Albert Camus-ఆయన చేసిన యోచనలు
ఈ మానవుని అస్తిత్వానికి ఏమైనా అర్ధం ఉన్నదా,జీవుల చర్యల్ని పరిపాలించే అత్యున్నత వ్యవస్త ఏదైనా ఉందా,అంతిమ తీర్పు వంటిది ఏమైనా ఉందా ..ఇట్లా అనేక ప్రశ్నల ద్వారా లొలోపల మధనపడి తనదైన పద్ధతి లో రచనలు చేసిన Albert Camus కొన్ని భావ పరంపల్ని ప్రపంచం ముందు ఉంచి వెళ్ళాడు.మనిషి జీవితం కొనసాగుతున్నది రేపు ఉన్నది అనే ఆశ మీదనే..ఆయితే ఆ రేపు అనేది ఒక రకంగా తనకి శత్రువు కూడా ..ఎందుకంటే దాని లోనే అతని మరణం కూడా ఉంటుంది.అయితే మనిషి కి తన మరణం గురించి సరైన ఎరుక ఉండదు..హేతు బద్దత గాని సైన్స్ గాని ఈ ప్రపంచం అనే చిక్కుముడిని విప్పవు.అలా ప్రయత్నించడం కూడా వృధా ప్రయాస.
ఈ విధంగా The Myth of Sisyphus అనే వ్యాసం లో ఆయన చేసిన యోచనలు Absurdism అనే దారికి సాహిత్య లోకం లో స్థానం కల్పించాయి.ఒక గ్రీక్ పౌరాణిక పాత్ర తో ఇది సాగుతుంది.అసలు Absurdism అంటే ఏమిటి...ఏ అర్ధమూ లేని ఓ గందర గోళ ప్రపంచం లో మనిషి జీవితం వ్యక్త పరచబడి ఉన్నది అని నమ్మే ఒక దారి. సాత్రె యొక్క Individual existence అనే యోచన గాని,Kierkegaard అనే మతపరమైన కొన్ని నమ్మకాలు సత్యాన్ని దూరం చేస్తున్నవని అనే యోచన గాని Albert Camus చేసిన యోచనకి కొద్ది తేడాలతో ఒకే లా ఉంటాయి.అత్యంత సూక్ష్మ పరిశీలన,అనుభూతి అవసరం ఇక్కడ..!
1913 నుంచి 1960 మధ్య కాలం లో జీవించిన ఫ్రెంచ్ రచయిత Albert Camus ప్రపంచం లో అత్యంత పిన్న వయసులో నోబెల్ బహుమతిని పొందిన వ్యక్తి..44 వ ఏట ఈయన దానిని పొందగా Rudyard Kipling 42 వ ఏట పొందాడు.వ్యాసాలు,కధలు,లేఖలు,నవలికలు వీటన్నిటి ద్వారా Albert Camus తన భావ జాలాన్ని పరిచి వెళ్ళాడు. A Happy death,The Stranger వంటి రచనలు బాగా ప్రసిద్ది పొందాయి.The First Man అనేది ఆయన ఆత్మకధ.
కొద్దిగా The Stranger గూర్చి చెప్పుకుందాము.ఇంచుమించు 77 పేజీలు ఉంటుందిది.Meursault ప్రధాన పాత్రధారి.అతను అల్జీర్స్ లో ఓ కంపెని లో ఉద్యోగం చేస్తూంటాడు.తల్లి మరణించినట్లు ఒక రోజు తంతి వస్తుంది.ఊరికి బయలు దేరుతాడు.బస్సు లో ఎక్కి కూర్చుని నిద్రలో జోగుతున్న ఇతణ్ణి చూసి పక్కనే ఉన్న సైనికుడు అడుగుతాడు.ఏమిటి విషయం..దూరం నుంచి వస్తున్నావా..అని.!తల్లి పోయిన సంగతి..తంతి విషయం చెబుతామని అనుకుని ఆగిపోయి ..ఊ ..అని చెప్పి నవ్వి ఊరుకుంటాడు.ఆమె ఒక వృద్ధాశ్రమం లో పోయింది గదా ...అక్కడికి వెళతాడు..చివరి సారి శవం ని చూస్తారా ..కాఫిన్ మూత తీయనా అని చెప్పి అక్కడి వాళ్ళు అడగ్గా ..వద్దు అంటాడు.అలాగే నిశబ్దం గా కూర్చుంటాడు.సిగరెట్ కాల్చుకుంటూ.అతనికి ఎలాంటి ఆలోచనలు ఉండవు..ఆమె మీద...ప్రేమ లేదా ద్వేషం ఏదీ వ్యక్తపరచడు.ఏ మనిషి అయినా పోవలసిందే గదా దానికి ఎవరూ ఎవరికోసం చింతించనవసరం లేదు అని అతని భావన.ఆ హోం లోనే కొంతమంది వ్యక్తులు పరిచయమవుతారు.వాళ్ళంతా అతని తల్లి గూర్చి మంచిగా చెబుతారు.దానిలో అతని తల్లి యొక్క యొక్క ప్రేమికుడు ఉంటాడు.సెలవు తీసుకుని బయలు దేరుతాడు..యజమాని అడుగుతాడు..ఏమిటి ఇంత త్వరగా వచ్చావు..ఆమె వయసు యెంత ..అని.బహుశా అరవై అలా ఉండవచ్చు అని తన పనిలో మునిగిపోతాడు.ఆ తెల్లారి అతని ప్రియురాలు తో ఆనందం గా గడుపుతాడు.ఇట్లా జీవితానికి ఎక్కువ అర్ధం వెదకకుండా జీవిస్తుంటాడు అతను.కిటికి పక్కనే నిలబడి కిందన వస్తూ పోయే మనుషుల్ని గమనిస్తూ ఒక సాక్షి లా ఉండటాన్ని కొన్ని పేజీల్లో వర్ణిస్తాడు.చివరికి ఇతను ఒక అరబ్ ని చంపిన కేసు లో జైల్లో వేస్తారు.చావు కోసం ఎదురు చూస్తూండగా కధ అయిపోతుంది.ఈ రచన లో వివిధ సంకేతపరమైన పద్దతి లో అంశాలన్నీ నడుస్తూంటాయి. సంభాషణలు గాని,పాత్రల నడవడిక గాని ఒక లోతైన తాత్వికతని ఒక చిన్న తేనె పోసిన కధ ద్వారా చెబుతాడు.

No comments:
Post a Comment