ఏ ప్రాంతపు ఇంగ్లీష్ ఉచ్చారణ బావుంటుంది..?
ఈ మాట మనం వింటూనే ఉంటాము కాని ఏదీ ఇదమిద్ధంగా నిర్ణయించుకోలేము.భారత దేశం లో ఎక్కడ ఉన్న వారైనా వారి యొక్క మాతృ భాష ప్రభావం వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ మీద తప్పనిసరిగా ఉంటుంది.కాకపోతే ఎవరిది వారికి బాగున్నట్లు అనిపిస్తుంది.అసలు అది ఒక తప్పు కూడా కాదు.నూటికి నూరు శాతం ఆ చలి దేశాల వారి ఉచ్చారణ రమ్మన్నా రాదు.ఆ స్వరం అలా సెట్ అవుతుంది...అక్కడ కొన్నాళ్ళు ఉంటే మారవచ్చునేమో..అయినా బ్రిటన్ లోనే ప్రాంతాలని అనుసరించి ఉచ్చారణ లో తేడాలున్నాయి.వెల్ష్,ఐరిష్,స్కాటిష్ ప్రాంతీయ తేడాలున్నాయి.సరే..ఇక అమెరికా,కెనడ,ఆస్ట్రేలియా దేశాల మధ్యన తేడాలున్నాయి.అది అత్యంత సహజం కూడా.
కొన్ని పదాల్ని చక్కగా పలుకుతూ కొన్నిటిని మనకి తెలియకుండానే మరోలా పలుకుతుంటాము.కొద్దిగా ఉచ్చారణ లో తప్పు దొర్లిందని ఎదుటి వారిని చిన్న చూపు చూడటం కూడదు.వారిని నొప్పించకుండానే అది సరిదిద్దటం చేయవచ్చు.బాగా ఇంగ్లిష్ పరిజ్ఞానం ఉన్నవారు కూడా వారి మాతృ భాష ప్రభావం పడిన భాషనే నిస్సంకోచంగా మాట్లాడుతారు,ఇంగ్లీష్ లో రచనలు చేసే బెంగాలీ,ఒరియా,పంజాబీ,దక్షిణాత్యులు కొంతమంది తో నాకు పరిచయం ఉన్నది. వెంటనే మాట్లాడేప్పుడు పోల్చుకోలేము గాని కొద్ది సేపు అనుభవం తో ఏ పదాన్ని ఎలా పలుకుతున్నారో తెలిసిపోతుంది.కనుక ఇబ్బంది ఏమీ ఉండదు.
ఉదాహరణకి Zero అనేదాన్ని Seiro అని,Loan అనేదాన్ని Laan అని,Simply అనే పదాన్ని Zimply అని Temple అనే పదాన్ని టెంబుళ్ అని ఇట్లా మళయాళీలు పలుకుతూంటారు.మరొకటండొయ్..రమ్య ని రెమ్య అని లక్ష్మి ని లెక్ష్మి అని సదరు సోదరులు పిలుస్తుంటారు.ఇక బెంగాల్ వాళ్ళు ...About ని Obout అని,Very ని Vehry అని ఇట్లా పలుకుతుంటారు.బిబేకానంద ,రబీంద్రనాధ్ ల విషయం మనకి తెలిసిందే.ఒవెల్ సౌండ్స్ ని మరీ ఒత్తి పలకడం గాని,తగ్గించినట్లు పలకడం గాని చేస్తుంటారు.
ఇక పంజాబీ వాళ్ళు sport చేస్తున్నా అని అంటే Support చేస్తున్నట్లుగా అనుకోవాలి.ఇట్లా చాలా ఉన్నాయి.అలాగని వీరంతా తక్కువ వాళ్ళేమీ కాదు.ఆంగ్ల భాష లో పెన్ను పెడితే అద్భుతంగా రాసుకుపోతారు.అదే మాతృ భాష గొప్ప తనం మరియు ప్రత్యేకత కాబట్టి తక్కువ గా చూడకూడదని చెప్తుంటాను. అంత దాకా ఎందుకు మన దైనందిన జీవితం లో ను కొన్ని పొరబాటు ఉచ్చారణ లు చేస్తుంటాము.Debris ని Debree అని పలకాలి,Dengue ని Den-gee అని,Monk ని Munk అని Pizza ని Peet-za అని పలకాలి.అది మనకి తెలియదని కాదు లేగాని నోటికి సులువుగా ఉంటుందని కొన్ని అలా పలికేస్తుంటాము.
నేను చూసినంతలో బాగా ఆంగ్ల పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరూ మాతృ భాష ప్రభావాన్ని తప్పుపట్టరు.ఎందుకంటే సర్వ సహజంగా అచేతనంగా జరిగేదని వారికి తెలుసు.చాలామంది నేటివ్ అమెరికన్లు గాని యూరపియనులు గాని మనం ఏ కొద్ది చక్కగా మాట్లాడినా అభినందిస్తారు.ఏవైనా తప్పు దొర్లినా మర్యాదకరమైన పద్ధతి లో పరోక్ష పద్ధతి లో చెపుతారు.మన వాళ్ళతో ఏమంటే బ్లంట్ గా ఇక నువు ఇంగ్లీష్ కి పనికి రావు పో అన్నట్లు అవమానించినట్లు చెపుతారు.అందుకే పాపం చాలామంది ప్రాక్టీస్ చేయాలన్నా ఇబ్బంది గా ఫీలవుతారు.అసలు ఇంగ్లీష్ అనేది ఈ రోజున ఏ ఒక్క దేశం వారిదో కాదు,అనేక అనేక తేడాలతో ప్రపంచం మొత్తం దీను.ఇన్ని భాషలున్న ఈ దేశం లో ప్రతి ఒక్కరు తమ భాషే సుపీరియర్ అనుకుంటూ ఇంకో భాషని ద్వేషించడం అర్ధం లేని విష్యం..ఒక కామన్ లాంగ్వేజ్ గా పోనీ హిందీనైనా దేశం మొత్తం మీద బలవంతం గా నైనా రుద్దగలిగారా అదీ లేదు.అయినప్పుడు ఏకత్వం ఎలా వస్తుంది..బ్రిటిష్ వారి పుణ్యాన ఆ గేప్ ని ఇంగ్లీష్ తీర్చింది.

No comments:
Post a Comment