Saturday, July 30, 2016

జస్టిస్ కె.టి.థామస్ ...ఒక గత కాలపు జ్ఞాపకం

అది 2008 వ సంవత్సరం...డిసెంబర్ నెల చివరి వారం, కేరళ లోని కొట్టాయం అది.ఒక కళాశాల లో జరిగిన మీటింగ్ కి ప్రొఫెసర్ అబ్రహాం గారు పిలుపు మేరకు హాజరయినాను.కేరళ కి వెళ్ళడం అదే ప్రధమం.అప్పటికి ఈ ఫేస్ బుక్ లు,బ్లాగుల ప్రపంచం పెద్దగా నాకు తెలియదు.తెలిసి ఉంటే కొన్ని మధుర అనుభూతులను ఆన్ లైన్ లో ఉంచుకునే అవకాశం నాకు కలిగేది.సరే...మనసు లోని అనుభూతులను ఎవరు చెరపగలరు..?అక్కడ ఆ మీటింగ్ లో సుప్రసిద్ధ న్యాయకోవిదుడు ,సుప్రీం కోర్ట్ మాజీ జడ్జ్ జస్టిస్ కె.టి థామస్ గారిని కలవడం వారి తో ఏవో నాకు తోచిన విషయాలని పంచుకోవడం ఒక నిలిచిపోయే జ్ఞాపకం.అప్పటికి నాకు తెలిసింది రాజీవ్ గాంధి హంతకుల విషయం లో ఆయన ఇచ్చిన తీర్పు...ఇలాంటివి. ఆ మహానుభావుడితో ఓ ఫోటో కూడా దిగాను కాని ఎక్కడుందో దొరకలేదు.అయితే ఆ సందర్భం లో పంజాబ్ లోని స్వర్ణ దేవాలయం లోతనకి జరిగిన ఒక గౌరవ సత్కారం గురుంచి వివరించారు.అది అలాగే నిలిచిపోయింది లోపల.

ఈ మధ్య " గుడ్ ఫ్రైడే" సందర్భంగా చెలరేగిన ఒక వివాదం లో కూడా ఆయన వ్యాఖ్యానించిన తీరు ఒక ఉదాహరణగా నిలిచిపోతుంది.భారత దేశం లో ఉన్న ఒక  విశేషమైన రాష్ట్రం కేరళ అనిపించింది నా ఆ పర్యటన లో..!నిజంగా చదవడానికి వారు ఇచ్చే ప్రాముఖ్యత కి ముగ్ధులము అవక తప్పదు...కేరళ రాష్ట్రం సమీపిస్తుండగానే బఠాణీలు అమ్మినట్లుగా పుస్తకాలు  అమ్ముతుంటారు లోపలికి ఎక్కిన వ్యాపారం చేసుకునే పిల్లలు ..! నేనిది ఒక్క కేరళ లోనే చూశాను.ఆ కేరళ లో నేను అప్పుడు తిరిగిన  నాలుగు జిల్లాల లో పాన్ షాప్ ల కంటే పుస్తకాల షాపులు ఎక్కువ గా కనబడ్డాయి.ఫౌంటైన్ హెడ్ కొన్నది అలాంటి ఒక షాపు లోనే.

No comments:

Post a Comment