన కుమార్తె ని ఇచ్చి పెళ్ళి చేస్తాడు అని అభిప్రాయపడ్డారు.

ఒక మతాన్ని స్థాపించి వృద్ది చేయవచ్చు గదా..మీలో శక్తి ఉన్నది గదా అన్నప్పుడు..ఇప్పటికి ఉన్న మతాలు చాలు.ఇంకా గందరగోళం ఎందుకు..మన దేశం లో మాటలు ,ప్రణాళికలు గొప్ప గా చేస్తాము.చేయడానికి మాత్రం చేతులు రావు.మీరు నా అనుయాయులు గా ఉండాలంటే మాటలు మాత్రమే కాక పనిని చేయడం ప్రారంభించండి.Work..work..work ఏమి జరిగిందో..ఎవరు పోయారో తర్వాత చూసుకోవచ్చు..ముందు కార్యం లోనికి దిగు.నీవు మరణిస్తే నీ పనిని మరి ఒకరు అందుకుంటారు.వందల ఏళ్ళు గా కార్యోత్సాహం లేక నీరస జాతి గా మిగిలిపోయాము.ప్రపంచం లోకి వెళ్ళు...తిరుగు..ఎలాంటి శక్తి తో మానవ జీవితం పరిగెడుతుందో తెలుస్తుంది.ఎంతసేపు మన కులం చూసుకుని గర్వించడం లోనే మన దేశీయుల జీవితాలు సరిపోతున్నాయి...ప్రస్తుతం తమస్సు లో ఉన్నది దేశం..దాన్ని సత్వ గుణం గా భ్రమిస్తున్నాము..

పది మంది తో కలసి పని చేసే విధానాన్ని ఈ అమెరికన్ ల దగ్గరనుంచి నేర్చుకొండి.ఎవరికి వారిమే గొప్ప గా భావించుకుంటూ తలపెట్టిన పనిని మధ్యలో వదిలివేయడం ఒక అలవాటుగా మారింది.ఒక కార్యం సాధింపబడటానికి ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ఆ పనిని తుదముట్టించే విధానాన్ని అలవాటు చేసుకొండి.పని యొక్క రహస్యాన్ని ఈ పాశ్చత్యులు  కనిపెట్టారు.లౌకిక పరమైన విషయాల్ని వారినుంచి శ్రద్ధగా నేర్చుకొండి.అదే సమయం లో మీలోని విలువైన విషయాల్ని మీరు గుర్తుంచుకొండి..వీలైతే వాటిని వారికి పంచండి..ఇచ్చి పుచ్చుకోవడమే ఈ ప్రపంచం.మన యువతరాన్ని కొంచెం భోగ ప్రపంచాన్ని కూడ చవి చూడనివ్వండి..ఆ తర్వాతనే వాటి ని త్యాగం చేయడం లోని గొప్పతనం అర్ధమవుతుంది ..ఇట్లా ..ఎన్ని ఎన్ని విషయాల్ని ఎలుగెత్తి చాటారు.ఇవి ఏమీ మన సిలబస్ ల్లో కనబడవు.వివేకానందుని అర్ధం చేసుకున్నవాడు కేవలం  మాటల తో సంతృప్తి పడడు..చేతల లోనికి దిగుతాడు.అందుకనే మన నేతల కి కూడా బెరుకు కావచ్చును.My children will work like lions ..!అని ఆయన అన్నారంటే దాని వెనక నిజంగా అంత అర్ధమూ ఉంది. ఈనాటికీ కాషాయ రంగు వస్త్రాలు ధరించిన వారికి ఒక గౌరవం ఉన్నదంటే ఇలాంటి వారి వల్లనే గదా..సరే..ఒక అసలు ఉన్నప్పుడు దానికి నకళ్ళు పుట్టుకు రావడమూ లోక రీతి యే గదా ..!

1 comment:

  1. Hello Sir!
    We have released new Blog Aggregator , it shows telugu blogs too.
    Please visit http://readandblog.com

    ReplyDelete