Sunday, July 24, 2016

"కబాలి" సినిమా ఈరోజే చూశాను...సరే...నా కోణం లోనుంచి నేను ఓ నాలుగు ముక్కలు రాస్తాను.సినిమా మొత్తం మీద చెప్పాలంటే కూచోబెడుతుంది,మరీ బోరు గా అనిపించలేదు.ఒక వెరైటి ని హీరో పరంగా గాని,టేకింగ్ పరంగా గాని దర్శకుడు తీసుకొచ్చాడు.ఎప్పుడూ పంచ్ డైలాగ్స్ తో Flamebuyont   గా కనిపించే రజనీ కాంత్ ఈ సినిమా లో అండర్ ప్లే చేశాడు.అదే సమయం లో కొన్ని సార్లు సునామి లా దూసుకొస్తూ..!దాని వల్ల ఈయనేమిటి ఈసారి ఇలా ..అని తోచడం సహజమే కదా.

గతం లో కూడా ఓసారి చెప్పినట్లు గుర్తు, గాడ్ ఫాదర్ నవలని చదివి అర్ధం చేసుకున్నవాడు ఇలాంటి మాఫియా సినిమాల్ని అనేక కోణాల్లో మార్చి మార్చి తీయగలడు.ఆ ఫిలాసఫీ అంతే.అసలు డాన్ అంటే ఎగబడి అందర్నీ అడ్డంగా నరికిపారేసే వాడు కాదు..అతని జీవితం లోను అందరి మనుషులకి మల్లేనే మిగతా అనుభూతులు ఉంటాయి.అవమానాలు,దెబ్బ తినడాలు,భార్యా పిల్లల పట్ల అనురాగాలు,కృతజ్ఞతలు,నమ్మక ద్రోహాలు ఇట్లా అన్నీ ..అన్నీ ..ఉంటాయి..మళ్ళీ అదే సమయం లో దేవుడు ఇతడిని ప్రత్యేకంగా తయారు చేశాడా అన్నట్లు ఇతరుల జీవితాల్ని తన మేధో బలం తో ,మజిల్ పవర్ తో   సరైన సమయం లో మార్చివేయగలగడం ..ఇది డాన్ పాత్ర లో మేరియో ప్యూజో చిత్రించినది.

 ఎవరైతే మానసికంగా ,శారీరకంగా కాలం చేత కొట్టివేయబడతారో..రక్తమోడ్చుతారో ..ఆ మేరకు ఆ అల మళ్ళీ పైకి లేవవలసిందే,అదంతా ఘనమైన కార్యాల్ని చేయడానికి ప్రకృతి ఇచ్చే శిక్షణ.దానికి విద్య తో సంబంధం లేదు.మనసు తోనే సంబంధం.విద్య తోడయితే మరింత శోభిస్తుంది,ఈ కబాలి ని చూస్తే నాకు అలా గుర్తుకి వచ్చింది.మీరు మన దేశమని కాదు ఎక్కడైనా చూడండి..గొప్ప సంపదని గాని నాయకత్వాన్ని గాని ఆర్జించిన వారు గొప్ప చదువులు ఉన్నవారు కాదు గాని మనుషుల భావోద్వేగాలు ఏ ఏ సమయాల్లో ఎలా ఉంటాయో వాటిని ఎలా ఏ క్రియల చేత మళ్ళించ వచ్చునో అనుభవాల ద్వారా తెలుసుకున్నవాళ్ళే...!దాని లో ప్రయోగాలు చేసే వాళ్ళే..దాన్ని డిగ్రీల్లో కొలిచేది కాదు.

సరే...సినిమా లోకి వద్దాము.సినిమా లో చాలా చోట్ల గాడ్ ఫాదర్ ముద్రలు కనబడతాయి.అయితే తమిళులు మనకంటే చురుకైన వాళ్ళు గనక దాన్ని వారి జీవితానికి అన్వయం చేసుకొని దీనిని తీశారు.అలా లేకపోతే వాళ్ళు ఆమోదించరు.కాని మనం ఆమోదిస్తాము.లేక పోతే కబాలి అనే పేరు ఏమిటి..అసలు మనకి ఏమాత్రమైనా సంబంధం ఉన్న పేరా..కాని హైప్ క్రియేట్ అయితే చాలు..దానిలో బడి కొట్టుకుపోవడమే తెలుగు వారి ట్రెండ్.పాత తమిళ సినిమాలు చూడండి....వాటిల్లో మెయిన్ విలన్ పక్కనుండే చిన్నపాటి రౌడి పేరు కబాలి అని ఉంటుంది.ఎలా అంటే "ఒరే కబాలి" వాణ్ణి వేసేయ్య్ రా అంటే ఎస్ అంటాడు ఈ పాత్ర.ఆ టైపుదన్నమాట..ఆ పేరు..! సరే...కపాలీశ్వరుని పేరు మీద వచ్చినదే అది...మనకి గనక వెంకటేశ్వరుని పేరు మీద వెంకన్న అని వచ్చినట్లుగా..!!! మరి మన తెలుగు వాళ్ళు వెంకన్న అనే పేరు మీద తమిళం లో ఓ సినిమా వదిలితే అసలది జనాల్లోకి పోతుందా..? మరి అందుకే మనల్ని తమిళులు గొల్టీలు(గొర్రెలు)  అని పిలిచేది...మనం వాళ్ళని అరవ వాళ్ళు అనట్లేదూ..!

గట్టిగా చెప్పాలంటే ఈ స్టోరి మొత్తం మలేషియా లో ని తమిళుల బాధల గురుంచి.వారిని కాపాడిన కబాలి గురుంచి.కాకపోతే డబ్బింగ్ లో ఇండియన్స్ అని అంటాడు అది వేరే విష్యం ..!సినిమా ఆడాలిగా ఇండియా మొత్తం..ఇంకా బయట...!ఇదంతా ఏదో రజనీ కాంత్ అంటే నాకు పడక రాయడం లా.కొన్నాళ్ళు ఆ తమిళ భూమి లో ఉన్న వాడిగా తోచి రాశా..అంతే.ఆ చేతిని కోసి పార్శిల్ పంపించడం,డాన్ బుల్లెట్ దెబ్బలు తినడం,అతని పక్కనే ఉండే వ్యక్తి నమ్మక ద్రోహం చేయడం ,ఇవన్నీ ఎందుకు గాని మన దేశం నుంచి వెళ్ళి అక్కడి తమిళులకి ఆరాధ్యుడి లా మారడం,అదే విధంగా ఇంకా కొన్ని సన్నివేశాల్లో ....అంతా గాడ్ఫాదర్ ఫార్ములానే..అనుసరించింది,మీకు డౌట్ ఉంటే మరి ఒక సారి చదివి చూడండి..నా తెలుగు అనువాదాన్ని.కాకపొతే తమిళ నేటివిటి ని చొప్పించారు.మీరు మేరియో ప్యూజో ఒరిజినల్ చదివితే ..అది ఇంకా బాగుంటుందని ఇందుమూలము గా మనవి చేసుకొంటున్నాను.

మీరు బాగా ..నిశితంగా  గమనించినట్లయితే ..హీరో దళిత వర్గం నుంచి వచ్చినట్లు అర్ధం అవుతుంది.చివరి లో చోటుచేసుకున్న కొన్ని సంభాషణ ల ద్వార..!అయితే మన తెలుగు డబ్బింగ్ లో VAGUE   గా ఉన్నది అది..వీలైతే తమిళ్ ఒరిజినల్ చూడండి ఇంకా బాగా అర్ధం అవుతుంది.ద్రవిడ ఉద్యమం ద్వారా తమిళ నాడు లో బ్రాహ్మణేతర కులాలన్ని గొప్ప చైతన్యాన్ని పొందాయి,పారిశ్రామికవేత్తలు గాని కళాకారులు గాని ,రాజకీయనాయకులు గాని దళితులు లో కూడా అక్కడ ముందుకు వచ్చారు..ఒక ఇళయ రాజా గాని భారతి రాజా గావచ్చును అలాంటి వారు ఎందరో ముందుకు వచ్చారు..అయితే
మన తెలుగు లలో ఒకటి రెండు శూద్ర కులాలు బాగా ప్రభావితమైనాయి. 

No comments:

Post a Comment